Banner
banner

మెక్‌డొనాల్డ్స్ ఇండియా తన యువ కొనుగోలుదారులకు అపూర్వమైన రీతిలో ఆనందం పంచబోతోంది, ప్రతి ఒక్కరికీ ఇష్టమైన హ్యాపీ మీల్‌కు సరికొత్త ఆరోగ్యకరమైన రుచిని జోడించడం ద్వారా. కొత్త హ్యాపీ మీల్‌లో మిళితమై ఉండేవి ఇవే:

  1. ఛాయిస్ ఆఫ్ మెక్‌ఆలూ టిక్కీTM బర్గర్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) * సూచనలకు అనుగుణంగా తయారు చేసిన సమతుల ఆహారం) / మెక్‌ఎగ్ హ్యాపీ మీల్ బర్గర్ (గుడ్డులోని ప్రొటీన్ సుగుణాలతో కలిపి ప్యాక్ చేయబడింది)
  2. ITC లిమిటెడ్ తయారు చేసిన బీ నాచురల్ మిక్స్‌డ్‌ ఫ్రూట్ ప్యాక్ ఒకటి.  (అదనపు చక్కెర జోడించకుండా లేక నిల్వ కారకాలు కలపకుండా)
  3. జ్యూసీగా ఉండే ఒక కప్ స్వీట్ కార్న్ (ఆహారంలో ఫైబర్‌లకు మూలం)
  4. ప్రతిష్ఠాత్మక హ్యాపీ మీల్TM టాయ్

ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ ITC లిమిటెడ్‌తో మెక్‌డొనాల్డ్స్‌ భాగస్వామ్యం కావడం ద్వారా హ్యాపీ మీల్‌TMలో వైవిధ్యభరిత ఫ్రూట్ బెవరేజ్ అయిన బీ న్యాచురల్‌ను జోడించింది. బీ నాచురల్స్ మిక్స్‌డ్‌ ఫ్రూట్ బెవరేజ్‌ అనేది ఆరు రుచికరమైన భారతీయ పండ్ల నుంచి తయారుచేసిన 100% ఫ్రూట్ పల్ప్, ప్యూరీ మరియు పండ్ల రసాలు. ఇది విటమిన్ ఎ మరియు విటమిన్ సి కలిగి ఉంటుంది మరియు ఇందులో అదనంగా చక్కెర గానీ లేక ఇతర నిల్వ కారకాలు కానీ ఏవీ కలపలేదు. 

తమ సంస్థ ఆహారం మరింత ఆరోగ్యకరంగా మరియు పోషక విలువలతో ఉండేలా ఈ బ్రాండ్ వేస్తున్న మరో ముందడుగు ఇది. ఈ కొత్త హ్యాపీ మీల్ దక్షిణ, పశ్చిమ భారతదేశ వ్యాప్తంగా ఉండే అన్ని మెక్‌డొనాల్డ్స్రెస్టారెంట్లలో అందుబాటులో ఉంటుంది.

ఈ ముందడుగు మెక్‌డొనాల్డ్స్ #25ActsofHappy లో భాగంగా అందరి ముందుకొచ్చింది. మా సంస్థ దేశంలోకి అడుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏడాది పొడవునా వినియోగదారులకు ఒక సరికొత్త ఆశ్చర్య అనుభూతి కలిగించే లక్ష్యంతో కొనసాగిస్తున్న కార్యక్రమం.

కొత్త హ్యాపీ మీల్ ప్రవేశపెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని మెక్‌డొనాల్డ్స్ ఇండియా (పశ్చిమం మరియు దక్షిణం) డైరెక్టర్ – మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ అరవింద్ ఆర్‌పి మాట్లాడుతూ, ‘‘మాతో అన్నివేళలాకలిసిఉంటున్న వినియోగదారుల అవసరాలు మరియు డిమాండ్లను మేము ఎప్పటికప్పుడు గ్రహిస్తూనే ఉన్నాం.  మెక్‌డొనాల్డ్స్ కుటుంబంలో చిల్డ్రన్ ఎప్పుడూ ఒక విడదీయరాని భాగం.

ఇప్పుడు వారికోసం సరికొత్త ఆరోగ్యకరమైన హ్యాపీ మీల్TM తీసుకురావడం మాకెంతో ఉత్సాహంగా ఉంది. గుడ్ ఫుడ్ జర్నీ దిశగా నిబద్ధతతో మేం వేస్తున్న అడుగులకు ఈ ప్రయత్నం మరెంతో బలాన్ని అందించడానికి సహాయపడుతుందని భావిస్తున్నాం’’ అని చెప్పారు.  

హ్యాపీ మీల్TM లో బీ నాచురల్ బెవరేజ్‌ను ఒక భాగం చేసేందుకు మెక్‌డొనాల్డ్స్ ఇండియా ITCతో కలిసి ఒక వ్యూహాత్మక భాగస్వామ్యానికి కూడా రూపకల్పన చేసింది.

ITC లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ – డెయిరీ అండ్ బేవరేజెస్ సంజయ్ సింఘాల్ మాట్లాడుతూ, ‘‘మారుతున్న అవసరాలకు తగ్గట్టువినియోగదారులకు విభిన్నమైన రుచులు అందించి వారిని మెప్పించే విధంగా మా ఉత్పత్తులు ఉండాలనే లక్ష్యానికి మేము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాం. వినియోగదారుల అవసరాల ఆధారిత మరియు వైజ్ఞానిక ఆధారిత ఉత్పత్తులు అందించే క్రమంలో భాగంగా బీ నాచురల్ అందరిముందుకు తీసుకురావడం జరిగింది. పండ్ల రసాల శ్రేణిలో ఇది ఒక సరికొత్త ఆవిష్కరణ. ఎటువంటి రసాయనాలు, కృత్రిమ రంగులు మరియు నిల్వ కారకాలు వంటివి ఏమీ లేకుండా ఇది తయారైంది’’ అని చెప్పారు.  

తమ భాగస్వామ్యం గురించి ఆయన మరిన్ని వివరాలు వెల్లడిస్తూ, ‘ఇటువంటి బ్రాండ్ భాగస్వామ్యాలు పరిశ్రమకు సరికొత్త ప్రమాణాలను నిర్దేశిస్తాయి. నిజానికి ఇది ఎంతో ఉత్సాహం కలిగించేది మరియు ప్రోత్సహించాల్సినది. ఎటువంటి చక్కెర కలపని ఆరోగ్యవంతమైన మరియు పోషక విలువలు కలిగిన బీ నాచురల్ మిక్స్‌డ్‌ ఫ్రూట్ బెవరేజ్‌ ఖచ్చితంగా హ్యాపీ మీల్‌తో కలిపి అందించడం వినియోగదారులను మరింత ఆస్వాదించేలా చేస్తుందని మేము నమ్మకంతో ఉన్నాం’’ అని చెప్పారు.

మెక్‌డొనాల్డ్స్ మూడు సంవత్సరాల కిందట గుడ్ ఫుడ్ జర్నీని ప్రారంభించింది. ప్రస్తుత మెనూను మరింత ఆరోగ్యకరంగా మరియు పోషక విలువలుగా కలిగినదిగా సరికొత్తగా తీర్చిదిద్దే క్రమంలో వేసిన ముందడుగు ఇది. దీంతో మెనూలో కొన్ని చెప్పుకోదగిన మార్పులు వచ్చాయి. కొన్నిరకాల ఉత్పత్తుల్లో ఉప్పు వాడకం 20% పైగ తగ్గించడం జరిగింది. అదనపు హంగులు అద్దడంలో నూనె వాడకం విరివిగా తగ్గింది. పాటీస్‌లో 100% కృత్రిమ రసాయనాలు లేకుండా తయారుచేస్తున్నారు. దీంతోపాటు హోల్ వెట్ బన్స్ మరియు ఇంకా మరెన్నో ఉత్పత్తులను ప్రవేశపెట్టింది.

(* ‘ సమతులఅర్ధం కార్పొహైడ్రేట్లు, ప్రొటీన్లు మరియు కొవ్వు పదార్ధాల నుంచి సరైన నిష్పత్తిలో లభించే కాలొరీలు, జాతీయ పోషకాహార సంస్థ సూచనలు అనుసరించి)

వెస్ట్ లైఫ్ డెవలప్‌మెంట్ గురించి:

వెస్ట్ లైఫ్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ (బీఎస్ఈ: 505533) తన అనుబంధ సంస్థ హార్డ్ కాస్టిల్ రెస్టారెంట్స్ ప్రై. లిమిటెడ్‌(హెచ్ఆర్‌పీఎల్)తో కలిసి ఇండియాలో క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు (క్యూఎస్ఆర్) నెలకొల్పడం మరియు నిర్వహిస్తుంటుంది.

ఈ కంపెనీ పశ్చిమ మరియు దక్షిణ భారత దేశంలో మెక్‌డొనాల్డ్స్ నిర్వహణ బాధ్యతలు చూస్తుంటుంది. ఈ కంపెనీ తొలుత మెక్‌డొనాల్డ్స్ కార్పొరేషన్ యూఎస్ఏలో మాస్టర్ ఫ్రాంచైజీ అనుబంధ సంస్థగా ఉండేది. తరవాత భారతీయ అనుబంధంగా మారింది.

హార్డ్ కాస్టిల్ రెస్టారెంట్ల గురించి:

హెచ్ఆర్‌పీఎల్ అనేది ఒక మెక్‌డొనాల్డ్స్ ఫ్రాంచైజీ. పశ్చిమ మరియు దక్షిణ భారతదేశ మార్కెట్లలో మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్ల యాజమాన్య మరియు నిర్వహణ హక్కులు కలిగి ఉంది. ఈ ప్రాంతంలో హెచ్ఆర్‌పీఎల్ ఫ్రాంచైజీ ప్రారంభ సంవత్సరమైన 1996 నుంచి నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది.

హెచ్ఆర్‌పీఎల్ ఏటా 200 మిలియన్లకు పైగా వినియోగదారులకు సేవలు అందిస్తూ వస్తోంది. ప్రస్తుతం (సెప్టెంబర్ 30, 2021 నాటికి) తెలంగాణ, గుజరాత్, మహారష్ట్ర, తమిళనాడు, కేరళ, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, గోవా, మధ్యప్రదేశ్ లోని కొన్ని భాగాలు మరియు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని 42 నగరాల్లో 310 రెస్టారెంట్ల నిర్వహణ స్థాయికి చేరుకుంది. దాదాపుగా 10,000 మంది ఉద్యోగులకు ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించింది. మెక్‌డొనాల్డ్స్ విభిన్న పద్ధతులను అనుసరించడం ద్వారా తన బ్రాండ్‌ను విస్తరిస్తోంది. స్టాండ్ అలోన్ రెస్టారెంట్లు, డ్రైవ్- త్రూస్, 24/7, మెక్‌డెలివరీ, మెక్‌బ్రేక్‌ఫాస్ట్ మరియు డెసెర్ట్ కియోస్క్ ల వంటివి ఇందులో భాగంగా ఉన్నాయి. ఇక్కడి మెనూలో బర్గర్లు, ఫింగర్ ఫుడ్స్, రాప్స్, రైస్, సలాడ్లు మరియు హాట్, కూల్ డ్రింక్స్ వంటివి ఎన్నో ఉంటాయి. దీంతోపాటు డెసెర్ట్స్ విస్తృతంగా అందుబాటులో ఉంటాయి.  మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్ల లోపలే చాలాచోట్ల మెక్‌కేఫ్ సదుపాయం అందుబాటులో ఉంటుంది.

మెక్‌డొనాల్డ్స్ వ్యవస్థ మూలస్తంభాలు నాణ్యత, సేవ, శుభ్రత మరియు విలువలు. హెచ్ఆర్‌పీఎల్ నిర్వహించే ప్రతి ఒక్క రెస్టారెంటులోనూ ఈ విధానాలు అన్నీ సుస్పష్టంగా కనిపిస్తాయి.

Banner
,
Similar Posts
Latest Posts from Vartalu.com