Banner
banner

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 72 వ జయంతి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఘనంగా నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. అదే విధంగా ఈ సంవత్సరం కూడా మహానేత జయంతిని పురస్కరించుకుని నాయకులు, అభిమానులు పేద ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్న సంగతి తెలిసిందే. రాజన్న తనయుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే రైతు బాంధవుడు, వైఎస్సార్‌ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరిగాయి.

ఈ క్రమంలో మురారి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు గారు కాకినాడ పార్లమెంటు సభ్యులు వంగా గీత గారి చేతుల మీదుగా గ్రామ సచివాలయం 1 ప్రారంభోత్సవం జరిగింది.

ఈ సందర్భంగా ఎంపీ వంగ గీత గారు   భావోద్వేగంగా మాట్లాడారు. ఆమె మాటల్లో వైయస్ పై ఉన్న అభిమానం పొంగిపొరలిందనే చెప్పాలి.

వంగా గీత మాట్లాడుతూ … వైయస్ రాజశేఖర్ రెడ్డిగారు మహానేత, మహా మనిషి,మహోన్నతమైన మనిషి అని అన్నారు. ఆయన జయంతి సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి.ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గం MLA జ్యోతుల చంటిబాబు గారి  ఆధ్వర్యంలో వైయస్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించటం జరిగింది.వికలాంగులకు ట్రై సైకిల్స్ పంచటం జరిగింది.మురారి గ్రామంలో రెండు సచివాలయాలు ప్రారంభిస్తున్నాము. రాజకీయాల్లో ఎంత మంది వస్తూ ఉంటారు పరిపాలన చేస్తూ ఉంటారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే కొందరే ఉంటారు అందులో వైయస్సార్ ఒకరు అన్నారు.వైయస్సార్ అనేక సంక్షేమ పథకాలతో ప్రజలను ఆదుకున్నారు అని అన్నారు.

ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు గారు  మాట్లాడుతూ…వైయస్సార్ గారి విగ్రహానికి నివాళులు అర్పించి, మొక్కలు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. నియోజకవర్గం మొత్తం మీద ఓ లక్ష మొక్కలు నాటాలనే ధృడ సంకల్పంతో ముందుకు వెళ్తున్నామన్నారు. మొక్కలు పెంచటం ద్వారా ఆక్సిజన్ లెవిల్స్ పెరుగుతాయనే విషయం అందరికి తెలిసిందే. కానీ గ్రౌండ్ లెవిల్ లో రియాలటీ చూసుకుంటే మొక్కలు పెంపకం అనేది చాలా కష్టమైన వ్యవహారం అని చెప్పుకొచ్చారు. అలాగే సంక్షేమ పధకాలు అందరికీ అందాలి..ఏదన్నా టెక్నికల్ ప్లాబ్లమ్స్ వల్ల ఇబ్బదులు ఎదురైనా పరిష్కరించటానికి ఎంపీ గీత ,తాము సిద్దంగా ఉన్నామన్నారు. నియోజకవర్గానికి ఆడపడచు గా తిరుగుతూ ఏ కార్యక్రమానికి పిలిచినా వచ్చి పాల్గొనడం ఏ కల్మషం లేని వ్యక్తి చేతుల మీదుగా ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు మహానేత జనహృదయనేత రాజశేఖర్ రెడ్డి గారు పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు అని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు గారు తన మాటల్లో వైయస్సార్ గారి దూరదృష్టిని గుర్తు చేసుకుంటూ, ఆయనపై తన అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బండారు రాజా, జనపరెడ్డి సుబ్బారావు, ఒమ్మి రఘురాం, అత్తులూరి నాగబాబు, సర్పంచ్ బచ్చల నాగరత్నం, అప్పారావుకాపు, రాయి సాయి, తోట రవి, తోట విష్ణు, C i సురేష్ బాబు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Banner
Similar Posts
Latest Posts from Vartalu.com