
అనేక వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. కొన్ని ఫొటోలు మాత్రం తెగ వైరల్ అవుతుంటాయి. స్మార్ట్ఫోన్లు పెరిగిపోయి, డేటారేట్లు సాధ్యమైన మేరకు అందరికీ అందుబాటులోకి వచ్చాక సోషల్ మీడియా వినియోగించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా, ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకొన్నా.. క్షణాల్లో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయిపోతోంది. అంతేకాదు డిస్కషన్ పెట్టేస్తున్నారు. మరికొందరు అయితే ఇంకాస్త ముందుకు వెళ్ళి…వెంటవెంటనే ఆ అంశంపై ట్రోల్స్ చేస్తూ మీమ్స్ వేసేస్తున్నారు. తాజాగా ఇక్కడ మీరు చూస్తున్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫేస్ బుక్ లో ఈ ఫొటో పెట్టి డిస్కషన్స్ షురూ చేసారు. అసలు ఏముంది ఈ ఫోటోలో అంటే…ఓ మహిళ చితి పెడుతోంది. ఆమె భర్త పార్ధివ దేహానికి చితి పెడుతోందని అంటున్నారు కొందరు.
ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్టిట్టర్(Twitter)లో చాలా మంది ఆ ఫొటోలను ఉంచుతూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే భర్త కి చితి పెడుతున్న ఈమె ఎవరు ? చనిపోయిన వ్యక్తి ఎవరు ..ఇలా ఎవరకి తోచిన వాళ్ళ కామెంట్స్ పెడుతున్నారు. ఈ నేఫద్యంలో ఈ ఫోటో గురించి ఆరా తీయగా మాకు ( వార్తలు.కామ్ ) కి అందిన సమాచారం ఏంటంటే ఇది నిజమైన ఫోటో కాదు అని.. ott సినిమా కోసం తీసిన షూట్ లో నుండి ఎవరో ఆకతాయి ఫోటో తీసి పంపారు అని తెలిసింది.
అలాగే ఈ సినిమా కి ప్రముఖ దర్శకుడు వంశి గారి .. కథ అందిచంగా రాఘవ రెడ్డి అనే నూతన దర్శకుడు డైరక్ట్ చేస్తున్నారని తెలిసింది. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ పూర్తి చేసుకుని ప్రముఖ OTT ప్లాట్ ఫారం లో కి విడుదల అవుతుంది అని చెప్తున్నారు. అలాగే .. ఈ ఫొటోలో ఉన్నది ప్రముఖ సినిమా తార వనిత రెడ్డి అని సమాచారం.
Vartalu.com, a Telugu100.com Network