Banner
banner

భారతదేశపు ప్రముఖ జ్యూయెలరీ బ్రాండ్‌ – రిలయన్స్‌ జువెల్స్, ప్రేమికుల కోసం వాలెంటైన్స్ డే కలెక్షన్స్‌ “ఫ్లోరియో”ను ఆవిష్కరించింది. కాలంతో పాటు ఎదుగుతూ బలపడే ప్రేమ భావనను అందిపుచ్చుకుంటూ ఈ లవ్‌ సీజన్‌లో వాలెంటైన్స్ డే జరుపుకునేందుకు ఆధునికత కలబోసిన అతి సరళమైన డిజైన్లను రిలయన్స్ జ్యువెల్స్ విడుదల చేసింది.

ప్రతీ రోజు ఎంతో అందంగా పెరిగే మొక్కలు, పూలను ప్రేరణగా తీసుకొని ఈ కలెక్షన్‌లోని డిజైన్లు రూపొందించారు. విత్తనం ఒక అందమైన మొక్కలు మారినట్టుగా, చిగురిస్తున్న ప్రేమ కథ ఒక అందమైన బంధంగా మారుతుంది. అన్ని మంచి విషయాలు కాలంతో పాటు వృద్ధి చెందుతూ ఉంటాయి. ఈ సొగసైన డైమండ్‌ కలెక్షన్‌లోని ప్రతీ ఆభరణం నిజమైన ప్రేమను పంచేలా ఎంతో జాగ్రత్తగా డిజైన్‌ చేయబడింది, అది మీ ప్రేమించే వారికి గుర్తుగా, పెరుగుతున్న మీ గుర్తును గుర్తు చేస్తూ ఉంటుంది.

ఈ ప్రత్యేకమైన కలెక్షన్‌ ‘ఫ్లోరియో’ అద్భుతమైన డిజైన్లలో రోజ్‌ గోల్డ్‌, ఎల్లో గోల్డ్‌లో రింగులు, పెండెంట్లుగా లభిస్తుంది. వీటి ప్రారంభ ధర రూ.12,000. కాలంతో పాటు పెరిగే ప్రేమ, బలమైన బంధాలకు ఇది చక్కని వ్యక్తీకరణ. ఇది మీ వ్యక్తిగత ఆభరణాల కలెక్షన్‌కు అదనపు ఆకర్షణగా నిలుస్తుంది, అలాగే మీరు ప్రేమించే వ్యక్తులకు ఒక ప్రశంసా చిహ్నంగా నిలుస్తుంది.

కొత్త కలెక్షన్‌ ప్రవేశపెట్టడంతో పాటు డ్రీమ్‌ డైమండ్‌ సేల్‌ పేరుతో ప్రత్యేక ఆఫర్‌ కూడా ప్రకటించింది. ఫిబ్రవరి 28 వరకు ఉండే ఈ ఆఫర్‌లో భాగంగా రిలయన్స్‌ జ్యువెల్స్‌లో కొనుగోలు చేసే డైమండ్‌ ఆభరణాలపై ఇన్వాయిస్‌ విలువపై 25% వరకు తగ్గింపు ఉంటుంది. బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలపై 25% వరకు తగ్గింపును కూడా కొనుగోలుదారులకు పొందవచ్చు.

ఈ అద్భుతమైన కలెక్షన్‌ దేశవ్యాప్తంగా ఉన్న రిలయన్స్ జువెల్స్ ప్రత్యేక షోరూమ్స్‌లో లభిస్తుంది. ఎంపిక చేసిన రేంజ్‌ రిలయన్స్ జువెల్స్ వెబ్‌సైట్‌ www.reliancejewels.com   లో లభిస్తుంది.

కొత్త కలెక్షన్‌ గురించి రిలయన్స్ జువెల్స్ సీఈఓ సునీల్‌ నాయక్‌ మాట్లాడుతూ, “ ఈ ప్రేమ సీజన్‌లో మేము మా సరికొత్త కలెక్షన్‌ ఫ్లోరియో ద్వారా మా విలువైన కస్టమర్లతో నిజమైన ప్రేమను పంచాలని కోరుకుంటున్నాం. ఖాతాదారులకు ఎప్పుడూ ఉత్తమమైనవే అందించాలన్నది సదా మా లక్ష్యం. ప్రేమలో ఎదగండి అనే సిద్ధాంతాన్ని ప్రేరణగా తీసుకొని రూపొందించిన ఈ డిజైన్స్‌, ఒకరిని ఒకరు ప్రేమించేలా, బంధాలు బలోపేతం చేసేలా స్ఫూర్తి నింపుతాయని మేము ఆశిస్తున్నాం” అన్నారు.

రిలయన్స్‌ జ్యూవెల్స్ గురించి:

భారతదేశంలో టాప్‌ 10 విశ్వసనీయమైన బ్రాండ్స్‌లో ఒకటైన రిలయన్స్ రిటైల్‌ లిమిటెడ్‌లో భాగం రిలయన్స్ జ్యువెల్స్. అద్భుతమైన, విస్తృత శ్రేణి గోల్డ్, డైమండ్, ప్లాటినం & సిల్వర్ ఆభరణాల కలెక్షన్స్ అందిస్తుంది ఈ బ్రాండ్. డిజైన్, నైపుణ్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ కళలు, హస్తకళలు, ఘనమైన భారతీయ వారసత్వం నుంచి ప్రేరణ పొంది ప్రత్యేకమైన, వైవిధ్యభరితమైన డిజైనర్‌ కలెక్షన్స్‌ను కొనుగోలుదారులకు రిలయన్స్ జ్యువెల్స్ అందిస్తోంది. కస్టమర్లు తమ జీవితంలోని ప్రతీ ప్రత్యేకమైన సందర్భాన్ని వేడుకగా జరుపుకోవాలని రిలయన్స్‌ జ్యువెల్స్ కోరుకుంటుంది.

భారతదేశంలో 125+ నగరాల్లో 250+ ఫ్లాగ్‌షిప్ షోరూమ్‌లు & షాప్-ఇన్ షాపులు కలిగిన రిలయన్స్‌ జ్యువెల్స్ వాటిని గణనీయంగా విస్తరిస్తోంది. ఖాతాదారులకు అనుపమానమైన సేవలు, ఒక ప్రత్యేకమైన ఆభరణాల కొనుగోలు షాపింగ్‌ అనుభూతిని అందించేందుకు బ్రాండ్‌ ఎల్లవేళల కృషి చేస్తుంది. రిలయన్స్ జ్యువెల్స్‌లో స్వర్ణ, వజ్రాభరణాలు అత్యంత సరసమైన ధరల్లో లభిస్తాయి.  జీరో వేస్టేజ్‌, సరసమైన తయారీ ధరలు కొనుగోలుదారులకు 100% సంతృప్తిని అందిస్తాయి. 100 శాతం స్వచ్ఛత, పారదర్శకమైన ధరల విధానం, ప్రతీ నగపై హమీపూర్వక నాణ్యతను రిలయన్స్ జ్యువెల్స్‌ అందిస్తుంది. 100 శాతం బీఐఎస్‌ హాల్‌మార్క్డ్‌ బంగారం, అంతర్జాతీయంగా స్వతంత్ర ధ్రువీకరణ ప్రయోగశాలలు ధ్రువీకరించిన ఆభరణాలను మాత్రమే ఈ బ్రాండ్‌ విక్రయిస్తుంది. రిపేర్ల కోసం క్యూసీ టెక్‌రూమ్స్‌తో పాటు బంగారం స్వచ్ఛతను కొనుగోలుదారులు ఉచితంగా తెలుసుకునేందుకు క్యారెట్‌ మీటర్‌, ఇంకా ఎన్నో సేవలు రిలయన్స్ జ్యువెల్స్ అందిస్తోంది. ప్రతీ కొనుగోలుపై లాయల్టీ పాయింట్లు కూడా ఈ బ్రాండ్ అందిస్తోంది.

ప్రతీ కలెక్షన్‌లో మైమరపింపజేసే డిజైన్లు అందించే రిలయన్స్ జ్యువెల్స్‌లో ప్రతీ వ్యక్తిత్వానికి, ప్రతీ సందర్భానికి ఒక ఆభరణం లభిస్తుంది.

మరింత సమాచారం కోసం మమ్మల్ని ఇక్కడ కలవండి http://www.reliancejewels.com

ఎఫ్‌బీ: https://www.facebook.com/RelianceJewels/

ఇన్‌స్టాగ్రామ్‌: https://www.instagram.com/reliancejewels/

యూట్యూబ్‌: సందర్శించండి ? సబ్‌స్క్రైబ్‌ చేయండి ఇక్కడ – https://bit.ly/3CFj3Y5

Banner
, , , , , , ,
Similar Posts
Latest Posts from Vartalu.com