Banner
banner

శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై అభిరామ్ M దర్శకత్వంలో శివ ఆలపాటి మరియు ప్రియాంక శర్మ కీలక పాత్రలలో నటిస్తున్న చిత్రం డై హార్డ్ ఫ్యాన్. ఒక సెలెబ్రిటీకి, అభిమానికి మధ్య జరిగే సస్పెన్స్ కామెడీ డ్రామా ఈ సినిమా కథ. డై హార్డ్ ఫ్యాన్ పాత్రలో శివ ఆలపాటి నటించారు. ఈ ఇద్దరి మధ్య సాగే డ్రామా ఇది. తాజాగా శివ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇంటెన్స్ లుక్ తో ఉన్న ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో షకలక శంకర్  బేబమ్మగా, రాజీవ్ కనకాల కృష్ణ కాంత్ గా కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల విడుదలైన ఈ ఇద్దరి ఫస్ట్ లుక్ కి కూడా విశేష స్పందన రావడంతో చిత్ర బృందం వారి సంతోషాన్ని తెలియజేశారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. సినిమా పూర్తిగా కామెడీ సస్పెన్స్ డ్రామాగా రాబోతుంది.


ఈ సినిమాకు మధు పొన్నాస్ చక్కటి సంగీతం అందించారు.ఈ సినిమాకు సయ్యద్ తాజుద్దీన్ మాటలు అందించారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.

నటీనటులు:
శివ ఆలపాటి, ప్రియాంక శర్మ, షకలక శంకర్, రాజీవ్ కనకాల తదితరులు

టెక్నికల్ టీమ్:
దర్శకుడు: అభిరామ్ M
బ్యానర్: శ్రీహాన్ సినీ క్రియేషన్స్
నిర్మాత: చంద్రప్రియ సుబుద్ధి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్ కింతలి
పిఆర్ఓ : ఏలూరు శ్రీను, మేఘశ్యామ్
మాటలు: సయ్యద్ తాజుద్దీన్
సంగీతం: మధు పొన్నాస్
సినిమాటోగ్రఫీ: జగదీష్ బొమ్మిశెట్టి
ఎడిట్ VFX – తిరు B
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: వెంకటేష్ తిరుమల శెట్టి 

Banner
, , , , ,
Similar Posts
Latest Posts from Vartalu.com