Banner
banner

కరోనా రెండో దశ ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉంది. దీని కారణంగా చాలా మంది  ప్రజలు తమ ఆదాయ వనరులు కోల్పోవాల్సి వచ్చింది. సమాజంలోని పేద, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులతోపాటు కర్మాగారాల్లో పని చేసే కార్మికులు, ముంబయిలోని డబ్బావాలాలతో సహా మరెందరో తీవ్రంగా నష్టపోయారు. వారి కుటుంబాలు సైతం ఎన్నో కష్టాలు పడుతున్నాయి.  అలాంటి వారికి అర్ధవంతమైన సహాయం అందించే క్రమంలో భాగంగా మరో గట్టి ప్రయత్నం చేయాల్సిన తరుణం వచ్చింది.  ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి అండగా నిలవడంతోపాటు దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్న వర్గాలకు అవసరమైన వస్తువులు/ సరుకులు అందజేయడం ద్వారా వారికి తోడ్పాటు ఇచ్చేందుకు ITC లిమిటెడ్ మరియు అక్షయ పాత్ర కట్టుబడి/కృతనిశ్చయంతో ఉన్నాయి.  ఇందుకోసం అక్షయ పాత్ర భాగస్వామ్యం/ సంయుక్త సహకారంతోరూపొందించిన ఐటీసీ లిమిటెడ్ పేరిట ప్రారంభించిన ప్రత్యేక కార్యక్రమమే ITC  కేర్ బాస్కెట్. ఒక కుటుంబం నెల రోజులపాటు జీవనం సాగించడానికి సహాయపడే విధంగా ఎంపిక చేసిన నిత్యావసర వస్తువులతో కూడిన బుట్ట ITC  కేర్ బాస్కెట్. ఈ సహాయ కార్యక్రమాన్ని మరింత విస్తరించడానికి వీలుగా బాధ్యతగల పౌరులు తోడ్పాటు అందించాలని ఈ సంస్థలు కోరుతున్నాయి. సుదీర్ఘకాలం పాటు కొనసాగుతున్న మహమ్మారితో ప్రభావితమైన వారిని ఆదుకునేందుకు ముందుకు రావాలని, వారి వంతు సహాయం అందించాలని కోరుతున్నాయి.

ITC కేర్ బాస్కెట్ అనేది ITC యొక్క విస్తృత శ్రేణిలోని ఎఫ్‌ఎంసీజీ ప్రొడక్టుల కలయికతో రూపొందించినది. వీటిలో మేలైన, అత్యంత అవసరమైన మైక్రోన్యూట్రియంట్లు, ఫైబర్ అధికంగా ఉత్పత్తులు, శానిటైజర్లు మరియు మాస్కులు వంటివన్నీ ఉంటాయి. కొవిడ్ ప్రభావానికి గురయిన వారందరికీ సహాయం అందించేందుకు విరామం లేకుండా వంట చేస్తున్న హోం చెఫ్‌లకు సైతం కేర్ బాస్కెట్స్  విస్తరించబడ్డాయి. ఈ సహాయ కార్యక్రమం ముంబయి, పూనే, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై మరియు హైదరాబాద్ వ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతోంది. వినియోగదారులు https://www.akshayapatra.org/itc-basket1 లేక https://www.akshayapatra.org/itc-basket2 వెబ్‌సైట్లను సందర్శించి ఓ కుటుంబానికి ఒకనెలకు సరిపడా ఆహారం & నిత్యావసర వస్తువులను విరాళంగా అందజేయవచ్చు. సమాజానికి తోడ్పడటానికి ఒక మార్గం కోసం చూస్తున్న 10 మిలియన్ల మందికి పైగా డిజిటల్ అనుసంధాన పౌరులను చేరుకోవడానికి ఈ బృందం తన ప్రయాణాన్ని ప్రారంభించింది.

ఈ సహాయ కార్యక్రమాన్ని ఉద్దేశించి, ఒక ఐటీసీ ప్రతినిధి మాట్లాడుతూ, “ప్రస్తుతం కరోనా మహమ్మారితో యావత్ దేశం పోరాటం కొనసాగిస్తోంది. ఎంతోమంది కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నారు. వారిలోనూ కనీసం రోజువారీ ఆహారం సంపాదించుకోవడానికి సైతం అవసరమైన కనీస వసతులు లేక అలమటిస్తున్న వారు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. ఇలాంటి సమయంలో అలాంటి వారికి వారు అదనపు మద్దతు మరియ తోడ్పాటు అవసరం. వారు కాళ్లపై తాము నిలబడాలంటే ఎంతో కొంత సహాయం తప్పనిసరి. ఈ సమయంలో చైతన్యవంతులైన పౌరులు స్పందించి చేసిన సహాయ కార్యక్రమాలు హృదయపూర్వకమైనవి.  ITC లిమిటెడ్, ఈ సహాయ గుణాన్ని మరింత ప్రోత్సహిస్తోంది. తద్వారా ప్రస్తుత విపత్కర పరిస్థితుల కారణంగా ప్రభావితమైన వారికి సహాయం అందించడానికి వీలుగా మరిన్ని మార్గాలను సృష్టించడానికి మరియు ఉన్నవాటిని విస్తరించడానికి అవకాశం లభిస్తుంది. తోటివారికి సాయపడాలనే ఆలోచనకు కొంత తోడ్పాటు దొరుకుతుంది’’ అని పేర్కొన్నారు.

ITC Foods గురించి: ITC లిమిటెడ్ యొక్క విభాగం

భారత దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆహార ఆధారిత వ్యాపారం, మూడో అతి పెద్ద ఫుడ్-బేస్డ్ కంపెనీగా ITC Foods బిజినెస్ గుర్తింపు పొందింది. ఆశీర్వాద్, సన్‌ఫీస్ట్, బింగో!, యప్పీ!, కిచెన్స్ ఆఫ్ ఇండియా, బి నేచురల్, మింట్-ఓ, కేండీమేన్, ఫాబెల్, సన్‌బీన్, మరియు గమ్ఆన్ వంటి ప్రముఖ బ్రాండ్లతో వినియోగ మార్కెట్లో తన పట్టును కంపెనీ నిలబెట్టుకుంటోంది. ఈ రోజుల్లో ఫుడ్స్ వ్యాపారాలను మార్కెట్లో పలు విభాగాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. స్టేపుల్స్, స్పైసెస్, రెడీ-టు-ఈట్, స్నాక్ ఫుడ్స్, బేకరీ & కన్‌ఫెక్షనరీలతో పాటు తాజాగా పరిచయం చేసిన జ్యూస్ & బెవరేజ్‌ల విభాగాలు ఇందులో ఉన్నాయి.

ITCకి చెందిన అంతర్గత ఆర్&డీ సామర్ధ్యంతో అభివృద్ధి చేసిన వైవిధ్యత గల, విలువ ఆధారిత ఉత్పత్తులు కోట్ల కొద్దీ కుటుంబాలకు, ITC Foods బ్రాండ్స్ సేవలు అందిస్తున్నాయి. వినియోగ అవసరాలను లోతుగా అర్ధంగా చేసుకోవడం, భారతీయ వినియోగదారుల రుచి-అభిరుచిలను అర్ధం చేసుకోవడం, వ్యవసాయ-మూలాల నుంచి సేకరించడం, శక్తివంతమైన ప్యాకేజింగ్ మరియు అసమానమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్‌ఇందుకు సహకరిస్తున్నాయి.

అత్యధిక నాణ్యత, భద్రత, పరిశుభ్ర ప్రమాణాలను తయారీ విధానం మరియు సరఫరా చెయిన్‌లలో నిర్వహించడంలో, ఎటువంటి పరిస్థితులలోను రాజీ పడబోమనే నిబద్ధతను ITC సంస్థ కలిగి ఉంది. ITC సొంత తయారీ యూనిట్లు అన్నీ ప్రమాద విశ్లేషణ మరియు సంక్లిష్ట నియంత్రణ కేంద్రం (HACCP) ద్వారా ధృవీకరణను పొందాయి. అన్ని తయారీ యూనిట్స్‌లోను నాణ్యతా ప్రమాణాల కొనసాగింపును, నిరంతరం ఆన్‌లైన్ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుంది. ప్రాసెస్ కంట్రోల్‌కు అదనంగా, ఆహార ఉత్పత్తుల తయారీకి అవసరమైన మూల పదార్ధాల ఎంపికలోనే, అత్యంత సూక్ష్మత కలిగిన నాణ్యత ప్రమాణాలను కఠినంగా పాటిస్తామని ITC ధృవీకరిస్తుంది.

తయారీ రంగం, డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ వంటి అన్ని వ్యాపారాలలోను పెట్టుబడులను, ఈ విభాగం కొనసాగిస్తుంది. తద్వారా దేశంలో బ్రాండెడ్ ప్యాకేజ్‌డ్ ఫుడ్స్ వ్యాపారంలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా ఎదగాలనే లక్ష్యాన్ని అందుకోవడంతో పాటు, ఈ మార్కెట్‌లో ఉన్న మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఉత్తర అమెరికా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ మరియు ఆస్ట్రేలియా వంటి కీలక భౌగోళిక ప్రాంతాలకు, ITC Foods విభాగం తమ ఉత్పత్తులను ఎగుమతులు కూడా చేస్తోంది.

Banner
,
Similar Posts

ప్రతిష్ఠాత్మక మెక్‌డొనాల్డ్స్ హ్యాపీ మీల్ TM ఇప్పుడు లభిస్తుంది సరికొత్త ఆరోగ్యకరమైన రుచిలో, ITC యొక్క బీ నాచురల్ మిక్స్‌డ్‌ ఫ్రూట్ (జోడించిన చక్కెర లేదు) మరియు వేడిగా, తాజాగా ఉండే కార్న్ కప్‌తోపాటు

Latest Posts from Vartalu.com