Banner
banner

భారతదేశ అతిపెద్ద డయాలిసిస్ నెట్ వర్క్, భారతదేశంలో డయాలిసిస్ ను పునర్ నిర్వచించడంలో అగ్రగామి  అయిన నెఫ్రోప్లస్, భారతదేశ అగ్రగామి ఆరోగ్య సంరక్షణ సంస్థల్లో ఒ కటైన కేర్ హాస్పిటల్స్ తో తన అనుబంధాన్ని ప్రకటించింది. మహారాష్ట్ర లోని నాగ్ పూర్, చత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లలోని కేర్ ఆసుపత్రుల్లో డయాలిసిస్ కార్యకలాపాలను నెఫ్రో ప్లస్ ప్రారంభించింది. అధిక నా ణ్యమైన, రోగి కేంద్రిత డయాలిసిస్ సంరక్షణ అందించేందుకు చేసే ప్రయాణంలో భాగంగా ప్రముఖ హాస్పిట ల్ చెయిన్ తో భాగస్వామిగా మారడంతో నెఫ్రోప్లస్ తన కీర్తికిరీటంలో మరో కలికితురాయిని చేర్చుకున్నట్ల యింది. 

ఈ భాగస్వామ్యం ద్వారా, ప్లాస్మాఫెరెసిస్, సిఆర్ఆర్ టి, హెచ్ డిఎఫ్, ఎస్ఎల్ఇడి లతో సహా క్రిటికల్ కేర్ స ర్వీస్ లతో పాటుగా హీమోడయాలిసిస్ ప్రొసీజర్లలో అధిక నాణ్యమైన చికిత్సను నెఫ్రోప్లస్, కేర్ హాస్పిటల్స్ అందిస్తాయి. డయాలిసిస్ వారికి క్రమం తప్పకుండా సపోర్ట్ గ్రూప్ మీటింగ్స్, ఈవెంట్స్ నిర్వహించడం ద్వారా వారు సాధారణత్వానికి దగ్గరగా ఉండే జీవితాన్ని గడిపేందుకు ఈ భాగస్వామ్యం వీలు కల్పిస్తుంది. ఈ కార్యక్రమాలు రోగికి తను అనుభవాలను పంచుకునేందుకు ఒక వేదికగా ఉంటాయి. తమలోని సంకో చాలను దూరం చేసుకునేందుకు, జీవితంలో ఆత్మవిశ్వాసం పెంచుకునేందుకు తోడ్పడుతుంది. 

రోగి-కేంద్రిత విధానంతో ఇక్కడ ప్రతి రోగి కూడా ఒక ‘అతిథి’లా చూడబడుతారు. సాధ్యమైనంతగా సాధారణ జీవితానికి దగ్గరగా జీవితం గడిపేలా ఆయా వ్యక్తులను నెఫ్రోప్లస్ ప్రోత్సహిస్తుంది. దాని నైపుణ్యం, సేవలు అందించడంలో వినూత్న విధానాలు, మెరుగైన పర్యావరణం కోసం పటిష్ఠ మద్దతు లాంటివన్నీ కూడా డయాలిసిస్ రోగులు పని, ప్రయాణం చేసేందుకు, వినోదం పొందేందుకు వీలు కల్పిస్తున్నాయి. 

భారతదేశంలో సుమారు 75 లక్షల మంది రోగులు క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ)తో బాధపడుతున్నట్లు ఒక అంచనా. ఏటా 2 లక్షల మంది కొత్త రోగులకు డయాలిసిస్ అవసరమవుతుంది. భారతదేశంలో 30% శా తం కంటే తక్కువ మంది రోగులు మాత్రమే డయాలిసిస్ పొందగలుగుతున్నారు. అంతర్జాతీయ స్థాయి స దుపాయాలతో, అనుభవం కలిగిన వృత్తినిపుణులతో కూడిన ఈ భాగస్వామ్యం ఈ ప్రాంతాల్లో డయాలిసిస్ ను అందరికీ చేరువలోకి, అందుబాటులోకి తీసుకువస్తుంది.

ఈ సందర్భంగా నెఫ్రోప్లస్ వ్యవస్థాపకులు, సీఈఓ విక్రమ్ ఉప్పుల మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో బాగా పే రొందిన హాస్పిటల్స్ చెయిన్స్ లో ఒకటైన కేర్ హాస్పిటల్స్ తో వ్యూహాత్మక డయాలిసిస్ భాగస్వామి కావ డం మాకెంతో ఆనందదాయకం. మా నెట్ వర్క్ ను  విస్తరిస్తున్నందుకు మేమెంతో ఆనందిస్తున్నాం. నెఫ్రో 

ప్లస్ పై కనబర్చిన విశ్వాసానికి గాను కేర్ హాస్పిటల్స్ కు మా ధన్యవాదాలు. మా ప్రొటొకాల్ ఆధారిత కా ర్యకలాపాలు, రోగి కేంద్రిత విధానాలతో డయాలిసిస్ ను దేశవ్యాప్తం గా పునర్ నిర్వచించడంలో మాకు కట్టుబాటును ఈ భాగస్వామ్యం మరింతగా చాటిచెబుతుంది’’ అని అన్నారు.

కేర్ హాస్పిటల్స్ గ్రూప్ చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ నిఖిల్ మాథుర్ ఈ అనుబంధాన్ని గురించి వివ రిస్తూ ‘‘నాగ్ పూర్, రాయ్ పూర్ లలో కేర్ హాస్పిటల్స్ లో మా డయాలిసిస్ ప్రోగ్రామ్స్ కు గాను ఒక వ్యూ హాత్మక భాగస్వామిగా నెఫ్రో ప్లస్ తో ఈ అనుబంధం మాకెంతో ఆనందదాయకం. ఈ అనుబంధం ద్వారా మా రోగులకు అంతర్జాతీయ స్థాయి డయాలిసిస్ సంరక్షణను అందించడం, ఫలితాలను గణనీయంగా మె రుగుపర్చడం వీలవుతుంది. నెఫ్రోప్లస్ తో మేం సన్నిహితంగా కలసి పని చేస్తాం. అత్యున్నత ప్రమాణాలతో కూడిన డయాలిసిస్ చికిత్స అందించేలా క్లినికల్ ప్రోగ్రామ్ ఉండేలా చూస్తాం. ఆరోగ్యసంరక్షణ ఉత్కృష్టతను అందించడంలో మాకు గల కట్టుబాటుకు ఇది మరో మచ్చుతునక’’ అని అన్నారు.

 నెఫ్రో ప్లస్ గురించి: 

నెఫ్రోప్లస్ భారతదేశంలో 23 రాష్ట్రాల్లో 150 నగరాల్లో 265 డయాలిసిస్ కేంద్రాలను నిర్వహిస్తోంది. ఇది నాణ్యతపై దృష్టికి మరియు రోగి కేంద్రిత విధానానికి పేరొందింది. కంపెనీ 11 ఏళ్ల క్రితం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా డయాలిసిస్ రోగులు దీర్ఘకాలం సంతోషంతో మరియు ఉత్పాదకతతో జీవించేలా చేయలనేది సంస్థ ఆశయం. కంపెనీ ప్రతి నెలకు 18 వేలకు పైగా రోగులకు చికిత్స చేస్తోంది. ఇప్పటి వరకూ 52 లక్షలకు పైగా చికిత్సలు చేసింది. 

 For further information: https://www.nephroplus.com/ 

కేర్ హాస్పిటల్స్ గురించి:

కేర్ హాస్పిటల్స్ అనేది మల్టీ స్పెషాలిటీ హెల్త్ కేర్ ప్రొవైడర్. భారతదేశంలో ఐదు రాష్ట్రాల్లో ఆరు నగరాల్లో 11 హాస్పిటల్స్ తో ఇది తన సేవలను అందిస్తోంది. దక్షిణ, మధ్య భారతదేశంలో ఇది ప్రాంతీయ అగ్రగామిగా ఉంది. దేశవ్యాప్తంగా నాలుగు ప్రముఖ హాస్పిటల్ చెయిన్స్ లో ఒకటిగా గుర్తింపు పొందింది. కేర్ హాస్పిటల్స్ 30కిపైగా క్లినికల్ స్పెషాలిటీస్ లలో సమగ్ర రక్షణను అందిస్తోంది. ప్రస్తుతం కేర్ హాస్పిటల్స్ ఆసియా, ఆఫ్రికాలలో తన ఆరోగ్యసంరక్షణ సేవలను విస్తరించిన ఎవర్ కేర్ గ్రూప్ లో భాగంగా ఉంది. 

For details, log on to www.carehospitals.com

Banner
, ,
Similar Posts
Latest Posts from Vartalu.com