అమెరికా అధ్యక్ష భవనంలో భారతీయుల సంఖ్య పెరగుతూ వస్తోంది. తాజాగా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ తన టీమ్ లో మరో ఇద్దరు భారతీయులకు చోటు కల్పించటం జరిగింది. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే భారతీయ సంతతికి చెం దిన ప్రముఖులను తన బృందంలోకి తీసుకుంటానని బైడెన్ గతంలోనే వెల్లడించారు. అన్నమాట ప్రకారం తన టీమ్ ని భారతీయులతో నింపుతున్నారు. అమెరికా చరిత్రలోనే తొలిసారిగా 20 మంది భారతీయ-అమెరికన్లు….అమెరికా అధ్యక్ష్యుడి టీమ్ లో ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

వారిలో వినయ్ రెడ్డి, గౌతమ్ రాఘవన్‌లకు బైడెన్ కీలక బాధ్యతలు అప్పగించారు. తనకు దీర్ఘ కాలంగా సహాయకుడిగా ఉన్న వినయ్ రెడ్డిని స్పీచ్ రైటింగ్ డైరెక్టర్‌గా నియమించగా.. గౌతమ్ రాఘవన్‌కి కూడా కీలక బాధ్యతలు అప్పగించారు. వినయ్ రెడ్డి బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఆయనతో కలిసి పని చేస్తున్నారు. ఇంతకు ముందు బైడెన్ క్యాంపెయిన్ స్టాఫ్‌గా పనిచేసిన వినయ్ ఇప్పుడు రైటర్స్ టీమ్ హెడ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. బైడెన్ వెలువరించే ప్రసంగాలన్నింటినీ పకడ్బందీగా రాసే బాధ్యత వినయ్రెడ్డిది. స్పీచ్ డైరెక్టర్‌గా ఆయన నియమితులయ్యటంతో భారతీయులలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.
ఇక రాఘవన్ గతంలో ఒబామా వైట్‌హౌస్ టీమ్ లోనూ సేవలందించారు. ఇండియన్-అమెరికన్ కాంగ్రెస్ ఎంపీ ప్రమీలా జయపాల్ టీమ్‌లోనూ చీఫ్ స్టాఫ్‌గా వ్యవహరించారు.
వీరితో పాటు ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ భారతీయ మూలాలున్నవారే. ఆమెతో పాటు ఎంపికైన ప్రముఖుల్లో నీరా టాండన్ ఒకరు. ఈమె ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ బడ్జెట్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
అలాగే బైడెన్ ఎంపిక చేసుకున్న వ్యక్తి డాక్టర్ వివేక్ మూర్తి. అమెరికా సర్జన్ జనరల్‌గా నియమితులవుతున్నారు. ఆరోగ్యరంగ నిపుణుడిగా ఆయన వ్యాక్సినేషన్ విషయంలో దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే కొవిడ్ టెస్టింగ్ వి భాగం వ్యవహారాలను చూసే బాధ్యతను డాక్టర్ విదుర్ శర్మకు అప్పగించారు