Banner
banner

~ దేశీయంగా వృద్ధి చెందిన మెర్చ్ అండ్ ఫ్యాషన్ లేబుల్ లో

కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసిన ప్రముఖ తార~

భారతదేశ అత్యంత ప్రజాదరణ పొందిన క్యాజువల్ వేర్, పాప్ కల్చర్ అపెరల్ బ్రాండ్ అయిన సౌలెడ్ స్టోర్ తన ఈక్విటీ భాగస్వామిగా సారా అలీ ఖాన్ ను ఆహ్వానిస్తోంది. ఈ నూతన తరం తార ఈ బ్రాండ్ లో కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టడం ఈ బ్రాండ్ సెలెబ్రెటీ స్టార్ పవర్ కు మరింత శక్తినిచ్చింది.

సౌలెడ్ స్టోర్ కు ఉన్న అమిత ప్రజాదరణ, పెరిగిపోతున్న బ్రాండ్ ఈక్విటీ, పాప్ కల్చర్ అంటే సారాకు ఉన్న ప్రేమ నేపథ్యంలో సౌలెడ్ స్టోర్, సారా కలసి పని చేయడం అనేది ఓ కచ్చితమైన విజయంగా మారింది.

నలుగురు పాప్ కల్చర్ అభిమానులు వేదాంగ్ పటేల్, హర్ష్ లాల్, ఆదిత్యా శర్మ, రోహిన్ సాంటానేలచే ప్రా రంభించబడిన ది సౌలెడ్ స్టోర్ అనేది భారతదేశ అతిపెద్ద ఆన్ లైన్ మర్కండైజింగ్ ప్లాట్ ఫామ్. డిస్నీ, వా ర్నర్ బ్రదర్స్, డబ్ల్యూడబ్ల్యూఈ, ఐపిఎల్, వయాకామ్ 18, ఇంకా మరెన్నో సంస్థల లైసెన్సులను ఇది కలి గిఉంది.

 ఆవిర్భవించిన నాటి నుంచి ది సౌలెడ్ స్టోర్ ఏటా నూతన ప్రమాణాలను నెలకొల్పుతూ ఉంది. వీటిలో తా జాది ఎలివేషన్ క్యాపిటల్ నుంచి రూ.75 కోట్ల మల్టీ క్రోర్ ఫండింగ్ ముఖ్యమైంది. దీంతో ఇతర డీ2సీ బ్రాం డ్లు కూడా పెద్ద కలలు కనేందుకు వీలైంది. ఓటీటీ, యూట్యూబ్ సూపర్ స్టార్స్ ఆశిష్ చాంచ్ లాని, మిథిలా పాల్కర్ (లిటిల్ థింగ్స్), ఆయుష్ మెహ్రా (కాల్ మై ఏజెంట్: బాలీవుడ్), బర్ఖా సింగ్ (ఇంజినీరింగ్ గర్ల్స్ ఎ స్2), అహ్ సాస్ చన్నా (గర్ల్స్ హాస్టల్), ఇతరులతో కలసి పలు క్యాంపెయిన్లను కూడా ఈ బ్రాండ్ చేప ట్టింది.  

ఈ భాగస్వామ్యం గురించి సారా అలీ ఖాన్ మాట్లాడుతూ, ‘‘ది సౌలెడ్ స్టోర్ తో భాగస్వామ్యం నాకెంతో ఆ నందదాయకం. స్వల్ప వ్యవధిలోనే ఈ బ్రాండ్ కాజువల్ వేర్ విభాగంలో ఉన్నత స్థాయికి ఎదిగింది. పాప్ క ల్చర్ అభిమానిగా, ఫ్యాషన్ మాదిరిగానే ఒరిజినాలిటీ, కంఫర్ట్ ముఖ్యమైనవి అని విశ్వసించే వ్యక్తిని. ఇన్వె స్ట్ చేసేందుకు ఈ బ్రాండ్ అన్నివిధాలుగా తగినదని గుర్తించాను. టీఎస్ఎస్ కుటుంబంలో భాగం కావడం నాకెంతో ఆనందదాయకం’’ అని అన్నారు.

సారా అలీ ఖాన్ చేరిక సందర్భంగా ది సౌలెడ్ స్టోర్ సహ వ్యవస్థాపకులు రోహిన్ సాంటానే మాట్లాడుతూ, ‘‘మాతో కలసి ప్రయాణించేందుకు సారాను ఆహ్వానించడం మాకెంతో ఆనందదాయకం. ఫ్యాషన్, స్టైలింగ్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఆమె ప్రయోగాత్మక స్టైలింగ్ అనేది మా బ్రాండ్ ఇమేజ్ ను ప్రతిఫలిస్తుంది. ఆమెను మించిన మెరుగైన ఇన్వెస్టర్, భాగస్వామి మరొకరిని కనుగొనలేం. గొప్ప విజయాలకు ఈ భాగస్వామ్యం బాట వేస్తుందని ఆశిస్తున్నాం’’ అని అన్నారు.

ఈ బ్రాండ్ ప్రస్తుత పోర్ట్ ఫోలియోలో స్త్రీ, పురుషుల టాప్ వేర్, బాటమ్ వేర్, ఇన్నర్ వేర్, యాక్టివ్ వేర్ ఉన్నాయి.

 ఒక బ్రాండ్ గా సౌలెడ్ స్టోర్ ఓమ్ని చానల్ శక్తిని ఎంతగానో విశ్వసిస్తుంది. 4 మిలియన్లకు పైగా కస్టమర్ బేస్ ను ఇది విజయవంతంగా నిర్మించుకుంది.

సౌలెడ్ స్టోర్ గురించి:

సౌలెడ్ స్టోర్ అనేది భారతదేశ అతిపెద్ద ఆన్ లైన్ మర్కండైజింగ్ ప్లాట్ ఫామ్. 180కి పైగా లైసెన్సులు కలిగి ఉంది. డిస్నీ, వార్నర్ బ్రదర్స్, డబ్ల్యూడబ్ల్యూఈ, ఐపీఎల్, వయాకామ్ 18 వంటివి ఉన్నాయి. ప్రాథమికం గా ఆన్ లైన్ బ్రాండ్ అయినప్పటికీ, ప్రస్తుతం ఇది ఐదు ఆఫ్ లైన్ స్టోర్స్ ను కలిగిఉంది. త్వరలోనే మరిన్ని ప్రారంభించనుంది.

Banner
, , , , , , ,
Similar Posts
Latest Posts from Vartalu.com