Banner
banner

స్వాతంత్య్ర సముపార్జనకి తన జీవితాన్ని అంకితం చేసి చరిత్రలో నిలిచిపోయిన రాజకీయ, ధార్మిక నాయ కుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ‘సరిహద్దు గాంధీ’గా ప్రఖ్యాతి పొందిన ఖాన్ ఈ తరానికి తెలియాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే ఈయన జీవిత చరిత్రను ఇంగ్లీష్ లో తీసుకుని వస్తున్నారు.  “The Frontier Gandhi: My Life and Struggle” టైటిల్ తో వస్తున్న ఈ పుస్తకం రోలీ బుక్స్ పబ్లిషింగ్ హౌస్ వారు విడుదల చేస్తున్నారు. 1969లో మొదటసారి ఇదే టైటిల్ తో ఆయన ఇంటర్వూలని బేస్ చేసుకుని ఓ  పుస్తకం వచ్చింది. అయితే అది ఆయన జీవిత చరిత్ర విశేషాలను సంపూర్తిగా ఆవిష్కరించలేదు. దాంతో ఆయన స్వయంగా తన జీవిత చరిత్రను తన సహచరులు,సన్నిహితుల సాయంతో రాయటం మొదలెట్టారు. ఆ పుస్తకం పాష్టో భాషలో 1983లో కాబుల్ లో  విడుదలైంది. ఇప్పుడీ పుస్తకం పాకిస్దాన్ కు చెందన రచయిత ఇంతియాజ్ అహ్మద్ ఇంగ్లీష్ లోకి అనువాదం చేసారు. రేటు రూ. 695 పెట్టి ఆన్ లైన్ లోనూ,ఆఫ్ లైన్ లోనూ అమ్ముతున్నారు.ఇక ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ విషయనికి వస్తే…పాకిస్థాన్‌లోని పంఖ్తూన్‌ రాష్ట్రంలో పంఖ్తూన్‌ లేదా పఠాన్‌గా పుట్టి జాతిపిత మహాత్మా గాంధీ నిర్దేశించిన అహింసా మార్గంలో అడుగులు వేసి బ్రిటీష్‌ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన స్వాతంత్య్ర సమరయోధుడు  సరిహద్దు గాంధీ.  జాతిపిత గాంధీజీచే ప్రశంసలు పొందిన ఆయన జీవితం నేటికీ అందరికీ ఆదర్శప్రాయం. బ్రిటీష్ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన ఆయన  పఠాన్‌గా పుట్టి అహింసా మార్గమే ఆయుధంగా మార్చుకొని ‘పఠాన్ యమ డేంజర్’ అని అప్పటి పాలకులతో అనిపించుకున్న ధీరోదాత్తుడు. ‘నేను ఆయుధంతో యుద్ధం చేసే పఠాన్‌ను కాను. ఏ పరిస్థితుల్లోనైనా నాది అహింసామార్గమే. పగ, ప్రతీకారాలు నాకు నచ్చవు. నన్ను అణచివేసి, హింసించిన వారిని కూడా క్షమిస్తాను’ అన్న ప్రతిజ్ఞ చేసారు.

 అలాగే ఆయన్ని గుర్తు చేస్తూ ..మన దేశంలోని డిల్లి లోని కరోల్ బాగ్‌లో గఫర్ మార్కెట్ ఉంది. 2008లో, ది ఫ్రాంటియర్ గాంధీ: బాద్షా ఖాన్, ఎ టార్చ్ ఫర్ పీస్ అనే డాక్యుమెంటరీ ను  న్యూయార్క్‌ లో తీసి, ప్రదర్శించారు. ఈ చిత్రం మిడిల్ ఈస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా 2009 అవార్డును అందుకుంది. 1990 లో బాద్షా ఖాన్ పై  30 నిమిషాల బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ చిత్రం :ఆన్ ది మెజెస్టిక్ మ్యాన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్”  ఇది దూరదర్శన్ (నేషనల్ ఛానల్) లో ప్రసారం చేయబడింది.  అలాగే పెషావర్‌లో, అంతర్జాతీయ విమానాశ్రయానికి బచా ఖాన్ పేరు పెట్టారు. యునైటెడ్ స్టేట్స్లో ప్రచురించబడిన పిల్లల పుస్తకంలో ప్రపంచాన్ని మార్చిన 26 మంది పురుషులలో బచా ఖాన్ ఒకడు. ఆయన  ఆత్మకథ ‘గఫర్‌ ఖాన్‌: నాన్‌ వాయలెంట్‌ బాద్‌షా ఆఫ్‌ పంఖ్తూన్‌’  (1969) ను ఇద్దరు రచయితలు ఏక్నాథ్ ఈశ్వరన్ మరియు రాజ్మోహన్ గాంధీ వ్రాసారు.

Banner
Similar Posts
Latest Posts from Vartalu.com