banner
Banner

ఈ బంగాళదుంప బిస్కెట్ ఎంతో తేలికగా కరకరలాడుతూ, రుచికరంగా వేఫర్‌ను తలపిస్తుంది. కానీ క్రాకర్ శైలిలో బేక్ చేయబడింది

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే మరియు వినియోగదారులకు ప్రాధాన్యతనిచ్చే ITC Ltd. కు చెందిన సన్‌ఫీస్ట్ బిస్కెట్ మరియు కేక్స్ విభాగం మార్కెట్‌కు పరిచయం చేస్తోంది సరికొత్త ప్రొడక్ట్ సన్‌ఫీస్ట్ ఆల్‌రౌండర్ బిస్కెట్ (Sunfeast All-Rounder). సన్‌ఫీస్ట్ ఆల్‌రౌండర్ ఒక క్రంచీ, మరియు రుచికరమైన మసాలా జల్లబడిన సరికొత్త బంగాళ బిస్కెట్. ఇది భారతదేశంలో అత్యంత పలుచగా తయారు చేయబడిన బిస్కెట్లలో ఒకటి. బంగాళాదుంపను బేస్ చేసుకుని ఉత్పత్తి అవుతున్న 6,000 కోట్ల రూపాయల క్రాకర్ బిస్కెట్ల మార్కెట్ విభాగంలో విప్లవాత్మకంగా అడుగుపెడుతోంది సన్‌ఫీస్ట్.

వినూత్న ఆలోచన నుంచి వస్తున్న ఉత్పత్తి సన్‌ఫీస్ట్ ఆల్‌రౌండర్. క్రాకర్ బిస్కెట్ మార్కెట్లోకి కొత్తగా దూసుకొస్తుంది. వినియోగదారులు, గృహిణులు ఖచ్చితంగా ఈ మసాలా క్రాకర్ బిస్కెట్లకు ఆకర్షితులవుతారు. రోజువారీ వినియోగంలో భాగంగా వీటికి ప్రాధాన్యతను ఇస్తారనడంలో సందేహం లేదు. సన్‌ఫీస్ట్ ఆల్‌రౌండర్ బంగాళదుంప బిస్కెట్లు తేలికగా కరకరలాడుతూ అన్ని సమయాల్లో తినగలిగే అల్పాహారం.మరియు దీనిలో ఉన్న బంగాళదుంప ఈ బిస్కెట్‌కు ఒక ప్రత్యేకమైన ఆకృతిని కలిగిస్తుంది. అంతేకాదు వాటిపైన జల్లిన మసాలా వినియోగదారులకు తగినంత రుచిని ఘాటును అందిస్తుంది. అంతేకాదు కొంతసమయం ఉండే మంచి సువాసన మరియు చట్‌పటా రుచిని మీ నోటికి అందిస్తుంది.

ప్రొడక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా,  ITC లిమిటెడ్, ఫుడ్స్ డివిజన్, బిస్కెట్స్ & కేక్స్ క్లస్టర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ అలీ హారిస్ షేరే గారు మాట్లాడుతూ డార్క్ ఫాంటసీ, ఫార్మ్‌లైట్ నట్స్, వేదా డైజెస్టివ్, సన్‌ఫీస్ట్ కేకర్ మరియు మరెన్నో విభిన్నమైన ఉత్పత్తులు మా ఈ పోర్ట్‌పోలియో విజయానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. నిరంతరం సరికొత్త ఆవిష్కరణలతో ఉత్పుత్తులను మార్కెట్లో విడుదల చేస్తున్నాం. ఇందులో భాగంగానే క్రాకర్ ఫార్మాట్‌లోని ప్రీమియం ప్రొడక్ట్‌గా సన్‌ఫీస్ట్ ఆల్‌రౌండర్ వస్తోంది. బిస్కెట్ల విభాగంలో క్రాకర్లు భారీగా మార్కెట్ వాటా కలిగి ఉంది. అందుకే ఇందులో మా పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేయడానికి మరియు వినియోగదారులకు ట్రెండ్‌సెట్టింగ్ మరియు సంతోషకరమైన క్షణాలు ఆస్వాదించడానికి కావాల్సిన ఉత్పత్తులను పరిచయం చేస్తోంది. ఇదే మాకు సరైన సమయంగా నమ్ముతున్నాం. మేము బిస్కెట్ల విభాగంలోని వినియోగదారుల అనుభవాన్ని తిరిగి నిర్వచించాలనుకుంటున్నాము. క్రాకర్ విభాగంలో మరియు సన్‌ఫీస్ట్‌ను బిస్కెట్లు & కేక్‌లలో నూతన ఆవిష్కరణలతో సరికొత్త విజేతగా నిలబడాలని అనుకుంటున్నట్లు చెప్పారు అలీ హారిస్ షేర్.  

సన్‌ఫీస్ట్ తాజాగా పరిచయం చేస్తున్న ఈ బిస్కెట్లు 32.9 గ్రాములు ప్యాకెట్ 10 రూపాయిలకు, 75 గ్రాముల ప్యాక్ 20 రూపాయలకు అందుబాటులో ఉంటాయి. సన్‌ఫీస్ట్ ఆల్‌రౌండర్ ముందుగా దక్షిణ భారత దేశంలోను, పశ్చిమ బెంగాల్ మరియు ఈశాన్య రాష్ట్రాల మార్కెట్లలో ITCstore.in తో పాటు జనరల్ ట్రేడ్ అవుట్‌లెట్స్ మరియు మోడరన్ ట్రేడ్ అవుట్‌లెట్ల ద్వారా అందుబాటులో ఉంటాయి.

ITC Foods గురించి: ITC లిమిటెడ్ యొక్క విభాగం

భారత దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆహార ఆధారిత వ్యాపారం, మూడో అతి పెద్ద ఫుడ్-బేస్డ్ కంపెనీగా ITC Foods బిజినెస్ గుర్తింపు పొందింది. ఆశీర్వాద్, సన్‌ఫీస్ట్, బింగో!, యప్పీ!, కిచెన్స్ ఆఫ్ ఇండియా, బి నేచురల్, మింట్-ఓ, కేండీమేన్, ఫాబెల్, సన్‌బీన్, మరియు గమ్ఆన్ వంటి ప్రముఖ బ్రాండ్లతో వినియోగ మార్కెట్లో తన పట్టును కంపెనీ నిలబెట్టుకుంటోంది. ఈ రోజుల్లో ఫుడ్స్ వ్యాపారాలను మార్కెట్లో పలు విభాగాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. స్టేపుల్స్, స్పైసెస్, రెడీ-టు-ఈట్, స్నాక్ ఫుడ్స్, బేకరీ & కన్‌ఫెక్షనరీలతో పాటు తాజాగా పరిచయం చేసిన జ్యూస్ & బెవరేజ్‌ల విభాగాలు ఇందులో ఉన్నాయి.

ITCకి చెందిన అంతర్గత ఆర్&డీ సామర్ధ్యంతో అభివృద్ధి చేసిన వైవిధ్యత గల, విలువ ఆధారిత ఉత్పత్తులు కోట్ల కొద్దీ కుటుంబాలకు, ITC Foods బ్రాండ్స్ సేవలు అందిస్తున్నాయి. వినియోగ అవసరాలను లోతుగా అర్ధంగా చేసుకోవడం, భారతీయ వినియోగదారుల రుచి-అభిరుచిలను అర్ధం చేసుకోవడం, వ్యవసాయ-మూలాల నుంచి సేకరించడం, శక్తివంతమైన ప్యాకేజింగ్ మరియు అసమానమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్‌ఇందుకు సహకరిస్తున్నాయి.

అత్యధిక నాణ్యత, భద్రత, పరిశుభ్ర ప్రమాణాలను తయారీ విధానం మరియు సరఫరా చెయిన్‌లలో నిర్వహించడంలో, ఎటువంటి పరిస్థితులలోను రాజీ పడబోమనే నిబద్ధతను ITC సంస్థ కలిగి ఉంది. ITC సొంత తయారీ యూనిట్లు అన్నీ ప్రమాద విశ్లేషణ మరియు సంక్లిష్ట నియంత్రణ కేంద్రం (HACCP) ద్వారా ధృవీకరణను పొందాయి. అన్ని తయారీ యూనిట్స్‌లోను నాణ్యతా ప్రమాణాల కొనసాగింపును, నిరంతరం ఆన్‌లైన్ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుంది. ప్రాసెస్ కంట్రోల్‌కు అదనంగా, ఆహార ఉత్పత్తుల తయారీకి అవసరమైన మూల పదార్ధాల ఎంపికలోనే, అత్యంత సూక్ష్మత కలిగిన నాణ్యత ప్రమాణాలను కఠినంగా పాటిస్తామని ITC ధృవీకరిస్తుంది.

తయారీ రంగం, డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ వంటి అన్ని వ్యాపారాలలోను పెట్టుబడులను, ఈ విభాగం కొనసాగిస్తుంది. తద్వారా దేశంలో బ్రాండెడ్ ప్యాకేజ్‌డ్ ఫుడ్స్ వ్యాపారంలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా ఎదగాలనే లక్ష్యాన్ని అందుకోవడంతో పాటు, ఈ మార్కెట్‌లో ఉన్న మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఉత్తర అమెరికా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ మరియు ఆస్ట్రేలియా వంటి కీలక భౌగోళిక ప్రాంతాలకు, ITC Foods విభాగం తమ ఉత్పత్తులను ఎగుమతులు కూడా చేస్తోంది.

Banner
, ,
Similar Posts

ప్రతిష్ఠాత్మక మెక్‌డొనాల్డ్స్ హ్యాపీ మీల్ TM ఇప్పుడు లభిస్తుంది సరికొత్త ఆరోగ్యకరమైన రుచిలో, ITC యొక్క బీ నాచురల్ మిక్స్‌డ్‌ ఫ్రూట్ (జోడించిన చక్కెర లేదు) మరియు వేడిగా, తాజాగా ఉండే కార్న్ కప్‌తోపాటు

Latest Posts from Vartalu.com
Banner