Banner
banner

ప్రజా అవగాహన కార్యక్రమం కోసం చేతులు కలిపిన స్టార్‌ మా మరియు  ఎల్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్‌

స్టార్‌మా మరియు ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైల్‌ హైదరాబాద్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా ప్రభావవంతమైన పౌర స్పృహ ఆధారిత  ప్రచారాన్ని తెలుగు వినోదంకు సంబంధించి ప్రపంచంలో అతిపెద్ద టెలివిజన్‌ ప్రోపర్టీ బిగ్‌ బాస్‌ ద్వారా  సృష్టించాయి. హైదరాబాద్‌ మెట్రో రైల్‌లో ప్రయాణించేటప్పుడు అనుసరించాల్సిన ముందు జాగ్రత్తలను గురించి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రచారం ప్రారంభించారు.

ఈ పౌరస్పృహ కార్యక్రమాన్ని నగరంలోని 57 మెట్రో స్టేషన్‌లలోని  కాన్‌కోర్స్‌, ఎంట్రీ–ఎగ్జిట్‌ మరియు చెక్‌ ఇన్‌ ప్రాంగణాలలో చేస్తున్నారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన జింగిల్స్‌తో పాటుగా అదే తరహా సందేశాలను సైతం అన్ని మెట్రో రైళ్లలోనూ ప్రచారం చేస్తున్నారు. ఈ క్యాంపెయిన్‌ను మొత్తం బిగ్‌బాస్‌ సీజన్‌ 100 రోజులూ ప్రచారం చేయనున్నారు. తద్వారా మెట్రో కమ్యూటర్లు ప్రయాణ సమయాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటుగా మెట్రో స్టేషన్‌ ప్రాంగణాలలో అనుసరించాల్సిన విధానాలను గురించి అవగాహన కల్పించనున్నారు. దీనిలో భాగంగా భద్రతా ప్రమాణాలు, మెట్రో నిబంధనలు, తమ సౌకర్యం కోసం సరైన విధానంలో మరింతగా వినియోగించడం వంటి అంశాల పట్ల అవగాహన కల్పించడం వంటివి తెలుపనున్నారు.

బిగ్‌బాస్‌ హోస్ట్‌ అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ‘‘ వినోదానికి ఓ సహేతుకమైన విధానమంటూ ఉండాలి. ఈ ప్రచారం ఆ విధానానికి చక్కటి ప్రాతినిధ్యం వహిస్తుంది. బిగ్‌బాస్‌ అనేది పూర్తి వినోదాత్మక కార్యక్రమం. భావోద్వేగాలను తట్టి లేపుతుంది. ఈ ప్రచారం ద్వారా  భద్రత పట్ల మరింత అవగాహన సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రయాణీకులకు చక్కటి విలువను జోడించనుంది.  స్టార్‌ మా మరియు ఎల్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్‌ ఈ తరహా సృజనాత్మక మరియు సామాజికంగా బాధ్యతాయుతమైన ప్రచారం కోసం ముందుకు రావడం సంతోషంగా ఉంది’’అని అన్నారు.

శ్రీ కెవీబీ రెడ్డి, ఎండీ అండ్‌ సీఈవొ, ఎల్‌ అండ్‌ టీఎంఆర్‌హెచ్‌ఎల్‌ మాట్లాడుతూ ‘‘ బిగ్‌బాస్‌ సీజన్‌–3 కోసం 2019లో  మేము స్టార్‌ మాతో విజయవంతంగా భాగస్వామ్యం చేసుకున్నాము. మరోమారు ఉత్సాహపూరితమైన  భాగస్వామ్యంను హైదరాబాద్‌ మెట్రో రైల్‌తో  స్టార్‌ మా మరియు బిగ్‌ బాస్‌ సీజన్‌5 చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. వారి పర్యావరణ అనుకూలమరియు సురక్షితమైన ట్రావెల్‌ భాగస్వామిగా మేము నిలుస్తున్నాం. ఈ భాగస్వామ్యంలో భాగంగా మేము బిగ్‌బాస్‌ ఈజ్‌ వాచింగ్‌  ప్రచారం ను మా మెట్రో స్టేషన్‌ల వద్ద ప్రారంభించాము. దీనిద్వారా కోవిడ్‌ భద్రతా అవగాహన మరియు సురక్షిత ప్రయాణ పద్ధతులు వంటి వాటిపట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము. ఈ ప్రచారం ద్వారా స్మార్ట్‌ ట్రావెల్‌ అలవాట్లను ప్రయాణీకుల నడుమ పెంపొందించడానికి ప్రయత్నిస్తున్నాము. దీనిద్వారా మెట్రో ప్రయాణీకులు  మొబైల్‌ క్యుఆర్‌ టిక్కెట్లు, స్మార్ట్‌ కార్డులను సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణం కోసం వినియోగించాల్సిందిగా చెబుతున్నాం. బిగ్‌బాస్‌ సీజన్‌ 5 అపూర్వ విజయం సాధించాలని సూపర్‌ స్టార్‌ నాగార్జున మరియు స్టార్‌ మా నెట్‌వర్క్‌కు నా ఆకాంక్షలను తెలియజేస్తున్నాను’’ అని అన్నారు.

‘‘ఓ నెట్‌వర్క్‌గా డిస్నీ మరియు స్టార్‌ ఇండియా ఎప్పుడూ కూడా అర్థవంతమైన కమ్యూనికేషన్స్‌ సృష్టించడం ద్వారా  లక్షలాది మంది జీవితాలను సమృద్ధి చేయడాన్ని నమ్ముతుంటుంది. మా సందేశాల ద్వారా సంబంధిత సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తుంటాం. హైదరాబాద్‌ నగరంలో  ప్రజలకు అవగాహన కల్పించడం కోసం హైదరాబాద్‌ మెట్రోరైల్‌తో భాగస్వామ్యం  చేసుకోవడం పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాం. ప్రపంచ వ్యాప్తంగా మా అతిపెద్ద ప్రోపర్టీ షోలలో బిగ్‌బాస్‌ ఒకటి.  ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులు దీనిని తమ రోజువారీ వినోదం కోసం చక్కగా అంగీకరించారు. ఈ మార్గాన్ని వినియోగించుకోవడం ద్వారా ప్రజా భద్రతకు సంబంధించి వేగంగా చేరుకోగలం’’అని స్టార్‌ మా  అధికార ప్రతినిధి అన్నారు.

Banner
,
Similar Posts
Latest Posts from Vartalu.com