Banner
banner

వాసవీ గ్రూప్‌ భాగస్వామ్యంతో సుమధుర గ్రూప్‌ అత్యంత విశాలమైన 44 అంతస్తుల టవర్ల నిర్మాణాన్ని గచ్చిబౌలి/నానక్‌రామ్‌గూడా, వేవ్‌ రాక్‌ సమీపంలో ప్రారంభించింది.


• గ్రేటర్‌ హైదరాబాద్‌లో అత్యంత పొడవైన రెసిడెన్షియల్‌ భవంతిలో 854 కుటుంబాలు అత్యంత సౌకర్యవంతంగా నివాసముండేలా సుప్రసిద్ధ ఆర్కిటెక్ట్స్‌ తీర్చిదిద్దారు.


• ద ఒలింపస్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం ఈ కన్సోర్టియం 1000 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది. దీనిలో అత్యధిక మొత్తం అంతర్గతంగా నిధుల సేకరణతో పాటుగా వినియోగదారులు చెల్లించే అడ్వాన్స్‌ల ద్వారా సమకూర్చుకోనుంది.
• డిసెంబర్‌ 2025 నాటికి ఈ ప్రాజెక్ట్‌ పూర్తి కానుంది.


హైదరాబాద్‌, ఆగస్టు 19,2021 ః వాసవి గ్రూప్‌ భాగస్వామ్యంతో సుమధుర గ్రూప్‌ తమ అత్యంత ప్రతిష్టాత్మకమైన రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌ను గచ్చిబౌలి/నానక్‌రామ్‌గూడా వద్ద ప్రారంభించింది. దాదాపు5.06 ఎకరాల విస్తీర్ణంలో, ప్రతి ఒక్కరూ నివాసముండాలని కోరుకుంటున్న ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ వద్ద, అత్యంత ప్రతిష్టాత్మకమైన వేవ్‌రాక్‌ ఐటీ సెజ్‌ సమీపంలో ఈ ప్రాజెక్ట్‌ ఉంది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా మొత్తంమ్మీద 20 లక్షల చదరపు అడుగులను విక్రయించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తి అయిన తరువాత గ్రేటర్‌ హైదరాబాద్‌లో అత్యంత పొడవైన టవర్లుగా ఇది నిలువడంతో పాటుగా 854 లగ్జరీ యూనిట్లను 3బీహెచ్‌కె, 3.5 బీహెచ్‌కె అపార్ట్‌మెంట్‌లుగా 1670 చదరపు అడుగుల నుంచి 3000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అందించనున్నారు.


ద ఒలింపస్‌, నగరంలో వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. ఇది నివాసితులకు సౌకర్యవంతమైన కనెక్టివిటీని హైదరాబాద్‌ అంతటా వ్యాప్తంగా అందిస్తుంది. ఈ ప్రోపర్టీని ఆలోచనాత్మకంగా తీర్చిదిద్దారు. ఇది నివాసితులకు సమగ్రమైన జీవనశైలి అనుభవాలను అత్యాధునిక, ప్రపంచశ్రేణి వసతులు అయినటువంటి దాదాపు 50వేల చదరపు అడుగుల క్లబ్‌ హౌస్‌తో అందించనుంది. జీస్‌ పేరిట రూపుదిద్దుకోనున్న ఈ క్లబ్‌ హౌస్‌లో కో వర్కింగ్‌ వర్కింగ్‌ స్పేస్‌లు, కేఫ్‌, లైబ్రరీ, స్విమ్మింగ్‌ఫూల్‌, గెస్ట్‌ సూట్స్‌ మొదలైన, బీబీక్యు టెర్రాస్‌, స్పోర్ట్స్‌ బార్‌, జిమ్‌, బాడ్మింటన్‌ కోర్టు, స్క్వాష్‌ కోర్ట్‌, ఇండోర్‌ గేమ్స్‌, స్పా, సలోన్‌ వంటివెన్నో ఉంటాయి. ఈ ప్రాజెక్ట్‌లో ప్రపంచశ్రేణి సదుపాయాలున్నాయి. వీటిలో సెంట్రలైజ్డ్‌ ఏసీ కూడా భాగంగా ఉంటుంది.


ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభం గురించి సుమధుర గ్రూప్‌ ఛైర్మన్‌ శ్రీ మధుసూదన్‌ జి మాట్లాడుతూ ‘‘ వర్క్‌–లైఫ్‌ బ్యాలెన్స్‌ చేసుకుంటూ, ఆహ్లాదకరమైన జీవితం కోరుకునే వ్యక్తులు, కుటుంబాల అవసరాలను పరిగణలోకి తీసుకుని ఈ ప్రాజెక్ట్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దాం. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ నడిబొడ్డున ఉన్న ఈ ప్రాజెక్ట్‌, విశ్రాంతి మరియు పునరుత్తేజ అనుభవాలను పొందడానికి అవసరమైన సదుపాయాలు, ప్రాంగణాన్ని అందిస్తుంది. డిమాండ్‌తో కూడిన జీవనశైలి మరియు ప్రియమైన వారితో మధురక్షణాలను ఆస్వాదించాలనుకునే వారి ఆహ్లాదకరమైన అనుభూతులను అందించే అత్యుత్తమ ప్రోపర్టీలలో ఒకటిగా ద ఒలింపస్‌ నిలువనుంది. మా కొనుగోలుదారులకు ఖచ్చితంగా ఇది అత్యంత గర్వకారణమైన ఎంపికగా నిలువడమే కాదు తరాల తరబడి ఆనందాన్నీ అందించనుంది..’’ అని అన్నారు.


అదనంగా, ఈ ప్రాజెక్ట్‌ యొక్క అతి పెద్ద ప్రయోజనం, ఇది ఉన్న స్థానం. వేవ్‌రాక్‌ సెజ్‌కు పక్కనే ఉండటం, ఎన్నో ఎంఎన్‌సీలు మీటర్ల దూరంలో ఉండటం, హైదరాబాద్‌ నగర అత్యద్భుత వీక్షణం ఈ ప్రాజెక్ట్‌ను మరింత ఆహ్లాదంగా మారుస్తాయి. సుప్రసిద్ధ ఎంఎన్‌సీలు, ఆస్పత్రులు, ఔటర్‌ రింగ్‌, పాఠశాలలు, విద్యాసంస్థలు, క్రీడా సదుపాయాలు మరియు ఇతర అవసరమైన సామాజిక మౌలిక వసతులకు అది సమీపంలో ఇది ఉంది.

Banner
, ,
Similar Posts
Latest Posts from Vartalu.com