Banner
banner

తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యం తో, తెలంగాణ థియేటర్ & మీడియా రెపర్టరి వారు నిర్వహించిన 30రోజుల ఆన్ లైన్ లో వాయిస్ యాక్టింగ్, డబ్బింగ్ మరియు వాయిస్ ఓవర్ అంశం పై శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం, రవింధ్రభారతి పైడి జయ రాజ్ ప్రీవ్యూ థియెటర్ లో తేది:07 మార్చ్ 2021,ఆదివారం,సాయాంత్రం 6గంటలకు జరిగింది. ఈ సందర్భంగా సభాద్యక్షులు,భాషా సాంస్కృతిక శాఖ  సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ గారు మరియు ప్రత్యేక అతిథి శ్రీ పులి అమృత్ గారు అభ్యర్ఠులకు ప్రశంసా పత్రాలను అందజేసారు.

 శ్రీ మామిడి హరికృష్ణ గారు మాట్లాడుతూ…” వాయిస్ యాక్టింగ్, డబ్బింగ్ మరియు వాయిస్ ఓవర్ సబ్జెక్టు పై మన తెలంగాణ ప్రభుత్వం , భాషా సాంస్కృతిక శాఖ అధ్వర్యం లో నిర్వహించటం దేశంలోనే  ప్ర ప్రథమం అని, యుటుబ్ ఛానళ్లు , లోకల్ న్యూస్ ఛానెళ్లు వెల్లువలా వస్తున్న ఈ కమ్యూనికేషన్ ఎరా లో ఈ శిక్షణ శిభిరంలో పాల్గొన్న అభ్యర్థులకి  ఉపాధి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అలాగే .., భాష మీద పట్టు, ఉచ్చారణలో స్పష్టత, భావ గంభీరత్వంతో ఎలా వాయిస్ యాక్టింగ్ చెయ్యాలనే బాగా అనుభవజ్ఞులైన అధ్యాపకులతో సరైన దిశా నిర్ధేశం చేసారని మెచ్చుకున్నారు. అలాగే,  ఈ శిక్షణా శిబిరంలో నేర్చుకున్నవారు..తర్వాత రోజుల్లో సాధన చేస్తే తప్పకుండా ఈ రంగంలో రాణించగలరని అన్నారు.ఇంకా ఇలంటి శిభిరాలు ఇంకా చాల అవసరం అని తెలిపారు.  ప్రముఖ పద్య నాటక కళాకారుడు దొంతి జంగయ్య గౌడ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని  తమ అభినందనలు తెలియచేసారు.  అలాగే ఈ శిక్షణ శిభిరంలో  పాల్గొన్న అభ్యర్థులు తమకు ఈ శిబిరం తమ కెరీర్ కు చాలా ఉపయోగపడుతుందని, ఆనందం వ్యక్తం చేసారు.

శిక్షణ శిబిర విశేషాలకు వస్తే..

శ్రీ రమెష్ కిషన్ గౌడ్ గారు అద్యక్షతన జరిగిన ఈ శిబిరంలో  20రోజులు ఆన్ లైన్ జూం మీట్ యాప్ ద్వారా  10రోజులు స్టూడియో ప్రాక్టికల్స్ తో, వాచికాభినయం ను సిలబస్ గా తయారు చేసి  వాయిస్ యాక్టింగ్, డబ్బింగ్ మరియు వాయిస్ ఓవర్ అంశాల పై శిక్షణ ని నిర్ధిష్టమైన ప్రణాళికతో నిర్వహించారు.

ఈ శిక్షణకి అభ్యర్దుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ జనవరి 20,2021 న పత్రికా ప్రకటన ఇవ్వగా 600 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 24 మంది అభ్యర్థులని టెలిఫోన్ ఇంటర్వూ ద్వార ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. వాచికాభినయనం కి సంబంధించిన స్పెషలిస్ట్ లని గెస్ట్ అధ్యాపకులుగా అహ్వానించి వారితో ట్రెయినింగ్ ఇప్పించటం జరిగింది.  అలాగే శిక్షణ అద్యాపకులుగా శ్రీ పాలకుర్తి సాకేత రాం శర్మ గారు, తెలుగు భాషా పదాల ఉచ్చారణ, డిక్షన్ పై సమగ్రమైన శిక్షన ఇచ్చారు. అంతేకాకుండా మహాకవి శ్రీ శ్రీ రాసిన మహాప్రస్తానం, మమిడి హరికృష్ణ గారి సుశిప్తి నుంచి ఎంపిక చేసిన కవితా సంకలనాలను చదివించారు.  

అంతర్జాతీయ యోగా థెరాపిస్ట, యోగా గురు శ్రీ షన్ముఖ శివ చంద్ర గారు యోగా మెళుకువలని నేర్పించి శ్వాసకి, ధ్వని కి, ఉచ్చారణ ని కి యోగా ఎంత ఆవసరమో ప్రత్యేకంగా శిక్షన ఇచ్చారు.  అలాగే  ప్రథమ మహిళ సౌండ్ ఇంజినీర్, రాష్ట్రపతి అవార్డు గ్రహిత డా. సాజిదా ఖాన్ గారు ఈ శిక్షణ శిభిరం లో సౌండ్ రికార్డింగ్, స్టుడియో  టెక్నికల్ విషయలపై సమగ్రమైన అవగాహన కల్పించారు.


వీరితో పాటు ప్రముఖ డబ్బింగ్, వాయిస్ ఆర్టిస్ట్ కృష్ణవేణి గారు కూడా ఈ శిక్షణ శిబిరం లో ఒక  వాయిస్ ఆర్టిస్ట కి కావల్సిన వాయిస్ కల్చర్, పాజ్ , పిచ్, వాల్యూం,  స్పష్టత మరియు లౌక్యం ఎంత ముఖ్యమో తెలియచెసారు.

 శిక్షణ లో పాల్గొన్న  అభ్యర్థులు:
సూర్య గౌడ్ , అంజన్ కుమార్, శ్రీధార్ బాబు, గౌతం కిశోర్ రేడ్డి, జగన్నాధ్ రావ్, రమెశ్ నెమ్మది,మాహెశ్, హారినాథ్, వంశీకృష్న, ప్రదీప్ కుమార్, వెంకట రఘురాం, కొంద శ్రీను, సివనాగులు, స్రుజన్, సునిల్,   రాధిక, సైలజా, అనురాధ, అరుణ, పధ్మజా, కళావతి, ఇందిరా, శ్రీ గౌడ్, సునిత, సాయి శ్రేయ.

click here to check gallery

Banner
,
Similar Posts
Latest Posts from Vartalu.com