Banner
banner

దేశంలో ఎందరో వ్యక్తులపై సానుకూల ప్రభావం చూపించడంతోపాటు వారి జీవితాలు సుసంపన్నం చేసేలా & వారి జీవనం మరింత మెరుగ్గా ఉండేలా వారివారి రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖ వ్యక్తులు వీరు.

దేశంలో లగ్జరీ చాక్లెట్స్‌కు మార్గదర్శిగా నిలిచిన ITC లిమిటెడ్ యొక్క ఫాబెల్లె ఎక్స్‌క్విసైట్ చాక్లెట్స్ ఈరోజున ప్రకటించింది ఒక అపూర్వమైన ఆవిష్కరణ అయిన హార్ట్ ఆఫ్ గోల్డ్ కలెక్షన్‌. తినడానికి వీలయ్యే 24 క్యారెట్ల బంగారంతో రూపొందించిన హార్ట్ ఆఫ్ గోల్డ్ కలెక్షన్‌. ఇది ఇంతకు ముందెన్నడూ చూడనిది. ఓ వర్చువల్ ఈవెంట్‌లో అత్యంత విశిష్టమైన ఈ చాక్లెట్‌ను ఫాబెల్లె పరిచయం చేసింది. దీపావళి పండగ రానున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ బ్రాండ్ సర్వోత్కృష్టమైన రీతిలో బంగారం పూతతో తయారు చేసిన ఈ చాక్లెట్స్ ను ఆవిష్కరించింది. ఫాబెల్లె మాస్టర్ చాక్లెటైర్స్ మరియు మిష్లిన్ స్టార్ ఛెఫ్ మార్కో స్టెబైల్ దీనికి సహ రూపకర్తలుగా వ్యవహరించారు. ఛెఫ్ స్టెబైల్ ఒక ప్రఖ్యాత ఇటాలియన్ పాకశాస్త్ర నిపుణులు. స్వర్ణమయమైన వంటలు సిద్ధం చేయడంలో ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఛెఫ్ స్టెబైల్ ప్రపంచవ్యాప్తంగా తిరిగి అభ్యసించి, అనుభవం సంపాదించి, అభిరుచులు జోడించి వంటల తయారీలో సాధించిన నేర్పరితనానికి, ఫాబెల్లె మాస్టర్ చాక్లెటైర్స్ బ్రాండ్ సమర్థత మరియు నైపుణ్యాల సంగమం తోడవడం ఫాబెల్లె హార్ట్ ఆఫ్ గోల్డ్ కలెక్షన్ రూపకల్పనకు దారి తీసింది.

దేశాన్ని ముందుకు నడిపించే విధంగా, సమాజానికి ఎంతోమందికి మేలు జరిగేలా కొందరు ప్రముఖ వ్యక్తులు మరియు సంస్థలు చేసిన సేవలు ఎంతగానో ప్రశంసనీయమైనవి. దేశానికి, సమాజానికి విశిష్ట సేవలను అందించిన అటువంటి గొప్పతనాన్ని గుర్తిస్తూ, వారు సాధించిన అసామాన్య విజయాలను గౌరవించే దిశగా మేం చేసిన ఒక ప్రయత్నమే ఈ మా ఫాబెల్లె హార్ట్ ఆఫ్ గోల్డ్ కలెక్షన్. ప్రఖ్యాత వ్యక్తులైన డాక్టర్ దేవి శెట్టి, ఛైర్మన్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారాయణ హెల్త్, శ్రీ ఆమ్ల రుయా, ఫౌండర్, ఆకార్ ఛారిటబుల్ ట్రస్ట్ మరియు శ్రీ కృష్ణా నాగర్, 2020 వేసవి పారాలింపిక్స్ స్వర్ణపతక విజేతలకు ఫాబెల్లె హార్ట్ ఆఫ్ గోల్డ్ టైటిల్‌ ప్రదానం చేయడం ద్వారా వారు సాధించిన ఆదర్శప్రాయమైన విజయాలను మరియు సేవలను గౌరవిస్తున్నాం. సమాజంపై వారు చూపించిన ప్రభావానికి గుర్తింపుగా లోపల ఒక లిమిటెడ్ ఎడిషన్ మహోగని ఉడెన్ కేస్‌తో గల హార్ట్ ఆఫ్ గోల్డ్ కలెక్షన్ రేంజ్‌ను ప్రత్యేకంగా రూపకల్పన చేసి అందజేయడం ద్వారా వారిని సత్కరిస్తున్నాం.

డాక్టర్ దేవి శెట్టి కర్ణాటకరాష్ట్రం కొవిడ్ టాస్క్ ఫోర్స్ కు నాయకత్వం వహించారు. వైద్యరంగంలోతనకున్న అపారమైన పరిజ్ఞానాన్ని ఉపయోగించి అత్యుత్తమ సేవలు అందించడం ద్వారా దేశంలోనే ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఆయన సమర్థ నాయకత్వంలో ఆ రాష్ట్రంలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ దృఢంగా తయారైంది. కొవిడ్ మహమ్మారితో రాష్ట్రం పోరాడేవిధంగా సుశిక్షత వ్యవస్థ ఏర్పాటైంది. ఇక ఆకార్ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ ఆమ్లా రుయా తనకృషితో రాజస్థాన్ రాష్ట్రంలోని సుమారు 500 గ్రామాల వరకు మంచినీటి కష్టాలు అన్నది లేకుండా చేశారు. సంప్రదాయ జలసంరక్షణ విధానాలు మరియు చెక్ డ్యాంలు నిర్మించడం ద్వారా 2 లక్షలకు పైగా గ్రామీణ ప్రజలు మరియు వారి కుటుంబాల్లో ఓ గొప్ప మార్పును తీసుకురాగలిగారు. శ్రీ కృష్ణా నాగర్ 22 సంవత్సరాల వయసు కలిగిన షటిల్ క్రీడాకారుడు. ఈయన 2020 వేసవి పారాలింపిక్స్ లో స్వర్ణపతకాన్ని గెలుచుకున్నారు. తన విజయం ద్వారా దేశాన్ని గర్వించేలా చేయడమే కాదు, లక్షలాది మంది ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారు. జీవితంలో ఎదురైన సవాళ్లను అధిగమించి, కష్టాలను దాటుకుని విజయాన్ని సాధించాలనుకునే వారికి మార్గదర్శిగా నిలిచారు. ఆటపట్ల ఆయనకు ఉన్న అమితమైన ఆసక్తి దివ్యాంగుల క్రీడలు మరియు సంప్రదాయ క్రీడా పద్ధతులకు ఉన్న అడ్డంకులు అన్నింటినీ దాటుకుని ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేలా చేసింది. ఆయన విజయం దేశానికే గర్వకారణమైంది.

పై అందరి వ్యక్తిత్వాల్లోని గొప్పతనాన్ని ప్రతిబింబించే విధంగా హార్ట్ ఆఫ్ గోల్డ్ కలెక్షన్ రూపకల్పన చేయబడింది. వారి వ్యక్తిత్వంలో విశిష్ట లక్షణాలైన శౌర్యం, విజ్ఞానం, సున్నితత్వం, స్వచ్ఛత మరియు పట్టుదల వంటి సుగుణాలు సమున్నతంగా ప్రతిబింబించే విధంగా తయారైంది. ఈ సుగుణాలు అన్ని సమ్మిళితం చేసినప్పుడు వారికి బంగారం లాంటి హృదయం ఉందనే విషయం తేటతెల్లం చేస్తుంది. దానిని ప్రతిబింబించేలా తినడానికి వీలయేలా 24 క్యారెట్ల బంగారంతో ఈ చాక్లెట్ ఉండలు తయారు చేశారు. ఈ ఉండల్లోని రూబీ మౌసీ పలుకులు తినడానికి తినడానికి వీలయిన 24 క్యారెట్ల బంగారం పూతతో ఉంటాయి. ఇవి అరుణ వర్ణంలో ఉంటాయి. ఈ వర్ణం శౌర్యానికి ప్రతీక. ఈ మిశ్రమంలో ఉండే ఆల్మండ్ విజ్ఞానానికి ప్రతీక. నల్లటి గింజలతో ఉండే దీని రూపం మేధోవికాసాన్ని ప్రతిబింబిస్తుంది. తినడానికి వీలయేవిధంగా తయారుచేసిన 24 క్యారెట్ల బంగారం పూత దీని రుచిని మరింత సుసంపన్నం చేస్తుంది. ఇక ఈ మిశ్రమంలో సున్నితత్వాన్ని ప్రతిబింబించేది సుతిమెత్తని  మిల్క్ చాకో మౌసీ. ఆల్ఫాన్సో మామిడి గుజ్జు మరియు తినడానికి వీలయిన 24 క్యారెట్ల బంగారం పలుకులు ఈ రుచిని మరింత రసభరితం చేస్తాయి. అన్ని సందర్భాల్లోనూ స్వచ్ఛతకు ప్రతీక శ్వేతవర్ణమే. తినడానికి వీలయిన 24 క్యారెట్ బంగారంతో కూడిన నిమ్మ శ్వేతవర్ణాన్ని ప్రతిబింబిస్తుంది. చివరిగా, ఇందులో ఉండే హాజిల్‌నట్-ఆల్మండ్ మిశ్రమంతో ఉండే పసుపు వర్ణంలో ఉండే పాకం పట్టుదలకు ప్రతీకగా నిలుస్తుంది. 24 క్యారెట్ల బంగారం పూతతో ఉండే పలుకులు పట్టుదల సుగుణానికి ఉండే ప్రకాశాన్ని మరింత శోభాయమానం చేస్తాయి.

ఈ సందర్భంగా ITC లిమిటెడ్ చాక్లెట్స్, కన్‌ఫెక్షనరీ, కాఫీ మరియు న్యూ కేటరిగిస్ – ఫుడ్ డివిజన్ – ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ అనూజ్ రస్తోగి మాట్లాడుతూ ‘‘సరికొత్త విప్లవాత్మక రుచులను పరిచయం చేయడానికి ఫాబెల్లె సంవత్సరాలుగా కట్టుబడి ఉంది. భారతీయ చాక్లెట్ శ్రేణిని విస్తృతం చేసే దిశగా ఆ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. భారతీయ చాక్లెట్ ప్రేమికులకు ఇంతకు ముందెన్నడూ పరిచయం లేని రుచులు అందించాలన్న ఆలోచనే మాకు అసమానమైన చాక్లెట్ రూపకల్పనకు అవసరమైన స్ఫూర్తినిస్తోంది. మరొక చాక్లెట్ మాస్టర్ పీస్ తయారు చేసే ఈ ప్రయాణంలో మమ్మల్ని ముందుకు నడిపించి, మాకు మార్గనిర్దేశం చేసిన ఛెఫ్ మార్కో స్టెబైల్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మన దేశ హీరోలను గౌరవించడం మమ్మల్ని ఉప్పొంగిపోయేలా చేస్తోంది. వారు నడిచింది కష్టతరమైన మార్గమే అయినా దేశాన్ని విజయపథం వైపు నడిపించారు. వారివారి రంగాల్లో రాణించేందుకు దృఢ సంకల్పం మరియు అంకితభావంతో వారు చేసిన కృషి దేశానికి గర్వకారణమైంది మరియు ప్రజానీకానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది’’ అంటూ సంతోషం వ్యక్తపరిచారు.

ఫాబెల్లెతో కలిసి హార్ట్ ఆఫ్ గోల్డ్ కు సహ రూపకల్పన చేయడంలో తన అనుభవాన్ని మిష్లిన్ స్టార్ ఛెఫ్ మార్కో స్టెబైల్ పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఫాబెల్లె చాక్లెట్స్ తో కలిసి పనిచేయడం పట్ల నేనెంతో ఆనందంగా ఉన్నా. బంగారం అంటే భారతదేశంలోని వినియోగదారులు ఎంతో సెంటిమెంట్‌గా భావిస్తారు. వారికోసం తినడానికి వీలయేలా బంగారంతో ఒక అద్భుతమైన చాక్లెట్ తయారుచేయడం మర్చిపోలేని అనుభూతి. నేను ఒక కథకుడిని అయితే నేను చెప్పే కథ ఉత్తేజపూర్వకంగా ఉండేలా చేసేదే చాక్లెట్ తయారీలో ఉపయోగించిన తినదగిన బంగారం. వినియోగదారులు మెచ్చేలా పాకశాస్త్రంలో ఓ సరికొత్త అద్భుతమైన రుచిని పరిచయం చేయడం నాకెంతో గర్వంగా ఉంది.’’ అని పేర్కొన్నారు.

ఫాబెల్లె హార్ట్ ఆఫ్ గోల్డ్ కలెక్షన్ బాక్సులు పరిమితంగా మాత్రమే అందుబాటులో ఉంటాయి. అన్ని పన్నులతో కలిపి ధర రూ. 2100. 10 చాక్లెట్ ఉండలతో ఉండే ఒకో బాక్సు దేశవ్యాప్తంగా ఉండే ఫాబెల్లె బొటిక్స్ లో అందుబాటులో ఉంటుంది. తొలుత వచ్చినవారికి తొలిప్రాధాన్యం పద్ధతిన ముందస్తుగానూ బుక్ చేసుకునే  వీలుంది. ప్రఖ్యాత వ్యక్తుల గౌరవార్ధం రూపకల్పన చేసిన విశిష్ట మహోగని ఉడెన్ కేస్‌లు సైతం అందుబాటులో ఉంటాయి. ఇవి అన్ని పన్నులతో కలిపి రూ. 21000 ప్రత్యేక ధరకు లభిస్తాయి. వీటి అమ్మకాల ద్వారా లభించే మొత్తం మేక్-ఎ-విష్ ఫౌండేషన్‌కు విరాళంగా అందజేయబడుతుంది.

Banner
Similar Posts
Latest Posts from Vartalu.com