Banner
banner

కచ్ కళ, సంస్కృతి నుండి ప్రేరణ పొందిన అద్భుతమైన ఆభరణాల శ్రేణి

భారతదేశంలోని ప్రముఖ ఆభరణాల బ్రాండ్‌లలో ఒకటైన రిలయన్స్ జ్యువెల్స్… భారతదేశపు సుసంపన్నమైన, వైవిధ్యమైన వారసత్వాన్ని వ్యక్తీకరించే కళ, సంస్కృతి, సంప్రదాయాలు, నమ్మకాల నుండి ప్రేరణ పొందిన అనేక సేకరణలకు ప్రసిద్ధి చెందింది. ఒడిశా నుండి ప్రేరణ పొందిన ఉత్కళ మొదలుకొని బనారస్ నుండి ప్రేరణ పొందిన కాస్యం వరకు, రిలయన్స్ జ్యువెల్స్ తన ఆభరణాల డిజైన్‌ల ద్వారా భారతదేశపు గొప్ప, విభిన్నమైన వారసత్వాన్ని కొనసాగిస్తోంది.

పవిత్రమైన అక్షయ తృతీయ పండుగ నేపథ్యంలో, చక్కటి ఆభరణాల అద్భుతమైన సేకరణ “రంకార్”ని https://youtu.be/rLIbZm-ey8g రిలయన్స్ జ్యువెల్స్ ప్రారంభించింది. రాన్ ఆఫ్ కచ్ నుంచి, దాని విభిన్న వారసత్వం నుంచి ఈ సేకరణ ప్రేరణ పొందింది. మంత్రముగ్ధులను చేసే వైట్ రాన్, శక్తిమంతమైన రంగుల కలైడోస్కోప్‌కు నిలయం కచ్. శక్తిమంతమైన, అందమైన కచ్ కళారూపాల నుండి ప్రేరణ పొందిన అనేక మిశ్రితమైన డిజైన్లు, కళాత్మక ఆభరణాల శ్రేణి… వినియోగదారులు ఎంచుకోవడానికి అందుబాటులో ఉంది. ఈ శ్రేణిలో ప్రధానంగా… పురాతన బ్లాక్ ప్రింటింగ్ టెక్నిక్ -అజ్రఖ్, గొప్ప సహజ రంగులను ఉపయోగించి రూపొందించే అందమైన పెయింటింగ్-రోగన్, గోడలపై అద్దాలు చెక్కబడి ఉన్న అద్భుతమైన హస్తకళ-లిప్పన్, శక్తిమంతమైన కచ్ ఎంబ్రాయిడరీ, చాలా మంది ఇష్టపడే ప్రసిద్ధ టై-అండ్-డై టెక్నిక్-భంధానితోపాటు చివరగా కచ్ నుండి అందమైన చెక్క పని వంటివి కూడా ఉన్నాయి.

భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సంబరంగా జరుపుకోవడం, గౌరవించటంతోపాటు, తమ వినియోగదారుల కోసం రిలయన్స్ జ్యువెల్స్ అక్షయ తృతీయ పండుగను మరింత ప్రత్యేకంగా చేయాలని నిర్ణయించుకుంది. కచ్ హస్తకళతో, బంగారం, డైమండ్‌తో రూపొందించిన అందమైన నెక్లెస్ సెట్‌లు, లాకెట్ సెట్‌లు, చెవిపోగులు, ఉంగరాలు,  బ్యాంగిల్స్ రూపంలో ఈ అద్భుతమైన సేకరణను విడుదల చేసింది.

కచ్ అందాన్ని సజీవంగా ఉంచే అద్భుతమైన, విలాసవంతమైన చోకర్ సెట్‌లు మొదలుకొని పొడవాటి, మిశ్రితమైన, సొగసైన నెక్లెస్ సెట్‌ల వరకు వినియోగదారులకు ఈ సేకరణ విస్తృతమైన ఎంపికను అందిస్తుంది. 22 క్యారెట్ల బంగారంలో అందమైన డిజైనర్ గాజులు, ఉంగరాలను ఎంచుకోవచ్చు. సొగసైన ముత్యాలు రాన్ కు, నీలం, ఎరుపు రంగులలో ఎనామెలింగ్ పని అజ్రఖ్, భంధానిలకు ప్రతీకగా నిలుస్తాయి. కచ్ చెక్క పనిలోని సంక్లిష్టత… బంగారు చోకర్లను అందంగా తీర్చిదద్దడంలోనూ కనిపిస్తుంది. వివిధ సందర్భాలకు, బడ్జెట్‌లకు అనుగుణంగా విస్తృత శ్రేణి అందుబాటులో ఉంది. గోల్డ్ కలెక్షన్‌లోని డిజైన్‌లో మీనాకరి, కుందన్ యాక్సెంట్తో కూడిన సున్నితమైన ఫిలిగ్రీ వర్క్, టెంపుల్-స్టైల్ ఆభరణాలు ఉన్నాయి.

రంకార్ సేకరణలోని డైమండ్ డిజైన్‌లు కచ్‌లోని చైతన్యానికి తార్కాణంగా నిలుస్తాయి. మెరిసే డైమండ్ నెక్లెస్ సెట్‌లు, లాకెట్టు సెట్‌లు, ఉంగరాలు కచ్ హస్తకళ స్ఫూర్తిని, నైపుణ్యాన్ని అనేక రకాలుగా ప్రతిబింబిస్తాయి. సున్నితమైన నెక్లెస్ సెట్‌లు అజ్రఖ్, బంధాని క్రాఫ్ట్‌ల మిశ్రితత్వాన్ని నీలం, ఎరుపు రంగులలో అందమైన ఎనామెలింగ్‌తో ప్రదర్శిస్తాయి, ఇవి అద్భుతమైన వజ్రాలతో ప్రత్యేకంగా నిలుస్తాయి. రాంకార్ సేకరణలోని వజ్రాల అమరిక కూడా ఒక సొగసైన రూపంలో కళారూపాలను ప్రతిబింబించేలా ప్రత్యేకంగా ఉంటుంది. అందమైన కచ్ ఎంబ్రాయిడరీ డైమండ్ శ్రేణిలో అనేక డిజైన్‌లను ప్రేరేపిస్తుంది, ఇది పండుగ, పెళ్లి, సమకాలీన రూపాలకు అనువైన ఆధునిక, సమకాలీన రూపాలను సృష్టిస్తుంది.

సరికొత్త కలెక్షన్‌పై రిలయన్స్ జ్యువెల్స్ సీఈవో సునీల్ నాయక్ మాట్లాడుతూ, “భారతదేశం చాలా విస్తారమైన, విలువైన వారసత్వాన్ని కలిగి ఉంది, ఇది మన దేశ మూలాలలో అంతర్భాగమైనది. ఈ వారసత్వాన్ని అన్వేషించడంలో, మన సంస్కృతి, కళారూపాల లోతైన మూలాల నుండి అత్యుత్తమ ఆభరణాల డిజైన్‌లను తీసుకొస్తున్నందుకు మేము గర్విస్తున్నాము. ప్రతి ఒక్కరి జీవితంలో అదృష్టాన్ని, విజయాన్ని తెచ్చే శుభ సందర్భమైన అక్షయ తృతీయ కోసం మా డిజైన్ వారసత్వాన్ని కొనసాగిస్తూ, రాన్ ఆఫ్ కచ్ స్ఫూర్తితో అద్భుతంగా రూపొందించిన అలంకారమైన సేకరణ “రాంకార్”ని అందించడం మాకెంతో సంతోషంగా ఉంది. ఈ సేకరణలోని ప్రతి బంగారం, డైమండ్ నెక్లెస్, చెవిపోగులు, ఉంగరాలు, గాజులు ప్రత్యేకమైనవి, అలాగే కచ్ విభిన్న కళ, సంప్రదాయానికి, వారసత్వానికి సూచికగా నిలుస్తాయి” అని అన్నారు.

కొత్త ఆభరణాలతో పాటు, బంగారు ఆభరణాలు, వజ్రాభరణాల విలువ మీద మేకింగ్ ఛార్జీలపై 25% వరకు వినియోగదారులు తగ్గింపును కూడా పొందవచ్చు. ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిలయన్స్ జ్యువెల్స్ ఫ్లాగ్‌షిప్ షోరూమ్‌లలో అద్భుతమైన సేకరణ  ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది, రిలయన్స్ జ్యువెల్స్ వెబ్‌సైట్‌లో ఎంపిక చేసిన శ్రేణి అందుబాటులో ఉంటుంది. మీరు సేకరణను వీక్షించవచ్చు, వాటిని ఇక్కడ ప్రయత్నించవచ్చు https://bit.ly/RJAT_PR

రిలయన్స్ జ్యువెల్స్ గురించి:

రిలయన్స్ జ్యువెల్స్, భారతదేశంలోని ప్రముఖ రిటైలర్ అయిన రిలయన్స్ రిటైల్ లిమిటెడ్లో ఒక భాగం.ఈ బ్రాండ్ బంగారు, డైమండ్, వెండి ఆభరణాల సేకరణల అద్భుతమైన, విస్తృత శ్రేణిని అందిస్తుంది. డిజైన్, హస్తకళపై దృష్టి సారించి, మా కస్టమర్‌లకు కళ, క్రాఫ్ట్, గొప్ప భారతీయ వారసత్వం నుండి ప్రేరణ పొందిన ప్రత్యేకమైన, విశిష్టమైన డిజైనర్ కలెక్షన్‌లను అందించడం బ్రాండ్ లక్ష్యం. రిలయన్స్ జ్యువెల్స్ తన కస్టమర్ జీవితంలోని ప్రతి ప్రత్యేక క్షణాన్ని సంతోషంగా జరుపుకోవాలని విశ్వసిస్తోంది.

రిలయన్స్ జ్యువెల్స్ 125+ నగరాల్లో 250+ ఫ్లాగ్‌షిప్ షోరూమ్‌లు, షాప్-ఇన్ షాపులను కలిగి ఉంది, నిర్వహిస్తోంది, విస్తృతంగా అభివృద్ధి చెందుతోంది. బ్రాండ్ ఎల్లప్పుడూ ఆదర్శప్రాయమైన సేవలు, ఏకీకృత జ్యువెలరీ షాపింగ్ అనుభవాన్ని అందించడం ద్వారా కస్టమర్ ను మెప్పించేందుకు నిరంతరం శ్రమిస్తుంది. రిలయన్స్ జ్యువెల్స్ వద్ద, బంగారం, వజ్రాలు అత్యంత సరసమైన ధరలలో లభిస్తాయి. జీరో-వేస్టేజ్, కాంపిటేటివ్ మేకింగ్ ఛార్జీలు కస్టమర్‌లకు 100% సంతృప్తిని అందిస్తాయి. రిలయన్స్ జ్యువెల్స్ ప్రతి ఆభరణంలో 100 శాతం స్వచ్ఛత, పారదర్శక ధర, ఖచ్చితమైన నాణ్యతపై హామీ ఇస్తుంది. బ్రాండ్ 100 శాతం BIS హాల్‌మార్క్ బంగారాన్ని మాత్రమే వాడుతుంది, ఉపయోగించిన ప్రతి వజ్రం స్వతంత్ర ధృవీకరణ ప్రయోగశాలలతో ధృవీకరించబడుతుంది. అన్ని రిలయన్స్ జ్యువెల్స్ షోరూమ్‌లలో మరమ్మతుల కోసం నాణ్యత తనిఖీ టెక్ రూమ్‌లు, బంగారం స్వచ్ఛతను ఉచితంగా అంచనా వేయడానికి కస్టమర్‌లకు కారత్ మీటర్‌లు ఉన్నాయి. ఇది కాకుండా బ్రాండ్ ప్రతి కొనుగోలుపై లాయల్టీ పాయింట్‌లను కూడా అందిస్తుంది.

ప్రతి సేకరణలో అద్భుతమైన వివిధ రకాల డిజైన్‌లతోపాటు, ప్రతి వ్యక్తిత్వానికి, ప్రతి సందర్భానికి  సరిగ్గా సరిపోయే ఆభరణాలను రిలయన్స్ జ్యువెల్స్ కలిగి ఉంది.

Banner
, , , , , , , ,
Similar Posts
Latest Posts from Vartalu.com