Banner
banner

తోటివాళ్లెవరూ చేయలేని పనిని చేపట్టినపుడే స్త్రీ శక్తిమంతురాలవుతుంది.

– మార్జి పియర్సీ, అమెరికన్‌ రచయిత్రి

అవును ఆడవాళ్లు తలుచుకుంటే సాధ్యం కానిదేముంది..ఈ రోజు నా విజయం మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ. చూస్తూ ఉండండి… నాలాంటి అమ్మాయిలే వ్యాపారా సామ్రాజ్యాల్ని ఏలుతారు అంటారు ఆసియా నుంచి తొలిసారిగా యూనికార్న్‌ క్లబ్‌లో అడుగుపెట్టిన అంకితిబోస్‌. అలాంటి మరో మహిళా రత్నమే ఫల్గుణి నాయక్.నిబద్ధత టన్నుల కొద్దీ ఉన్న ఆమె గురించి ఇప్పుడు ప్రపంచం మొత్తం మాట్లాడుతోంది.

అవును..తప్పదు …ఆమె తనకంటూ ఓ స్దానం సంపాదించుకున్నప్పుడు మీడియా మౌనం వీడింది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో చోటు సాధించారు నైకా (Nykaa) వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్. ఫల్గుణి నాయర్ ప్రారంభించిన బ్యూటీ స్టార్టప్ ఆమెను ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత సంపన్నుల ర్యాంక్‌ల సరసన నిలిపింది. ఆమె స్థాపించిన ఈ కామర్స్‌ కంపెనీ నైకాలో సగం షేర్లు ఆమెవే కావటం గమనార్హం. ఇప్పుడా ఆ షేర్లు 89% వరకు పెరగడంతో ఇప్పుడు 6.5 బిలియన్‌ డాలర్లు(రూ.48 కోట్లు)తో అత్యంత సంపన్నురాలుగా మారారు.  అయితే బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆమె భారతదేశపు అత్యంత సంపన్న స్వీయ-నిర్మిత మహిళా బిలియనీర్‌గా నిలిచారు.

ఫల్గుణి నాయర్ గతంలో 20 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా పనిచేశారు. 2012లో నైకాను ప్రారంభించారు. ఈ రోజు ఆమె మనదేశంలోనే అత్యంత ధనవంతులైన మహిళల్లో ఒకరిగా నిలిచారంటే దాని వెనక పెద్ద ప్రయాణమే ఉంది. ఆ ప్రయాణం చాలా స్ఫూర్తిదాయకమైనది.  
నైకా గురించి..

కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ మాజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అయిన ఫల్గుణి నాయర్‌ 2012లో నైకాను స్థాపించారు.  నైకా, నైకా ఫ్యాషన్‌ అనే రెండు వ్యాపార విభాగాల కింద సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ, ఫ్యాషన్‌ ఉత్పత్తులను అమ్ముతున్నారు. ఆన్‌లైన్ బీపీసీలో నైకా ప్రముఖ కంపెనీల్లో ఒకటిగా ఉంది. కోట్లాది మంది ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు. అనేక నగరాల్లో నైకా 70 స్టోర్లు ప్రారంభించింది. తాజా ఐపీవో ద్వారా వచ్చిన నిధులతో అనేక ఫ్యాషన్ ఉత్పత్తుల స్టోర్లు ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది.2021 ఆగస్టు 31 వరకు ఈ సంస్థ మొబైల్‌ యాప్‌లు 5.58 కోట్ల మేర డౌన్‌లోడ్‌ అయ్యాయి. ఈ రోజు లాభాల్లో నడుస్తోన్న డిజిటల్ స్టార్టప్ కంపెనీల్లో నైకా ఒకటి. కోవిడ్ 19 మహమ్మారి తరువాత కంపెనీ ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడింది. 2020లో కంపెనీ రూ.16 కోట్ల నష్టాలు చవిచూడగా, 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.60 కోట్ల లాభాలు ప్రకటించింది.

 ‘నేను 50 సంవత్సరాల వయసులో నైకా సంస్థను ప్రారంభించాను. అప్పుడు నాకు ఎలాంటి అనుభవం లేదు. ప్రతి ఒక్కరికి నైకా స్ఫూర్తిగా నిలుస్తుందని నేను ఆశిస్తున్నాను’ అని స్టాక్ మార్కెట్లో కంపెనీ షేర్ లిస్టింగ్‌కు ముందు ఫల్గుణి నాయర్ చెప్పారు. గ్రేట్ కదా.

Banner
,
Similar Posts
Latest Posts from Vartalu.com