Banner
banner

INOX యొక్క ప్రస్తుత మెనూకి దివ్యమైన భారతీయ రుచిని జోడించడమే ఈ భాగస్వామ్యం ఉద్దేశం

ITC మాస్టర్ షెఫ్స్ ద్వారా తయారు చేయబడిన ఈ పాక శాస్త్ర వంటకాల జోడింపుతో, INOX యొక్క సినిమా అలాగే హోమ్ ఆర్డర్ చేసే కస్టమర్ల కోసం అందుబాటులోకి మరిన్ని మెనూ ఎంపికలు

భారత్‌లో దిగ్గజ మల్టీప్లెక్స్ చైన్ అయిన INOX Leisure Ltd, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని INOX మల్టీప్లెక్స్‌లలో పునర్నిర్వచించిన వినూత్న ఆహారం మరియు పానీయాల (ఎఫ్&బీ) అనుభూతిని పరిచయం చేయడానికి, ITC Ltd.కు చెందిన రెడీ-టు-ఈట్, గోర్మెట్ బ్రాండ్ కిచెన్స్ ఆఫ్ ఇండియాతో జట్టు కట్టినట్లు నేడు ప్రకటించింది. ఈ అపూర్వమైన భాగస్వామ్యంతో, 100% సహజమైన, భారతీయ పాక శాస్త్ర రుచులకు సంబంధించిన నమ్మకమైన వంటకాల ద్వారా సినిమా హాళ్లలో సరికొత్త అనుభవాన్ని రుచి చూపించాలనేది INOX లక్ష్యం. కస్టమర్లు సినిమా హాళ్లలో, లేదంటే ఫుడ్ ఆర్డర్ చేసే యాప్స్ ద్వారా తమ ఇళ్ల నుంచే ఆర్డర్ చేసినా సరే, వారికి ఈ కొత్తగా జోడించిన మెనూతో సహజమైన ఇంటి తరహా వంటకాల ఎంపికలను INOX అందిస్తుంది.

నేటి నుంచి అమలయ్యే ఈ భాగస్వామ్యం ద్వారా, దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లందరూ అనేక సహజ దేశీయ వంటకాల ఘుమఘుమలను రుచి చూడవచ్చు. వెజిటబుల్ పలావు, హైదరాబాదీ వెజిటబుల్ బిర్యానీ, దాల్ మఖాని, రాజ్మా మసాలా, పిండీ చనా అలాగే స్టీమ్డ్ బాస్మతి రైస్‌తో సహా ప్రామాణికమైన భారతీయ వంటకాల ఘనమైన వారసత్వాన్ని ఇవి మీకు అందిస్తాయి. ఈ వంటకాలను ప్రత్యేకంగా ITCకి చెందిన ప్రావీణ్యం కలిగిన షెఫ్స్ తయారు చేస్తారు. దేశంలోని నలుమూలలకు చెందిన అత్యుత్తమ భారతీయ రుచులను అందించడంలో వారికి గొప్ప నైపుణ్యం ఉంది. అదేవిధంగా, వినియోగదారులకు రుచికరమైన ఇంకా సురక్షితమైన భోజన అనుభూతిని అందించేలా చూసేందుకు, ఈ ఉత్పత్తులన్నీ అత్యంత కఠినమైన నాణ్యతా పరీక్షల్లో సఫలం అయి ఉంటాయని ITC భరోసానిస్తోంది.

INOX Leisure Ltd ఫుడ్ & బెవరేజెస్ వైస్-ప్రెసిడెంట్ దినేష్ హరిహరన్ ఈ భాగస్వామ్యంపై మాట్లాడుతూ, ‘‘ITCతో ఈ భాగస్వామ్యం ద్వారా, దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది INOX కస్టమర్ల కోసం మా ప్రస్తుత రుచికరమైన ఇంకా దేశీయ ఆహార ఉత్పత్తులను మరింత పెంచుకోవడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం. కిచెన్స్ ఆఫ్ ఇండియాకు చెందిన అనేక వంటకాలను జోడించడం ద్వారా, మా కస్టమర్లు తమ ప్రియమైన వారితో కలిసి సినిమా చూస్తున్నప్పుడు, ఘుఘుమలాడే ఇంకా రుచికరమైన భోజన అనుభూతిని అందించడం ద్వారా వారి కోసం మరిన్ని ఎంపికలను మేము విస్తరిస్తున్నాము. దేశవ్యాప్తంగా ఉన్న ప్రామాణికమైన అనేక స్థానిక వంటకాల రుచులను అందుకోవడం ద్వారా మా వినియోగదారులు ఈ భాగస్వామ్యం నుంచి గొప్ప ప్రయోజనాన్ని పొందుతారని మేము ఖచ్చితంగా చెప్పగలము. ఆహారం బయటికి చిందకుండా అలాగే లీక్ కాకుండా ప్రీమియం ప్యాకేజింగ్‌లో అందించడం వల్ల, మా అతిథులు సినిమాను ఆనందిస్తున్నప్పుడు కూడా అత్యుత్తమ రుచికరమైన వంటకాలను హాయిగా ఆస్వాదించగలుగుతారు. మా కస్టమర్లకు సరికొత్త ఇంకా కోరుకున్న ఎంపికలను అందించడం ద్వారా, INOX  యొక్క ఎఫ్&బీ సేవల బ్రాండ్‌ను బలోపేతం చేయడంతో పాటు మా కస్టమర్లతో బంధాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి మేము చేస్తున్న ప్రయత్నాల్లో ఈ భాగస్వామ్యం ఒక కీలకమైన సోపానంగా నిలుస్తుంది’’ అని పేర్కొన్నారు.

ITC Ltd(ఫుడ్స్ డివిజన్) మార్కెటింగ్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్, ITC అధికార ప్రతినిధి సువదీప్ బెనర్జీ ఈ భాగస్వామ్యం గురించి వివరిస్తూ, ‘‘వినూత్నమైన వాటిని అందించడం అలాగే అర్థవంతమైన భాగస్వామ్యాల ద్వారా, వినియోగదారుల ఆహార ఇంకా భోజన అనుభూతులను మరింత మెరుగుపరడంపై ITCలో మేము దృష్టిసారిస్తూనే ఉంటాము. INOXతో ఈ భాగస్వామ్యం ద్వారా, సినిమా ప్రియుల కోసం సినిమా ఇంకా ఆహార అనుభూతిని పునర్నిర్వచించడంలో అలాగే కొంగొత్త అనుభవాన్ని అందించడంలో సహాయపడాలని కిచెన్స్ ఆఫ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. ITC చేస్తున్న ఈ వైవిధ్యభరితమైన ప్రయత్నం, నోరూరించే ఆహారం నుంచి దివ్యమైన భారతీయ రుచుల వరకు అనేక వంటకాలను అందించడం ద్వారా వినియోగదారులను సంతోషపెట్టనుంది. ప్రజలు క్రమంగా ఇంటి బయట సరదాలు, వినోద అనుభవాలు ఇంకా కార్యకలాపాలను తిరిగి మొదలుపెడుతున్న నేపథ్యంలో, వినియోగదారులకు ఆహార భద్రత అలాగే పరిశుభ్రత అనేవి అత్యంత ముఖ్యమైనవి. ఇక నుంచి INOX మెనూలో కిచెన్స్ ఆఫ్ ఇండియా వంటకాలు కొలువుదీరనున్న నేపథ్యంలో, వినియోగదారులు సినిమాను ఆనందిస్తున్నప్పుడు దివ్యమైన భారతీయ రుచులను హాయిగా ఆస్వాదించే ప్రయోజనాలను పొందడమే కాకుండా, వీటన్నింటినీ సురక్షితమైన, పరిశుభ్రమైన, ఇంకా నమ్మకమైన బ్రాండ్‌ ద్వారా అందుకుంటారు. మా భాగస్వామ్యంతో, ITC అలాగే INOX రెండూ కూడా వినియోగదారుల అనుభవాలను అర్థవంతంగా మెరుగుపరచగలవని మేము భావిస్తున్నాము’’ అని తెలిపారు.

Banner
, , ,
Similar Posts
Latest Posts from Vartalu.com