banner
banner

ఈ తరం తెలుగువారి జీవితంలో మెల్లిమెల్లిగా భాగమవుతున్న ‘ Telugu100.com ‘ వెబ్ పత్రికలు అంకురార్పణ సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజు జరిగింది. ప్రారంభ క్షణం నుంచీ కొత్తదనాన్ని స్వాగతిస్తూ ,పాతదనానికి పరిమళాలు అద్దుతూ ముందుకుఈ అక్షరయాత్ర సాగుతోంది. గోరుముద్దల తోటి నేర్చుకున్న భాషని…అమ్మ ప్రేమ వంటి స్వచ్ఛమైన భాష…పూల తేనె వంటి
తీయనైన తెలుగు భాష లో నిత్య జీవిత వార్తలు, విశేషాలు మాత్రమే కాక అదీ ఇదీ అని లేకుండా అన్ని సంగతులు కవర్ చేస్తూ ముందుకు పయినిస్తోంది. ఇది నిర్విఘ్నంగా,నియమబద్దంగా సాగుతున్న అక్షరసాగు .

ఈ వంద వెబ్ సైట్స్ ద్వారా అచ్చమైన తెలుగు తనాన్ని, స్వచ్చమైన కంటెంట్ ని ఇద్దాం అనేదే మా ప్రాధమిక ఉద్దేశ్యం. దాన్నే కొనసాగిస్తున్నాం. మీరూ స్పందిస్తున్నారు, సహకరిస్తున్నారు. సైట్లను సమీక్షిస్తున్నారు. మాకు ఉత్సాహాన్ని ఊపిరిని పోస్తున్నారు. మీ స్పందనే ఈ నాలుగేళ్లు మాకు చుక్కానిలా ముందుకు తీసుకెళ్లిందంటే అతిశయోక్తి కాదు.

దాటుకొని ఐదో సంవత్సరంలోకి ప్రవేశించాం. కరోనా టైమ్ లోనూ కష్టాలును అధిగమనించే ధైర్యం మీ ఆదరణే ఇచ్చింది. … నిర్విఘ్నంగా నాలుగు సంవత్సరాలని దాటుకొని ఐదోగో సంవత్సరంలోకి ప్రవేశించాం. ఈ సందర్బంగా Telugu100.com యూట్యూబ్ ఛానెల్ ని మరియు పేస్ బుక్ పేజీ ని ప్రారంభిస్తున్నాం . తెలుగువారి ఆత్మగౌరవ ప్రచండ భేరిని అన్ని చోట్లా మ్రోగించాలని, తెలుగువాడి సాంస్కృతిక జీవనంలో …భాగం కావటం కోసం ఎంతో వైవిధ్యభరితంగా ముందుకు వెళ్లాలనేదే మా ప్రధాన ఉద్దేశ్యం.

మీతో కలిసి ఆలోచనలు,అక్షరాలను పంచుకోవటంలో ఉన్న ఆనందం వేరు అని తెలుసు. ఇప్పుడు ఇప్పుడు అదే స్పూర్తితో సరికొత్త వీడియోలతోనూ మేము మీ ముందుంటాం. మా ఈ సంస్ద పుట్టిన రోజున ‘ Telugu100.com ‘ కొంగొత్త శోభలతో, కోటి ప్రభలతో, కొత్త రుచులతో వెలుగుతూ వుండుగాక అని దీవించండి.

Banner
Similar Posts

ఎన్ సి ఎస్ గ్రూప్ (NCS) ఆధ్వర్యంలో ఫార్చ్యూన్ ప్రైమ్ స్పేస్ మరియు ఎన్ సి ఎస్ స్కైలైన్ హై రైస్ అపార్ట్మెంట్ లోగో నిమరియు ఎన్ సి ఎస్ ఎంటరైన్మెంట్ బ్యానర్ లో ఏమంటివి ఏమంటివి టైటిల్ ను ప్రారంభించారు.

Latest Posts from Vartalu.com
Banner
Banner