Banner
banner

గుర్తుందా…‘‘మరే, సాయంత్రం నాకు భోగిపళ్లు పోస్తారు. నువ్వు తప్పకుండా రావాలి’’ అంటూ మనం చిన్నప్పుడు మన స్నేహితులతో చెప్పిన రోజే భోగి.   మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాతి పండుగ అంటే .. నెలరోజుల ముందు నుంచే సందడి. ఓ ప్రక్క ఇళ్ళ ముందు రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, గొబ్బెమ్మలు, గంగిరెద్దు విన్యాసాలు, కోడి పందాలు. ఇవన్నీ ఓ ఎత్తు అయితే  కొత్త అల్లుళ్ళు రాకతో సంక్రాంతి పండువ సంబరాలు అంబరాన్ని తాకుతాయి. మూడు రోజులపాటు జరుపుకొనే ఈ పండుగ.. అందులో మొదటి రోజు భోగి. “భుగ్” అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం అని మనకందరికీ తెలిసిందే. దక్షిణాయనానికి చివరి రోజుగా భోగిని భావిస్తారు. అందుకే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలను భోగి మంటల రూపంలో అగ్ని దేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖసంతోషాలను ప్రసాదించాలనే పరమార్థమే భోగి పండుగ విశిష్టత.

పురాణాళ్లోకి వెళితే… పూర్వం ఈ రోజే శ్రీ రంగనధాస్వామి లో గోదాదేవి లీనమై భొగాన్ని పొందిందని దీని సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనేది ఓ పురాణ గాద..అలాగే శ్రీ మహా విష్ణువు వామన అవతారం లో బలి చక్రవర్తిని పాతాళం లోకి తొక్కిన పురాణ గాద మనందరికీ తెలిసిందే అయితే తరువాత బలి చక్రవర్తికి పాతాళ రాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశిర్వదించమని వరమివ్వడం జరిగిందట. బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది. ఇవి మాత్రమే కాదు..కృష్ణుడు ఇంద్రుడికి ఒక పాఠం నేర్పుతు గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రొజు ఇదే. శాపవశంగా పరమేశ్వరుని వాహనమయిన బసవన్నని భూమికి పంపించి రైతుల పాలిట దైవాన్ని భూమికి దిగి వచ్చిన రొజు ఇదే అనేవి కూడా పెద్దలు చెప్తారు. మనలోని చెడును తగలబెట్టి, మంచిని పెంచుకోవడమే ఈ భోగిమంటల అంతరార్థం.

ఇవి ఎలా ఉన్నా… భోగి రోజు ప్రొద్దునే లేచి పాత చెక్కలతో మంటలు వేసి.. అందులో ఆవు పేడతో చేసిన పిడకలు వేయటం మన ఇళ్లల్లో చేస్తూంటారు. ఇంటిలోని పాత బట్టలు, పాత వస్తువులను అగ్నికి ఆహుతి చేస్తారు. ఈ వంకన కాస్త పాత చెత్త పోయి ఇల్లు శుబ్రపడుతుంది.ఈ సంబరాన్ని చిన్న పిల్లలు ఇష్టంతో జరుపుకుంటారు. ఈ భోగి రోజున చిన్నపిల్లల్ని చక్కగా అలంకరించి, కూర్చోబెట్టి భోగిపళ్లు పోస్తారు.

భోగిపళ్లు పోయరారె అమ్మలారా
కోమలాంగులందరు గూడి కొమ్మలారా…
భోగిపళ్లు!! భోగిపళ్లు పోయరారే!!
చిట్టి చిట్టి పాపలను చేరదీసి
కొత్త కొత్త బొమ్మలను కొలువు దీర్చి
కన్నెలొలుకు వన్నెలకు చిన్నెలిచ్చి
ముద్దు గొలుపు మురిపాలు మూటగట్టి
భోగిపళ్లు!! భోగిపళ్లు పోయరారే!! 

Banner
Similar Posts
Latest Posts from Vartalu.com