ఇండస్ట్రీకి కొత్త నీరు వస్తోంది. కొత్త ఆలోచనలతో దర్శకులు, నిర్మాతలు వస్తున్నారు. తమదైన విజన్ తో పాటు ప్రేక్షకులకు ఏమి కావాలో చూసుకుంటున్నారు. గత కొద్ది కాలంగా రొమాన్స్, క్రైమ్ ఎలిమెంట్స్ తో వచ్చే చిన్న చిత్రాలకు ఆదరణ ఉంటోంది. ఈ విషయం గమనించిన ఓ కొత్త నిర్మాత ఇంద్రకంటి మురళీధర్ …లాకెట్ టైటిల్ తో ఓ సినిమా రూపొందించారు. ఆ చిత్రం టీజర్ ని విడుదల చేసారు. ఈ టీజర్ లో సినిమా ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసారు. చిన్న క్రైమ్, రొమాన్స్ ఉందని అర్దమవుతోంది. యూత్ కు నచ్చేలా షాట్స్ ఉన్నాయి. మీరూ ఓ లుక్కేయండి ..నచ్చుతుంది.
అనిల్ హీరోగా అఖిల్ విజన్ మూవీస్ పతాకంపై ఈ సినిమాని ఇంద్రకంటి మురళీధర్ నిర్మించారు ‘‘నిర్మాతగా నా తొలి చిత్రమిది. కథ విభిన్నంగా ఉంటుంది. నవంబర్ 19న చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఫణికుమార్ అద్దేపల్లి దర్శకుడు.