Banner
banner

ప్రపంచవ్యాప్తంగా భారతీయ కంటెంట్ కోరుకునే వీక్షకుల కోసం వివిధ భాషలు, వివిధ జోనర్లలో అర్థవంతమైన, ప్రయోజనకరమైన కంటెంట్‌ అందించే భారతదేశపు అతి పెద్ద ఓటీటీ వేదిక ‘జీ 5’. వినోదం, ఉల్లాసం వంటి అంశాలకు మాత్రమే కాదు… దేశభక్తికి ‘జీ 5’ పెద్దపీట వేస్తుంది. 26/11 ముంబయి ఉగ్ర దాడుల్లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు నివాళిగా ‘స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌ : 26/11’ అందించింది. అది వీక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో పాటు విజయవంతమైన సిరీస్ గా పేరు తెచ్చుకుంది. ‘స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌’ ఫ్రాంచైజీలో రెండో సీజన్ ‘స్టేట్ ఆఫ్ సీజ్ : టెంపుల్‌ అటాక్‌’ను ఒరిజినల్ మూవీగా తెరకెక్కించారు.

‘జీ 5’ ఒరిజినల్ మూవీ ‘స్టేట్ ఆఫ్ సీజ్ : టెంపుల్‌ అటాక్‌’ మరికొన్ని గంటల్లో ‘జీ 5’ ఓటిటి వేదికలో విడుదల కానుంది. జూలై 9… అనగా శుక్రవారం హిందీ, తమిళ్‌, తెలుగులో ఏకకాలంలో ప్రదర్శించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు వీక్షకులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో ప్రముఖ హిందీ నటుడు అక్షయ్‌ ఖన్నా నటించారు. చాలా సంవత్సరాల తర్వాత ఆయన యూనిఫామ్‌లో కనిపిస్తుండటం విశేషం. ‘స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌:26/11’లి ఎన్‌ఎస్‌జీ కమాండోగా నటించిన వివేక్‌ దహియాను ఈ ఒరిజినల్ మూవీలోనూ చూడవచ్చు. వీరితో పాటు గౌతమ్‌ రోడె, సమీర్‌ సోని, పర్వీన్‌ దబాస్‌, మంజరి ఫడ్నవీస్‌ ఈ సినిమాలో ప్రధాన తారాగణం. ‘స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌:26/11’ రూపొందించిన కాంటిలో పిక్చర్స్‌ (అభిమన్యు సింగ్‌) ఈ చిత్రానికి నిర్మాత. ‘అభయ్‌ 2’కు దర్శకత్వం వహించిన కెన్‌ ఘోష్‌ దీనికి దర్శకుడు. కర్నల్‌ (రిటైర్డ్‌) సందీప్‌ సేన్‌ (26/11 భయానక ముంబయి దాడుల సమయంలో ఎన్‌ఎస్‌జీకికి సెకండ్‌ ఇన్‌ కమాండ్‌) ఈ
స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌ ప్రాజెక్టులకు కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు.

వాస్తవ ఘటనల స్ఫూర్తితో రూపొందించిన ‘స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌: టెంపుల్‌ అటాక్‌’ మన భారత సైనికులకు నివాళి. భారతీయుల ధైర్యానికి వందనం ఇది. ‘స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌’ ఫ్రాంచైజీలో మరిన్ని చిత్రాలు రానున్నాయని ‘జీ 5’ వర్గాలు తెలిపాయి. అమాయక ప్రజల ప్రాణాలు కాపాడేందుకు, ఉగ్రవాదులను ధైర్యంగా బంధించేందుకు/మట్టుబెట్టేందుకు ఎన్‌ఎస్‌జీ సదా తన సంకల్పాన్ని, సంసిద్ధతను ప్రదర్శిస్తునే ఉంటుంది. ఆలయంపై జరిగిన భయానక దాడి ఘటనల వెనుకున్న యాక్షన్‌ దృశ్యాలను ఈ చిత్రం మీ ముందు ఉంచుతుంది. థ్రిల్‌, యాక్షన్‌, డ్రామా, సస్పెన్స్‌తో నిండి ఉన్న ఈ చిత్రం వీక్షకులను మునివేళ్లపై నిలబెడుతుంది.

దర్శకుడు కెన్‌ ఘోష్‌ మాట్లాడుతూ… “స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌: టెంపుల్‌ అటాక్‌, ఇది కేవలం సినిమా మాత్రమే కాదు… మనల్ని కాపాడేందుకు అనుక్షణం తమ ప్రాణాలను పణంగా పెట్టే ఎన్‌ఎస్‌జీ కమాండోలు నివాళి ఇది. నౌకాదళ అధికారి కుమారుడిగా నేను సైనిక దళాల శక్తియుక్తులను చూస్తూ పెరిగాను. ‘స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌: టెంపుల్‌ అటాక్‌’లో మన హీరోలకు నివాళి అర్పించేందుకు మా వంతు కృషి మేము చేశాం.‌ ‘జీ 5’లో సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నాను” అన్నారు.

‘జీ 5’లో ‘స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌: టెంపుల్‌ అటాక్‌’ జూలై 9న ప్రసారం కానుంది.

State of Siege: Temple Attack | Official Teaser | Telugu | A ZEE5 Original Film | 9th July on ZEE5 – https://youtu.be/QLYV1DdMdQw

State of Siege: Temple Attack | Official Trailer | A ZEE5 Original Film | Premieres 9th July on ZEE5 – https://youtu.be/CTRJOIXJQGQ

Banner
,
Similar Posts
Latest Posts from Vartalu.com