Banner
banner

ఒక వెబ్ సైట్ ని నడపటమే కష్టం అలాంటిది వంద వెబ్ సైట్స్ అదీ ఒంటిచేత్తో నడపటం అంటే మాటలా?…అంటే అబ్బే అవి మాటలు కాదు ముత్యాలు మూటలే అని నమ్మి తెలుగువారి జీవితాల్లో అన్ని అంశాలను ప్రతిబింబేలా తెలుగు ప్రపంచం మొత్తం మన ముందు ఉంచేలా Telugu100.com పేరుతో వంద వెబ్ సైట్స్ అంకురార్పణ సరిగ్గా ఇదే రోజు మూడేళ్ల క్రితం జరిగింది. మడికట్టుకున్నట్లే ఈ మూడేళ్లు మంచి వార్తలను,పనికొచ్చే అంశాలనే అందిస్తూ ,కమర్షియల్ అనిపించినా కొన్ని కట్టుబాట్లుకు లోబడి అలాంటి వాటికి చోటు ఇవ్వక నిర్విఘ్నంగా,నియమబద్దంగా సాగుతూ అక్షరసాగు చేస్తున్నాం.

గత సంవత్సరం ఇదే రోజు  చెప్పుకున్నట్లు ఈ వంద వెబ్ సైట్స్ ద్వారా అచ్చమైన తెలుగు తనాన్ని, స్వచ్చమైన కంటెంట్ ని ఇద్దాం అనేదే మా ప్రాధమిక ఉద్దేశ్యం. దాన్నే కొనసాగిస్తున్నాం. మీరూ స్పందిస్తున్నారు, సహకరిస్తున్నారు. సైట్లను సమీక్షిస్తున్నారు. మాకు ఉత్సాహాన్ని ఊపిరిని పోస్తున్నారు.  మీ స్పందనే ఈ మూడేళ్లు మాకు చుక్కానిలా ముందుకు తీసుకెళ్లిందంటే అతిశయోక్తి కాదు. కరోనా టైమ్ లోనూ కష్టాలును అధిగమనించే ధైర్యం మీ ఆదరణే ఇచ్చింది. … ముచ్చటగా మూడు సంవత్సరాలని  దాటుకొని  నాలుగో సంవత్సరంలోకి ప్రవేశించాం

ఇంటర్నెట్ ద్వారా మనకి వచ్చిన అదృష్టాలలో ఒకటి క్లాసిఫైడ్స్. దీని ద్వారా మనకి నచ్చిన ప్రకటనలను పోస్ట్ చేయవ్చచు…నచ్చిన ప్రకటన కర్తలను రీచ్ అవ్వచ్చు. నాలుగవ వార్షికోత్సవ సందర్బంగా 100 వెబ్ సైట్స్ లో క్లాసిఫైడ్స్ అతి తక్కువ ధరకే అందించే ప్రయత్నం చేస్తున్నాము. త్వరలోనే మా వంద సైట్స్ లో ఈ క్లాసిఫైడ్స్ అందుబాటులోకి రానున్నాయి.

   మీతో కలిసి ఆలోచనలు,అక్షరాలను పంచుకోవటంలో ఉన్న ఆనందం వేరు అని తెలుసు.  మా పూర్తి సామర్థ్యం మేరకు మమ్మల్ని మేము  వికసింపజేసుకోవాలనే మా ఈ అభిలాష స్దిరంగా ఉండాలని  ఈ మా సంస్ద పుట్టిన రోజు పూట దీవిస్తారు కదూ

Banner
Similar Posts
Latest Posts from Vartalu.com