banner
Banner

ఎన్నో సినిమాలు తమ ప్రమోషన్ లో భాగంగా పోస్టర్స్, ట్రైలర్స్ రిలీజ్ చేస్తూంటాయి. కానీ కొన్ని మాత్రమే జనాలకు గుర్తుండిపోతాయి. ముఖ్యంగా టైటిల్, పోస్టర్ డిజైన్ కు ఎంచుకున్న కాన్సెప్టు చూసినవారికు ఒక్క సెకెన్ ఆగి..ఎవరిదీ సినిమా అని ఆలోచించేలా ఉండాలి. అలా లేటెస్ట్ గా “మధురపూడి గ్రామం అనే నేను”  ఫస్ట్ లుక్ అనిపిస్తుంది. మహేష్ బాబు భరత్ అనే నేను ను గుర్తు చేసినా, ఓ గ్రామం అనే నేను అని చదవగానే ఆగిపోతాం. మరోసారి చదువుతాం. అక్కడే ఈ టైటిల్, ఫస్ట్ లుక్ సక్సెస్ అయ్యింది.

శివ కంఠమనేని హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “మధురపూడి గ్రామం అనే నేను”. కళ్యాణ్ రామ్ “కత్తి” దర్శకుడు మల్లి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జి రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు నిర్మాతలు. 
 “మధురపూడి గ్రామం అనే నేను” సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ దర్శకుడు హరీష్ శంకర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హరీశ్ శంకర్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉందని, హీరో శివ కంఠమనేని, చిత్ర బృందానికి బెస్ట్ విషెష్ తెలిపారు.

ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ చూస్తే హీరో…. విలన్ తల నరికి చేతిలో పట్టుకుని మరో చేత్తో ఒక మహిళను ఎత్తుకున్నారని, ఆమెను కాపాడేందుకే హీరో హత్య చేశాడా, మధురపూడి గ్రామం అనే నేను కథేంటి తెరపై చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయని అన్నారు.

ఈ చిత్రానికి సహ నిర్మాతలు – కె శ్రీధర్ రెడ్డి, ఎం జగ్గరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – కె శ్రీనివాసరావు, వై అనిల్ కుమార్, సంగీతం – మణిశర్మ, సినిమాటోగ్రఫీ – సురేష్ భార్గవ్, ఎడిటర్ – గౌతమ్ రాజు, ఫైట్స్ – రామకృష్ణ, మాటలు – ఉదయ్ కిరణ్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ నరేన్ జి సూర్య, కో డైరెక్టర్ : ఆర్. ఎస్. సురేష్, సమర్పణ – జి రాంబాబు యాదవ్, బ్యానర్ – లైట్ హౌస్ సినీ మ్యాజిక్, నిర్మాతలు – కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు, రచన – దర్శకత్వం – మల్లి

Banner
, , ,
Similar Posts
Latest Posts from Vartalu.com
Banner