· సీజన్ 8 కోసం నూతన టీమ్ పరిచయం చేసిన తెలుగు టైటాన్స్
· డిసెంబర్ 22,2021– జనవరి 20,2022 వరకూ (షెడ్యూల్ 1) జరుగబోయే వివో ప్రో కబడ్డీ సీజన్ 8 బెంగళూరులో ప్రారంభం కానుంది
గత ఏడు సీజన్లుగా అపూర్వమైన విజయం సాధించిన ప్రో కబడ్డీ లీగ్, మరో మారు క్రీడాభిమానుల ముందుకు రాబోతుంది. డిసెంబర్ 22, 2021 మరియు జనవరి 20,2022 (షెడ్యూల్ 1) నడుమ జరుగబోయే ఈ సీజన్ కోసం శ్రీ శ్రీనివాస్ శ్రీరామనేని, టీమ్ యజమాని, తెలుగు టైటాన్స్ తమ టీమ్‌ను పరిచయం చేశారు.
తెలుగు టైటాన్స్ బృందం ః రోహిత్‌కుమార్ (కెప్టెన్), సిద్ధార్ద్ దేశాయ్, అమిత్ చౌహాన్, అంకిత్ బెనివాల్, గల్లా రాజు, హియుంషు పార్క్ , రజ్నీష్, రాకేష్ గౌడ, ఆకాష్ దత్తుఅస్రూల్, ఆకాష్ చౌదరి. మనీష్, ఆదర్శ్, టీ సీ అర్జున్, సందీప్ కండోలా, ప్రిన్స్ డి, రుతురాజ్ కొరావీ, సురీందర్ సింగ్, టెత్సురో అబీ
తెలుగు టైటాన్స్ టీమ్ యజమాని శ్రీ శ్రీనివాస్ శ్రీరామనేని మాట్లాడుతూ ‘‘ఇక్కడ ఎలాంటి ఒత్తిళ్లూ లేవు. దాదాపు రెండేళ్ల విరామం తరువాత, అపారమైన ప్రతిభ ఇప్పుడు బయటకు రావడంతో పాటుగా వీరిలో కొంతమంది ఇప్పటికే మా టీమ్‌లోకి వచ్చారు. అంతేకాదు, వీరిలో చాలామంది తెలుగు టైటాన్స్ టీమ్‌లో పీకెఎల్, సీజన్8లో మొట్టమొదటి సారిగా ఆడుతున్నారు. తెలుగు టైటాన్స్ సిద్ధార్ద్ దేశాయ్ (1.30 కోట్ల రూపాయలు) ఈ పీకెఎల్ టోర్నమెంట్లో అత్యంత ఖరీదైన రెండవ ఆటగానిగా నిలిచాడు. ఇతనితో పాటుగా పలువురు సుప్రసిద్ధ ఆటగాళ్లను సైతం భారీ ధరలకు సొంతం చేసుకున్నాం’’ అని అన్నారు.
తెలుగు టైటాన్స్ కోచ్ శ్రీ జగదీష్ కుంబ్లే మాట్లాడుతూ ‘‘ మొట్టమొదటిసారిగా, కోవిడ్–19 కారణంగా ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. అంటే దానర్ధం అన్ని మ్యాచ్‌లనూ పూర్తి రక్షిత వాతావరణంలో నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్లో 12 టీమ్‌లూ ఇప్పుడు సింగిల్ లీగ్ ఫేజ్‌లో పోటీ పడతాయి. గతంలో ఈ టోర్నమెంట్ దేశవ్యాప్తంగా పలు నగరాలలో జరిగితే, ఈ సారి మాత్రం బెంగళూరు నగరంలోనే అన్ని మ్యాచ్‌లూ బయో సెక్యూర్ వాతావరణంలో జరుగుతాయి’’ అని అన్నారు.

స్పాన్సర్స్ ః
కబడ్డీ క్రీడతో పాటుగా తెలుగు టైటాన్స్ బ్రాండ్‌కు ప్రాచుర్యం కల్పించేందుకు వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పరుచుకోవడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము
ఇండీ న్యూస్– ప్రిన్సిపల్ టీమ్ స్పాన్సర్
హెర్బాలైఫ్ న్యూట్రిషన్– అధికారిక న్యూట్రిషన్ భాగస్వామి, తెలుగు టైటాన్స్
ట్రూకీ– తెలుగు టైటాన్స్ అధికారిక ఆడియో భాగస్వామి ః ‘‘ ప్రో కబడ్డీ లీగ్‌లో అత్యంత ఉత్తమ జట్లలో ఒకటి అయిన తెలుగు టైటాన్స్‌కు అధికారిక ఆడియో భాగస్వామిగా నిలువడం పట్ల సంతోషంగా ఉన్నాము. దేశంలోని ప్రతి కబడ్డీ అభిమానికీ ఉత్సాహం తీసుకురాగలమనే విశ్వాసంతో ఉన్నాము. అంతేకాదు, గేమింగ్ ఆధారిత టీడబ్ల్యుఎస్ కంపెనీగా మమ్మల్ని మేము సమలేఖనం చేసుకున్నందున ఈ అద్భుతమైన భాగస్వామ్యం చేసుకునేందుకు ఖచ్చితమైన సమయంగానూ నిలుస్తుంది. మేము కలిసి చేయబోయే ప్రయాణం ఉత్సాహపూరితంగా ఉండటంతో పాటుగా వినోదాత్మకంగానూ ఉంటుందనే విశ్వాసంతో ఉన్నాం’’ అని పంకజ్ ఉపాధ్యాయ్, సీఈఓ, ట్రూకీ ఇండియా అన్నారు.
తెలుగు టైటాన్స్ అసోసియేట్ భాగస్వామి ఫాంటా ఫీట్ – ‘‘తెలుగు టైటాన్స్‌తో రాబోయే పీకెఎల్ సీజన్ కోసం భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఫాంటా ఫీట్ వద్ద మేము వినియోగదారులను ముందుంచుతుంటాం. తెలుగు టైటాన్స్‌తో భాగస్వామ్యంతో తెలుగు టైటాన్స్ యొక్క విస్తృతశ్రేణి అభిమానులు మాతో సహితంగా సన్నిహితంగా మెలగగలరని ఆశిస్తున్నాము. ఈ భాగస్వామ్యంతో ఇరువురమూ వీక్షకులతో అనుసంధానించబడటంతో పాటుగా వైవిధ్యమైన అనుభవాలను అందించగలరని భావిస్తున్నాము. తెలుగు టైటాన్స్‌కు అభినందనలు తెలుపుతున్నాము మరియు మాతో భవిష్యత్‌లో సైతం విజయవంతమైన భాగస్వామ్యం చేసుకోవాలని కోరుకుంటున్నాను’’ అని ప్రదీప్‌సిన్హ్ సోలంకీ, భాగస్వామి ఫాంటా ఫీట్ అన్నారు.
రేజ్ ఫ్యాన్ – అధికారిక ఫ్యాన్ ఎంగేజ్మెంట్ భాగస్వామి, తెలుగు టైటాన్స్
తెనాలి డబుల్ హార్స్ – అసోసియేట్ పార్టనర్, తెలుగు టైటాన్స్
బ్లూట్ టీ – ‘‘ పీకెల్ సీజన్ 8 కోసం తెలుగు టైటాన్స్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. మా తెలివైన వ్యాపార కేంద్రం సమగ్రమైన సేకరణ వేదికగా నిలుస్తుంది. ఇది బీఈబీ కొనుగోళ్లను కృత్రిమ మేథస్సుతో సాధ్యం చేస్తుంది. ఈ సీజన్ కప్‌ను ఏ విధంగా అయితే తెలుగు టైటాన్స్ టీమ్ గెలుపొందాలని లక్ష్యంగా పెట్టుకుందో అదే రీతిలో మా వేదికపై లావాదేవీలను నిర్వహించేలా వ్యాపార సంస్థలను గెలువాలని మేము ప్రయత్నిస్తున్నాము’’ శ్రీ శ్రీనివాస్ శ్రీరామనేని, సీఈఓ, బ్లూటీ అన్నారు.
Pro Kabaddi Season VIII to kick start-in Bengaluru from Dec 22nd 2021 – Jan 20th 2022 (Schedule 1).
The Pro Kabaddi Season VIII match’s schedule (1) as follows:
DATE DAY TIME MATCH
22nd Dec 2021 Wednesday 8:30pm onwards Telugu Titans vs Tamil Thalaivaa
25th Dec 2021 Saturday 8:30pm onwards Telugu Titans vs Puneri Paltan
28th Dec 2021 Tuesday 8:30pm onwards Telugu Titans vs Haryana Steelers
1st Jan 2022 Saturday 8:30 pm onwards Telugu Titans vs Bengaluru Bulls
3rd Jan 2022 Monday 8:30pm onwards Telugu Titans vs Patna Pirates
5th Jan 2022 Wednesday 8:30pm onwards Telugu Titans vs Dabang Delhi K.C.
8th Jan 2022 Saturday 8:30pm onwards Telugu Titans vs U Mumbai
11th Jan 2022 Tuesday 8:30pm onwards Telugu Titans vs Gujarat Giants
15th Jan 2022 Saturday 8:30pm onwards Telugu Titans vs U.P. Yoddha
17th Jan 2022 Monday 8:30pm onwards Telugu Titans vs Bengal Warriors
19th Jan 2022 Wednesday 8:30pm onwards Telugu Titans vs Jaipur Pink Panthers