Banner
banner

అన్నగారూ..

దేవుడు ఎలా ఉంటాడు అంటే అందరూ మిమ్మల్నే నే చూపిస్తారు ? ఎందుకంటే..

మిమ్మల్ని చూసేంతవరకు తెలియదు శ్రీకృష్ణుడు ఎలాఉంటాడో….
మీ తేజస్సు తో కూడిన వెలుగు మమ్మల్ని మేము చూసుకునేంతవరకూ తెలియదు శ్రీరాముడు ఎలాఉంటాడో….
మీ రాజసం గమనించేవరకూ తెలియదు దుర్యోధని రూపం, ప్రవర్తన ఎలా ఉంటుందో..
అంతెందుకు మిమ్మల్ని చూసే దాక తెలియదు అసలైన” తెలుగువాడు” ఎలా ఉంటాడో….
మళ్ళి జన్మంటూ ఉంటె తెలుగువాడిగాపుట్టాలని ప్రతీ తెలుగువాడు కోరుకునే స్దాయి గౌరవం కల్పించిన మీరంటే మాకు గౌరవం..

దేవుడు ఎలా ఉంటాడో తెలియని మాకందరికీ, తెలుగు వాళ్లకు దేవుడి రూపాలకు రూపమిచ్చారు.. మీరూ దేవుడయ్యాడు.
మీ అపురూప జ్ఞాపకాలను మనసులో భద్రపరుచుకుంటాం..ఇలా గుర్తు చేసుకుంటాం…మీ ఈ పేరు వినగానే మా అందరి వాడి గుండెలు గర్వంతో ఉప్పొంగుతాయి.

ఏదో సినిమాలో పాటలు తీయడం కోసం నిర్మాతలు వేరే రాష్ట్రమో దేశమూ వెళ్ళి తీద్దాం అని ప్లాన్ వేసుకుని, డబ్బులు కోసం తర్జన భర్జనలు పడుతుంటే,

ఎన్టీఆర్ గారు వచ్చీ “బ్రదర్ వెనక మామూలు గోడ పెట్టు, ముందు నన్ను పెట్టు జనం చూస్తారు” అన్నారట, అది కాన్ఫిడెన్స్ అంటే….

అది ఈ రోజు ఎవరిలో కనపడుతోంది..ఎవరిలో వినిపిస్తోంది..

ఆడ పడుచుల హృదయాల్లో అన్న గా…..

అభిమానుల గుండెల్లో యుగ పురుషుని గా……..

పేద వాడి మదిలో అన్న దాత గా………

అశేష ప్రజల మనసులో ఆరద్య దైవం గా నిలిచిన

మీ పుట్టిన రోజు తెలుగుజాతి కి పండుగ రోజు…

అన్నగారూ.. నింగి, నేలా, నిప్పు, నీరు ..ఇలా ఏమి ఉన్న లేకపోయినా తెలుగు జాతి ఉన్నత కాలం మిమ్మల్ని మన జాతి మరిచిపోరు….

అస్సలు ఏ ఒక్కరూ చేయని, ఏ రాజకీయ నాయకుడు ఊహించనివి మేజర్ పోగ్రామ్స్ మీరు చేసారు
(1) 2 రూపాయలకే కిలో బియ్యం.
(2) జనతా వస్త్రాలు, దీనివల్ల చేనేత కుటుంబాలకు చేయూత నిచ్చినట్లు అయింది.
(3) పక్కా ఇల్ల నిర్మాణం, దాని వళ్ల మరి కొందరకు ఉపాది లబించడం.
(4) పాధమిక విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.
(5) కాళీ కడుపుతో బడికి రారు కాబట్టి మద్యాహ్న ఆహార పధకం మొదలు పెట్టారు.
(6) ప్రజల వద్దకు పాలన, మండల్ సిస్టంస్ పెట్టారు ఫలితంగా మొదటి సారి బ్యాక్ వర్డ్ క్లాసెస్ ప్రజలకు ఆయన గళం ఇచ్చారు .
(7) మహిళలకు ఆస్తిలో సమాన భాగం.
(8) మహిళా విశ్వవిద్యాలయాళ్లు.
(9) మద్యపాన నిషేదం,
(10) 50 రూపాయలకే ఒక్క సంవత్సరం విద్యుత్ సరఫరా
(11) తెలుగు భాష కి అగ్రస్తానం. .

సంప్రదాయం, కష్టపడే తత్వం, ఆత్మగౌరవం, నియమం, నిష్ఠ్ట.. అన్నిటినీ మించి మానవీయ దృక్పథం..వీటిన్నటికి అచ్చమైన నిదర్శనం అన్నNTR.మరణంలేని జననం మీది, అలుపెరగని గమనం మీది, అంతేలేని పయనం మీది.

మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ ..
పట్టుదలే వుంటే కాగలడు మరో బ్రహ్మ ..

కృషివుంటే మనుషులు ఋషులవుతారు .. మహా పురుషులవుతారు
తరతరాలకి తరగని వేలుగావుతారు .. ఇలవేలుపులవుతారు ..

తెలుగుజాతి ఇలవేలుపు
నందమూరి తారక రామారావు గారి స్మరణలో …..

Banner
Similar Posts
Latest Posts from Vartalu.com