banner
Banner

పెన్షన్ ద్వారా ఆదాయం పొందుతున్న వారు.. బ్యాంకులో గాని, పోస్టాఫీసులో గానీ, వారికి సంబంధించిన పెన్షన్ ఆఫీస్ లేదా జీవన్ ప్రమాణ్ పోర్టల్లో లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేసేవారు. అయితే కరోనా కారణంగా నేరుగా బ్యాంకులకు వెళ్లి లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయడానికి ఎస్బీఐ కొత్త అవకాశం కల్పిస్తోంది.

 పెన్షనర్లు  తమ  లైఫ్‌ సర్టిఫికెట్‌ ను వీడియో కాల్‌ ద్వారా సమర్పించేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) అవకాశం కల్పించింది. ఈ ఫెసలిటీతో బ్యాంకు శాఖకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంటి వద్ద నుంచే తమకు అనువైన టైమ్ లో  లైఫ్‌ సర్టిఫికెట్‌ తీసుకోవచ్చు. దీనికోసం.. ముందుగా ‌www.pensionseva.sbi వెబ్‌సైటుకు వెళ్లి, పెంక్షన్ ఎక్కౌంట్ నెంబర్ నమోదు చేస్తే.., మొబైల్‌ ఫోనుకు వచ్చిన ఓటీపీ వస్తుంది. దాంతో  వీడియో కాల్‌ ప్రారంభించేందుకు వీలవుతుంది. ఫెన్షనర్స్ తమ పాన్‌ కార్డును ఈ సమయంలో దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. సీనియర్‌ సిటిజన్ల ప్రయోజనార్థం ఈ సౌకర్యాన్ని తీసుకొచ్చినట్లు, పెన్షనర్లు నూ డిజిటల్‌గా బలోపేతం చేసేందుకు ఇది తోడ్పడుతుందని ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేశ్‌ ఖారా తెలిపారు.

దేశంలోనే తొలిసారిగా వీడియో లైఫ్‌ సర్టిఫికెట్‌ (వీఎల్‌సీ) ఫెసిలిటీని సోమవారం (నవంబర్‌ 1) నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా  పెన్షనర్లు తమ ఇంటి వద్ద నుంచే సులభంగా వీడియో కాల్‌ చేసి లైఫ్‌ సర్టిఫికెట్‌ను సమర్పించొచ్చు. దీనికి సంబంధించి నిమిషం నిడివి గల వీడియోను ఎస్‌బీఐ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ  ఏ విధంగా దాన్ని ఫాలో కావాలనే విషయం వివరించింది.

సర్టిఫికెట్‌ సమర్పించే ప్రాసెస్ ..
మొదట ఎస్‌బీఐ పెన్షన్‌ సేవా పోర్టల్‌ను సందర్శించండి.
 లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించే విధానాన్ని ప్రారంభించడానికి ‘వీడియో ఎల్‌సీ’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి.
 మీ ఎస్‌బీఐ పెన్షన్‌ ఖాతా నంబర్‌ను నమోదు చేయండి.
తర్వాత మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయండి.
రూల్స్, కండీషన్స్ చదివి అంగీకారం తెలిపి ‘స్టార్ట్‌ జర్నీ’పై క్లిక్‌ చేయండి.
 మీ ఒరిజినల్‌ పాన్‌ కార్డ్‌ను చేతిలో ఉంచుకుని ‘ఐ ఆమ్‌ రెడీ’పై క్లిక్‌చేయండి.
 వీడియో కాల్‌ ప్రారంభించడానికి మీరు ఓకే చేసిన తర్వాత ఎస్‌బీఐ అధికారి అందుబాటులోకి వచ్చి మీతో మాట్లాడతారు.
 వీడియో కాల్‌లోకి వచ్చిన ఎస్‌బీఐ అధికారి మీ స్క్రీన్‌పై ఉన్న నాలుగంకెల కోడ్‌ను చదవాలని అడుగుతారు. మీరు ఆ కోడ్‌ను చెప్పాల్సి ఉంటుంది.
  మీ పాన్‌ కార్డును బ్యాంక్‌ అధికారికి చూపించి, దాన్ని ఫొటో తీసుకోవడానికి ఫర్మిషన్ ఇవ్వాలి. అనంతరం ఎస్‌బీఐ అధికారి మీ ఫొటోను తీసుకుంటారు.
 ఇంతటితో వీడియో లైఫ్‌ సర్టిఫికెట్‌ (వీఎల్‌సీ)కార్యక్రమం పూర్తవుతుంది.
 ఒకవేళ ఏ కార‌ణంతోనైనా వీడియో లైఫ్ స‌ర్టిఫికేట్‌ ప్రక్రియ రిజక్ట్ అయితే ఎస్సెమ్మెస్‌ ద్వారా ఆ విషయాన్ని బ్యాంకు మీకు తెలియజేస్తుంది. ప్రత్యామ్నాయంగా మీకు పెన్షన్‌ చెల్లించే బ్యాంక్‌ శాఖను సందర్శించి లైఫ్‌ సర్టిఫికెట్‌ను అందజేయొచ్చు.

Banner
, , ,
Similar Posts
Latest Posts from Vartalu.com
Banner