Banner
banner
మూసి నది, టాంక్ బండ్  గురించి తెలియని తెలుగు వాళ్లు ఉండరు.  హైదరాబాద్ ఈ రోజున ఇంతలా అభివృద్ది చెందటానికి గల కారణం కూడా మూసి నదే అని చెప్తారు. ఆనాడు మూసి నది మన ప్రాంతంలో ఉంద కాబట్టే..నిజాం ప్రభుత్వం హైదరాబాద్ లో స్దిరపడింది..లేదంటే హైదరాబాద్ ఓ పల్లెటూరు గా ఇప్పటికి మిగిలేది. నిజాం నవాబులు  పాలనలోనే హైదరాబాద్ డవలప్ అయ్యింది. ఆ డవలప్ మెంట్ ని కొనసాగింపుగా ఆ తర్వాత ఎన్నో మార్పులు జరిగాయి. మూసీ నదే లేకపోతే ..ఈ రోజు మనం చూస్తున్న అసెంబ్లీ, ఛార్మినార్, సాలర్ జింగ్ మ్యూజియం, ట్యాంక్ బండ్..హైటెక్ సిటీ ఇవేమీ వచ్చి ఉండేవి కాదు. 
అంత గొప్ప ఘనత గల  మూసీ నది కృష్ణా నది యొక్క ఉపనది. తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాదు నగరం మధ్యనుండి ప్రవహిస్తూ  పాత నగరాన్ని, కొత్త ప్రాంతం నుండి వేరుచేస్తూ ఉంటుంది. పూర్వము ఈ నదిని ముచుకుందా నది అని పిలిచేవారు. హైదరాబాదు యొక్క త్రాగునీటి అవసరాలను తీర్చటానికి మూసీ యొక్క ఉపనదిపై హుస్సేన్ సాగర్ సరస్సు నిర్మించారు. మరి ఈ నదికి మూసి నది అని పేరు ఎలా వచ్చిందనేది ఆసక్తికరమైన కథే. 
విష్ణు  పురాణం ప్రకారం….ముచుకున్దుడు అనే రాజర్షి రాక్షసులతో యుద్దాలు చేసి గెలిచి తన అలసట తీర్చుకోడానికి భూలోకం లో ఏదైనా మంచి ప్రదేశాన్ని చూపించమని స్వర్గాలోకదిపతి ఆయన ఇంద్రుణ్ణి కోరాడని కథనం.తన నిద్ర భంగం చేసిన వారిని తన తీక్షణమైన చూపులతో బస్మమైపొవునట్లు వరం ఇవ్వమని కోరారు. అప్పుడు దేవేంద్రుని సూచనా మేరకు ముచుకుందుడు అనంతగిరి క్షేత్రం వచ్చి ఒక గుహ లో నిద్రపోయినట్లు కథనం .
  ద్వాపరయుగం లో కాలయవనుడు అనే రాక్షసుడు ద్వారకనగారాన్ని ముట్టడించి యాదవ సైన్యాన్ని  నాశనం చేశాను. శ్రీ కృష్ణ బలరాములు ఇద్దరు కాలయవనుడికి భయపడినట్లు నటిస్తూ ముచుకున్దుడు సేదతీర్తున్న అనంతగిరి క్షేత్రానికి వచ్చేలా పరుగు తీసారు. కృష్ణ భగవానుడు తన పైన వున్నా వస్త్రాలు తీసి నిద్రిస్తున్న ముచుకున్దిని పైన కప్పటం జరిగింది.
కాలయవనుడు నిద్రిస్తున్న ముచుకున్డున్ని చూసి శ్రీ కృష్ణుడు అనుకోని నిద్ర భంగం చేస్తాడు దానికి ఆగ్రహించిన ముచుకున్దుడు కలయవనుని బస్మం చేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణ బలరాములు ఇద్దరు ప్రత్యక్షం కాగ ముచుకుంన్ధుడు చాల సంతోషించి వారి పాదాలు కడిగి జీవితం ధన్యం చేసుకున్నాడు అని విష్ణు పురాణం చెబుతుంది . 
ఆ తర్వాత ఆ ప్రాంతమే..అనంత పద్మనాభ దేవాలయంగా పేరు పడింది. హైదరాబాద్ కి సుమారు 85 కి మీ దూరంలో వికారాబాద్ పట్టణానికి 6 కి మీ దూరం లో  దట్టమైన కొండలు,అడవుల మద్య అనంతగిరి గుట్టపైన వెలిసిన అద్బుత వైష్ణవ క్షేత్రం  అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయం. 600 సంవత్సరాల క్రితం నవాబుల ఈ గుడి కట్టించారని చారత్రిక ఆదారాలు చెప్తున్నాయి.
శ్రీ కృష్ణని పాదాలు కడిగిన జలమే జీవనది అయినది అని అదే కలియుగం లో ముచుకుందా నది కాలక్రమేణా ..మూసినది గా ప్రసిద్ది చెందినది.  ఇక ముచుకున్దుడు అనే ఈ రాజు మరెవరో కాదు..ముదిరాజులు అని చెప్తారు. ఆయన మందాత కోలి మహారాజు మొదటి కుమారుడు.ReplyForward
Banner
Similar Posts

ప్రతిష్ఠాత్మక మెక్‌డొనాల్డ్స్ హ్యాపీ మీల్ TM ఇప్పుడు లభిస్తుంది సరికొత్త ఆరోగ్యకరమైన రుచిలో, ITC యొక్క బీ నాచురల్ మిక్స్‌డ్‌ ఫ్రూట్ (జోడించిన చక్కెర లేదు) మరియు వేడిగా, తాజాగా ఉండే కార్న్ కప్‌తోపాటు

Latest Posts from Vartalu.com