Banner
banner

ITC Ltd.లో భాగమైన, భారతదేశపు అత్యంత ప్రియమైన ప్రీమియం కుకీ బ్రాండ్స్‌లో ఒకటైన సన్‌ఫీస్ట్ డార్క్ ఫ్యాంటసీ, తాజాగా డార్క్ ఫ్యాంటసీ డెజర్ట్స్‌ను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. మధురమైన ఇంకా నోరూరించే – చాకో చంక్స్ అలాగే చాకో నట్ డిప్డ్ – అనే రెండు సెంటర్ ఫిల్డ్ కుకీల కలెక్షన్ ఇది. డార్క్ ఫ్యాంటసీలో భాగమైన ఫ్లాగ్‌షిప్ బ్రాండ్ చాకో ఫిల్స్‌ మాత్రమే అందించగలిగే మధురమైన చాకో అనుభూతిని మరింతగా మెరుగుపరచాలన్నది ఈ ఆవిష్కరణ ప్రధాన లక్ష్యం.

వినియోగదారులు మనోహరమైన ఊహలతో తమ రోజువారీ పనులను ముగించుకునేందుకు ఈ కూకీలతో కలగలిసిన డెసర్ట్ (డెసర్ట్-ఇన్-ఎ-కుకీ) శ్రేణి దోహదపడుతుంది. బ్రాండ్ యొక్క ‘దిన్ ఖతం ఫ్యాంటసీ షురూ’ (ఈ రోజు పని పూర్తయింది.. ఫ్యాంటసీ మొదలైంది) అనే ప్రధాన నినాదానికి ఇది కొనసాగింపు.

డెసర్ట్ అంటే ఇదే అనిపించేలా కొత్త తరం వినియోగదారులకు మరింత చేరువ కావడం డార్క్ ఫ్యాంటసీ డెసర్ట్స్ లక్ష్యం. అత్యుత్తమ రుచితో మీకు సరికొత్త అనుభూతిని అందించే హామీతో, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాకో కుకీల స్థాయిని ఇది మరో స్థాయికి తీసుకెళ్లాలన్నది ఈ ఉత్పత్తి లక్ష్యం.

డార్క్ ఫ్యాంటసీ డెసర్ట్స్ కలెక్షన్‌లో రెండు నోరూరించే ఉత్పత్తులు ఉంటాయి:

1)       చాకో చంక్స్: సుసంపన్నమైన పట్టులాంటి మృదువైన ద్రవ రూప చాకో క్రీమ్‌తో పాటు కరకరలాడే రుచికరమైన చాకో చిప్స్‌ నింపబడిన మధురమైన కుకీ. బహు విధాలుగా చాకోను ఆస్వాదించిన అనుభూతి కలిగిస్తుంది. 75 గ్రాముల బాక్స్ ప్యాక్‌లో 4 కుకీలు ఉంటాయి. ధర రూ. 50.

2)       చాకో నట్ డిప్డ్: జీడిపప్పు, బాదం పప్పులతో అలంకరించబడి, చాకో, హెజెల్‌నట్‌తో నింపబడిన కుకీలు ఇవి. అద్భుతమైన, ప్రీమియం చాకో అనుభూతిని అందించేందుకు పట్టులాంటి మృదువైన చాకోలో ఇవి పొందుపరచబడ్డాయి. 100 గ్రాముల బాక్స్ ప్యాక్‌లో 6 కుకీలు ఉంటాయి. ధర రూ. 50.

డార్క్ ఫ్యాంటసీ డెసర్ట్స్ విడుదల సందర్భంగా ITC Limited ఫుడ్స్ డివిజన్‌కు చెందిన బిస్కట్స్ & కేక్స్ క్లస్టర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ అలీ హారిస్ షేరె మాట్లాడుతూ, ‘‘నోరూరించే చాకో ఉత్పత్తులకు డార్క్ ఫ్యాంటసీ పెట్టింది పేరు. బ్రాండ్‌ను వినియోగించే సందర్భాలను మరింత విస్తృతం చేయాలన్న నిరంతర సంకల్పం నుంచి డార్క్ ఫ్యాంటసీ డెసర్ట్స్ ఆవిష్కరణ ఆలోచన వచ్చింది. భారతదేశంలో తీపికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ కొత్త ఉత్పత్తితో వినియోగదారులకు ఎంతో ప్రత్యేకమైన, మధురమైన డెసర్ట్ అనుభూతిని అందిస్తున్నాము. కొత్త తరం భారతీయ వినియోగదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా బ్రాండ్‌కు ఈ కొత్త ఉత్పత్తి మరింత ఉత్తేజాన్ని, కొత్త దనాన్ని అందిస్తుంది. ఈ ఆవిష్కరణతో సన్‌ఫీస్ట్‌కు డెసర్ట్స్ అనే మరో కొత్త సెగ్మెంట్‌లో అవకాశాలు లభించగలవని, కుకీల విభాగంలో మరిన్ని ఆసక్తికరమైన అవకాశాలు అందుబాటులోకి రాగలవని మేము విశ్వసిస్తున్నాము’’ అని పేర్కొన్నారు.

ITC యొక్క డైరెక్ట్-టు-కన్జూమర్ పోర్టల్ www.itcstore.in లోనే కాకుండా దక్షిణాది మరియు పశ్చిమ రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, కోల్‌కతా వంటి మెట్రో నగరాల్లో / దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్‌లు అలాగే ఎంపిక చేసిన ఆధునిక ట్రేడ్ స్టోర్లలో ఈ డార్క్ ఫ్యాంటసీ డెసర్ట్స్ లభ్యమవుతాయి. ప్రీమియం ఉత్పత్తి అయిన డార్క్ ఫ్యాంటసీ డెసర్ట్స్‌ను మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు 360 డిగ్రీల కోణంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించబడతాయి.

Banner
, , , , , , , ,
Similar Posts
Latest Posts from Vartalu.com