
ఒడిషా మాజీ ముఖ్యమంత్రి హేమానంద బిశ్వాల్ కన్నుమూతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో-
“ఒడిషా మాజీ ముఖ్యమంత్రి శ్రీ హేమానంద బిశ్వాల్ మరణం బాధాకరం. ఆయన చాలా ఏళ్లు ప్రజా జీవితంలో చురుగ్గా ఉండటంతోపాటు ప్రజలతో మమేకమై విస్తృతంగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుత విషాద సమయంలో ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను- ఓం శాంతి” అని ఆయన పేర్కొన్నారు.
Courtesy :Press Information Bureau , GOI