సంగీతం లో అద్భుతాలను సృష్టించాలనే సంకల్పం; మాట పట్ల మమకారం ; సాధించాలనే తపన ; అన్నిటినీ మించి మీలో ప్రతిభ ఉందనే నమ్మకం… చాలు , సూపర్ సింగర్ మీరే కావొచ్చు. ఎంతోమంది ఔత్సాహికుల ప్రతిభను వెలికి తీయడంతో పాటుగా సినీ, శాస్త్రీయ సంగీతంలో గాయనీగాయకులుగా అవకాశాలు అందించిన స్టార్ మా సూపర్ సింగర్ పోటీలు తిరిగి వచ్చాయి. కాకపోతే ఈసారి జూనియర్ల కోసం ఈ పోటీలు జరుగబోతున్నాయి. ఆరేళ్ల నుంచి 15 సంవత్సరాల లోపు బాలబాలికలు స్టార్ మా సూపర్ సింగర్ జూనియర్ పోటీలలో పాల్గొనవచ్చు. దీనికి సంబంధించిన ఆడిషన్స్ మార్చి 27వ తేదీ విశాఖపట్నంలో జరుగబోతున్నాయి.

వైశాఖి జల ఉద్యానవనం, పోలీస్ కమిషనర్ ఆఫీస్ దగ్గర, సూర్యాబాగ్, విశాఖపట్నం–530 020 వద్ద జరగబోయే ఈ పోటీలకు అదే రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఇంకెందుకు ఆలస్యం…! గొంతు సవరించుకోండి.. మీలోని గాన గంధర్వుడిని మేలుకొల్పండి. రేపటి సూపర్ సింగర్ మీరేకండి !!