Banner
banner
OLYMPUS DIGITAL CAMERA

రవితేజ క్రాక్ సినిమా చూసిన వారికి ఓ సీన్ బాగా గుర్తుంటుంది. విలన్ కటారి కృష్ణ కు చెందిన వేటపాలెం రౌడీలు ..హత్యలు చేసేముందు గాడిద రక్తం తాగడం… అది తాగాక అది అరాయించుకునేందుకు చేసే శ్రమ. ఆ తర్వాత వారిలో మేల్కొనే రాక్షసత్వం. ఇప్పుడెందుకు ఆ విషయం అంటారా..అయితే ఈ స్టోరి చదవండి.

గత కొద్ది కాలంగా… ఆంధ్రప్రదేశ్ లో గాడిద మాంసానికి విపరీతమైన డిమాండ్ వచ్చిపడింది. రోజురోజుకీ గాడిద మాంసాన్ని తినేవారి సంఖ్య రెట్టింపు అవుతోంది.ఇందుకోసం గాడిదలను అక్రమంగా వధించి  మాంసాన్ని విక్రయిస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో గాడిద మాంసం వ్యాపారం జోరుగా సాగుతోందని సమాచారం. గాడిదను తినే జంతువుగా ప్రభుత్వం గుర్తించకపోయినా అక్రమంగా వధించి మాసంగా విక్రయస్తున్నారు. అది నేరం. రూల్స్ కు  విరుద్ధంగా బిజినెస్ సాగుతున్నా సంభందిత అధికారులు మాత్రం చర్యలు తీసుకున్నట్లు కనపడరు. అప్పటికీ ఓ ఎన్జీవో దీనికి వ్యతిరేకంగా పోరాడుతోంది.

ఇక గాడిద మాంసం తింటే అపరిమితమైన బలం, అదే స్దాయిలో శృంగార సామర్ద్యం పెరుగుతుందనే నమ్మకమే ఉంది. గాడిద మాంసం తిన్న తర్వాత కనీసం రెండు కిలోమీటర్లు పరుగెత్తాలన్న మాటలు కూడా ఈ మధ్యన ఓ తెలుగు సినిమాలో వినిపించాయి. అలాగే గాడిద పాలల్లో పోషక విలువలు, ఔషధ గుణాలుంటాయని, ఉబ్బసం వంటి వ్యాధులకు ఇది సరైన మందు అని చాలా మంది జనం నమ్మడమే. గాడిద మాంసం తింటే గుండె జబ్బులకి, ఆస్తమాకు, కీళ్ల నొప్పులకు చెక్ పెట్టొచ్చంటూ జోరుగా అమ్మకాలు పెంచేశారు విక్రయదారులు.అయితే దీనిపై  వైద్య శాస్త్రం మాత్రం ఎక్కడా స్పష్టత ఇవ్వ లేదు.

ఏపీలో గాడిద మాంసం మాఫియానే నడుస్తోందంటున్నారు.  కొందరు ముఠాలుగా ఏర్పడి గాడిద మాంసం మాఫియాను నడిపిస్తున్నారు. ఆ ముఠాలోని కొందరు ఇతర రాష్ట్రాల నుంచి గాడిదలు తీసుకొస్తుంటే.. కొందరు వాటిని వధించి మాంసంగా మారుస్తున్నారట. మరికొందరు ఆ మాంసాన్ని బహిరంగ మార్కెట్ లో విక్రయిస్తున్నారు. ముఖ్యంగా ఈ గాడిదలను రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి అక్రమంగా తరలిస్తున్నారు


ఈ విషయమై చట్టం ఏమంటోందంటే…ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్స్ యాక్ట్ ప్రకారం ఏదైనా జంతువులను వధించాలంటే ఫర్మిషన్ ఉన్న కబేళాకు వెళ్లాలి. గాడిద విషయంలో ఐపీసీ సెక్షన్ 428, 429, పీఏసీ చట్టంలోని సెక్షన్ 11(1)(1) అనుమతి లేని జంతువులను వధించడం నేరం. దీనికి సంబంధి శిక్షలు కూడా ఉన్నాయి. 

ఈ విషయమై 2018లో ఆంధ్ర హై కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసారు జంతు  ప్రేమికులు. హైకోర్టు దీనిని పరిగణలోకి తీసుకుని గాడిదమాంసాన్ని తినవచ్చా? లేదా? అనేదానిపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆహార భద్రత అధికారులను కోరింది. గాడిదలు తినే జంతువుల జాబితాలో ఉన్నాయో లేదో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటివరకు అనధికారికంగా జంతువధ జరగకుండా చూడాలని కోరింది.

Banner
Similar Posts
Latest Posts from Vartalu.com