
వింగ్స్ మిస్ అండ్ మిస్టర్ ఇండియా 2022 అడిషన్స్ కలర్ ఫుల్ గా సాగాయి. మోడలింగ్ రంగాలో రాణించాలనుకునే యువతి, యువకుల కోసం వింగ్స్ ఈవెంట్ జాతీయ స్థాయిలో అందాల పోటీలను నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని హార్ట్ కప్ కేఫ్ నిర్వహించిన ఆడిషన్స్‌లో 60

మంది యువతి, యువకులు పాల్గొన్ని తమ ప్రతిభను ప్రదర్శించారు. హైదరాబాద్‌లో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఐదు మెట్రో నగరాల్లో ఈ ఆడిషన్స్‌ను నిర్వహిస్తున్నట్లు వింగ్స్ ఈవెంట్ నిర్వహకులు మనోజ్ తెలిపారు. మోడలింగ్ రంగంలో ఎదగాలన్న కల, మిస్టర్ ఇండియా,మిస్ ఇండియా, మిసెస్ ఇండియా

అవ్వాలన్న లక్ష్యం ఉన్నావారికి అవకాశాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మే 29న గ్రాండ్ ఫినాలే హైదరాబాద్ లో నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా మోడలింగ్ రంగంలో ఎదగాలకునే అమ్మాయిలు, అబ్బాయిలు ర్యాంప్‌పై వయ్యారంగా అడుగులు వేస్తూ వావ్ అనిపించారు.

ఈ ఆడిషన్స్ కి జ్యూరీ గా మిస్టర్ ఇండియా 2017 అక్షయ నీలకంటం, మోడల్ సింధు పడాల ఉన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిలుగా శాంతి భూషణ్, మనోజ్ పాటు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

మరిన్ని ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి