• మూడవ శాఖా కార్యాలయాన్ని హైదరాబాద్‌లోని పెద్ద అంబర్‌పేట వద్ద ప్రారంభించారు
• ఈ డీలర్షిప్ ఇప్పటికే మియాపూర్, ఖైరతాబాద్, వరంగల్, జడ్చర్ల, కరీంనగర్, ఖమ్మంలలో కార్యాలయాలు కలిగి ఉంది

• ఈ శాఖ ప్రారంభోత్సవంలో సానీ ఇండియా రీజనల్ మేనేజర్ శ్రీ చేతన్ కుమార్, మధుర ఇంజినీరింగ్ డైరెక్టర్ శ్రీమతి రంజిత రావు కాట్రగడ్డ పాల్గొన్నారు.

హైదరాబాద్, 06 మార్చి 2022 ః నిర్మాణ రంగ యంత్రసామాగ్రి మరియు హెవీ మెషినరీ తయారీదారులలో అగ్రగామి సానీ ఇండియా, తెలంగాణా కోసం తమ ఆధీకృత డీలర్ మధుర ఇంజినీరింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి రాష్ట్రంలో తమ ఉనికిని మరింత బలోపేతం చేసుకుంటూ తమ 3ఎస్ (సేల్స్, సర్వీస్, స్పేర్స్) శాఖలను పెద్ద అంబర్‌పేట, హైదరాబాద్ వద్ద ప్రారంభించింది. ఈ డీలర్షిప్ ఇప్పటికే మియాపూర్, ఖైరతాబాద్,వరంగల్, జడ్జర్ల, కరీంనగర్, ఖమ్మం వద్ద ఉంది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సానీ ఇండియా రీజనల్ మేనేజర్ శ్రీ చేతన్ కుమార్ ; మధుర ఇంజినీరింగ్ డైరెక్టన్ శ్రీమతి రంజిత రావు కాట్రగడ్డ నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అనుసరించి వినియోగదారులు, ఫైనాన్షియర్ల సమావేశం నిర్వహించారు. ఈ నూతన కార్యాలయం ఈ ప్రాంతంలో కంపెనీ, వినియోగదారుల నడుమ అత్యంత కీలకమైన బంధంగా నిలువడంతో పాటుగా మరింతగా శానీఇండియా సేవలను అందించనుంది. ఈ నూతన కేంద్రం భవిష్యత్ విస్తరణ అవకాశాలను పెంపొందించడంతో పాటుగా నెట్వర్కింగ్, భాగస్వామ్యానికి మరిన్ని అవకాశాలనూ అందిస్తుంది. శానీ ఇండియా మరియు మధుర ఇంజినీరింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లు ఈ నూతన 3ఎస్ శాఖా కార్యాలయం డీలర్షిప్ కొనసాగింపుకు సహాయపడటంతో పాటుగా 2020 నుంచి భారతదేశంలో శానీ కి నెంబర్ 1 ఎక్సకవేటర్ డీలర్‌గా తమ ట్రాక్ రికార్డును ఈ డీలర్షిప్ కొనసాగించడంలో సహాయపడుతుంది.

ఈ సందర్భంగా శానీ హెవీ ఇండస్ట్రీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ , చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సేల్స్, మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్) ధీరజ్ పాండా మాట్లాడుతూ ‘‘ మా డీలర్షిప్ మధుర ఇంజినీరింగ్ సర్వీసెస్ ప్రైవేట్లిమిటెడ్ కోసం నూతన కార్యాలయం ప్రారంభించడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. సానీ ఇండియా నుంచి మేము మా మద్దతును అవసరమైనప్పుడల్లా అందిస్తూనే ఉంటాము.ఈ నూతన 3ఎస్ సదుపాయం ఈ ప్రాంతంలో సానీ ఇండియా పట్ల అచంచల విశ్వాసం చూపుతున్న మా వినియోగదారులకు తగిన సేవలను అందించగలదు’’ అని అన్నారు.
ఆయనే మాట్లాడుతూ ‘‘సాంకేతికంగా అత్యున్నతమైన యంత్రసామాగ్రిని అందించడానికి మేము నిత్యం కృషి చేస్తూనే ఉన్నాము. వీటి ద్వారా మా వినియోగదారులతో పాటుగా డీలర్లకు సైతం సానుకూల మార్పు తీసుకురాగలం’’ అని అన్నారు
మధుర ఇంజినీరింగ్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మధుసూదన్ కాట్రగడ్డ మాట్లాడుతూ ‘‘ నిర్మాణ యంత్ర సామాగ్రి పరిశ్రమకు అవసరమైన వ్యవస్థ తెలంగాణాకు ఉంది. దీనికి తోడు రాష్ట్ర స్ధాయిలో తెలంగాణా ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యాపార వాతావరణంతో పాటుగా కేంద్ర ప్రభుత్వ విధానాలు కూడా దీనికి దోహదపడుతున్నాయి. వీటితో పాటుగా సానీ ఇండియా నుంచి మాకు అత్యద్భుతమైన సహకారం లభిస్తుంది. ఇది అవకాశాలను వినియోగించుకునేందుకు, ఓ సంస్థగా అభివృద్ధి చెందేందుకు తోడ్పడింది. ఈ నూతన 3ఎస్ శాఖాకార్యాలయం మా విస్తరణకు మరింతగా తోడ్పడనుంది’’ అని అన్నారు.
నిర్మాణ రంగ యంత్ర సామాగ్రి మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందుతుండటం వల్ల ఈ విస్తరణ ఇప్పటి వరకూ చేరుకోని మార్కెట్లను చేరుకునేందుకు మరియు సంభావ్య వినియోగదారులను చేరుకునేందుకు తోడ్పడుతుంది. సానీ ఇండియా ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ 1800 209 3337ను ఏర్పాటుచేసింది. తమ సందేహాలు, సేవలకు సంబంధించి న సమస్యలను ఇక్కడ పొందవచ్చు.