Banner
banner
thiruppavai

సృష్టిలో భగవంతుడొక్కడే పురుషుడు, మానవులందరూ స్త్రీలనే ఉద్దేశ్యముతోనే విష్ణుమూర్తిని శ్రీవారు అని సంబోధిస్తుంటారు. అటువంటి విష్ణుమూర్తిని భర్తగా పొందాలనే తలపుతో గోదాదేవి ధనుర్మాసంలో చేసిన తిరుప్పావై వ్రతము. వ్రతాన్ని నేటికి మనం ఆచరిస్తున్నాము. కలియుగంలో మానవ కన్యగా జన్మించి గోదాదేవిగా పేరుమోసిన ఆండాళ్ భగవంతుడినే తన భర్తగా భావించి, ఆయనను చేపట్టడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై వ్రతముగా ప్రసిద్ది చెందింది. శ్రీరంగనాథున్ని వివాహమాడుటకై ఆండాళ్ అమ్మవారు పాడిన “తిరుప్పావై” ..మానవ జీవితాన్ని, ప్రకృతిని సమన్వయపరుస్తూ సాగుతుంది.  ఇన్నేళ్లు అయినా  “తిరుప్పావై”  అందరి జీవితాలను ఇప్పటికి స్పృశిస్తూనే ఉంది. అందుకే తాను ఆండాళ్ అమ్మవారిపై ఓ మ్యూజిక్ వీడియో చేయాలని సంకల్పించారు సుహాసినీ మణిరత్నం.

ఆండాళ్ అమ్మవారి జీవితాన్ని ప్రేరణగా తీసుకుని ఈ కథను స్పృజించారని ఆమె అన్నారు. 2014లో తాము తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో ప్రాచుర్యం పొందిన భరతనాట్యం, కూచిపూడి, మోహినీ ఆట్టం, తమిళనాట బహుళ ప్రాచుర్యం పొందిన కన్నగి ఇతివృత్తాలతో అంతరం పేరుతో బ్రహ్మాండమైన నృత్యరూపక  కార్యక్రమం జరిపాము అని గుర్తు చేసారు. అందులో ప్రధాన పాత్ర ఆండాళ్ అమ్మవారు. ఆమె కథను భరతనాట్యంతో చెప్పటం జరిగింది. ఈ లాక్ డౌన్ సమయంలో డచెస్ క్లబ్ మెంబర్స్ ఓ చిన్న వీడియోని నాకు పంపారు. నవరాత్రి సందర్బంగా తొమ్మది మంది సభ్యులు కలిసి శ్లోకాలను పాడుతూ ఉన్న వీడియో అది. తమ తమ ఇళ్లలోనే ఉంటూ ఆ వీడియోని చేసారు. ఆ ఆలోచన నాకు ఇంట్రస్టింగ్ గా అనిపించింది.  తిరుప్పావై కూడా ఇలా చేయవచ్చు కదా అనిపించింది. దాంతో నా భర్త మణిరత్నంతో ఈ ఆలోచనను షేర్ చేసుకున్నాను. ఆయన కూడా బాగుందని, చేయమంటూ ఎంకరేజ్ చేసారు అంటూ సుహాసిని ఈ మ్యూజిక్ వీడియో వెనుక ఉన్న నేపధ్యాన్ని వివరించారు.

ఆలస్యం లేకుండా ఈ ఆలోచనను క్రియేటివ్ డైరక్టర్ శుభశ్రీ తణికాచలం కు చెప్పటం జరిగింది. ఆమె కూడా చాలా థ్రిల్ అయ్యారు. అయితే నేను ఒకటే కండీషన్ పెట్టాను. రెగ్యులర్ సింగర్స్ తో కాకుండా ప్రొఫిషనల్ కాకపోయినా చక్కగా పాడగలిగే వారి చేత పాడిద్దామని అన్నాను. తర్వాత  నా స్నేహితులు నేనూ మా ఇంట్లో కూర్చుని  కొన్ని మ్యూజిక్ సెషన్స్ చేసాము. నాకు మా స్నేహితుల్లో ఎవరు బాగా పాడతారో తెలుసు. శుభశ్రీకు ఈ ప్లాన్ అంతా చెప్పినప్పుడు ఈ లాక్ డౌన్ సమయంలో ఇలా అందరూ గేదర్ అయ్యి ..ఇలాంటి పోగ్రామ్ చేయటం గురించి చాలా ఆశ్చర్యపోయారు. మేము ఎంపిక చేసిన గాయకులను తమ తమ ఇళ్లల్లో రికార్డ్ చేసి పంపమని కోరారు. మొదటగా ఈ పోగ్రామ్ గురించి ఎక్కువ ఎక్సైట్ అయ్యింది అను హాసన్.

ఆ తర్వాత రేవతి, ఉమ పద్మనాభం, రమ్య నంబీశన్, కనిహ, జయశ్రీ, నిత్యామీననన్. వారంతా ఈ పోగ్రామ్ లో చాలా ఆనందంగా పాల్గొన్నారు. వారు పంపిన రికార్డెడ్ వీడియోలు అన్నీ డాన్సర్ శోభన్ కు పంపాము. ఆమె ఈ సింగిల్స్ కు అభినయం చేస్తాను అన్నారు. ఆ విధంగా ఈ వీడియోకు మరో మణిహారం దొరికింది. తమిళ సంప్రదాయంలో ప్రత్యేక స్దానం ఉన్న  “తిరుప్పావై” కు కళాకారులైమ మేము ఇచ్చే ట్రిబ్యూట్ గా భావిస్తున్నాం అని సుహాసిని మణిరత్నం అన్నారు. కతర్ నుంచి కేవిందాస్ ఈ వీడియోని ఎడిట్ చేసారు. అలాగే జి.రవి సంగీతం అందించారు. కమల్ హాసన్, ఎఆర్ రహమాన్, మాధవన్ ఈ Margazhi Thingal పేరుతో వెలువడుతున్న వీడియోని ఈ రోజున విడుదల చేసారు .

 

Banner
, , , , , ,
Similar Posts

వ్యర్థాల నుంచి సంపదను సృష్టించడంపై ప్రధానమంత్రి దార్శనికతని నొక్కిచెప్పిన శ్రీ రామ్ చంద్ర ప్రసాద్ సింగ్; వివిధ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న గనులు పరిశ్రమల మంత్రుల రెండు రోజుల సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర ఉక్కు శాఖా మంత్రి

Latest Posts from Vartalu.com