ప్రముఖ గాయకుడు మరియు స్వర కర్త శ్రీ బప్పి లాహిరి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘శ్రీ బప్పి లాహిరి గారి సంగీతం అందరి ని మైమరపింపచేయడమే కాకుండా విభిన్న భావనల ను సుందరం గా వ్యక్తం చేసింది కూడాను. ప్రతి తరం వారు ఆయన కూర్చిన పాటల తో ముడిపడిపోయే వారు. ఆప్యాయత ఉట్టిపడేటటువంటి ఆయన స్వభావం ప్రతి ఒక్కరి కి గుర్తు కు వస్తూంది. ఆయన మరణించడం తో నేను దు:ఖిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యుల కు, ఆయన ను అభిమానించే వారికి ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.