అచ్చం ఇలాంటి రూపాయి బిళ్ల ఇస్తే రెండున్నర లక్షలు ఇస్తారట. ఇది వినగానే ఏదో వాట్సప్ లో చలామణి అయ్యే ఫేక్ న్యూస్ అనిపిస్తోంది. కానీ కానే కాదు. ఒక రూపాయి నాణెం వేలంపాటలో రూ.2.5 లక్షలకు అమ్ముడైంది. అవును నిజం…ఒక రూపాయి నాణేన్ని వేలం వేస్తే రెండున్నర లక్షలు పలికింది. అలాగే అర్ధ రూపాయి నాణేన్ని వేలం వేస్తే రూ.60వేలు పలికింది. అంతేకాదు నోట్లపై 786 సిరీస్ ఉంటే దాని విలువకు అనేక రెట్ల ధర పలుకుతుంది. ‘ఇండియా కాయిన్ మిల్’ వెబ్సైట్ ఆన్లైన్లో పాత నాణేలు, నోట్లను వేలం వేస్తోంది. అందులో భాగంగా ఇదంతా జరుగుతోంది.
అబ్బా ముందే చెప్పచ్చు కదా.. ఆ ఒక్క రూపాయి బిళ్ల ని ఎక్కడో చోట వెతికితే మాకు కూడా రూ.2.5 లక్షలు వచ్చేదే అనుకుంటున్నారా. అయితే ఇక్కడే ఉంది మెలిక. 1985లో దేశంలోని నాలుగు మింట్లతోపాటు బ్రిటన్‌లోని లాంట్రిసాంట్ అండ్ హీటన్ మింట్‌లో నాణేలను ముద్రించారు. వాటిపై ప్రత్యేకంగా హెచ్ అనే మార్క్‌ను వేశారు. ఏదైనా నాణేన్ని విడుదల చేసేముందు కొన్ని లోహాల మిశ్రమాలతో శాంపిల్‌గా కొన్ని కాయిన్లను ముద్రించి పరీక్షిస్తారు.
ఇక 1985లో విడుదల చేసిన నాణేలన్నీ రాగి, నికెల్ మిశ్రమంతో చేసినవే . కానీ శాంపిల్ కాయిన్లలో కొన్నింటిని పూర్తిగా రాగితో తయారు చేశారు. వాటిని మాత్రం మార్కెట్లోకి విడుదల చేయలేదు. అలాంటి అరుదైన రాగి రూపాయి బిళ్లను వేలం వేస్తే భారీ మొత్తం పలికింది. అలాగే 1957-1963 మధ్య కాలంలో ముద్రించిన ఓ అర్ధ రూపాయి (50 పైసలు) బిళ్ల రూ.60 వేల ధర పలికింది.దీన్ని పూర్తిగా నికెల్‌తో తయారు చేశారు. దేశంలో 50 పైసల నాణేలను 1957లో ప్రవేశపెట్టారు. ఆ మొదటి బ్యాచ్‌కు చెందిన నాణేలకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉందని సంస్థ చెప్తోంది. ఇక, నోట్లపై సిరీస్‌లో చివరన 786 ఉంటే భారీ ధర దక్కించుకోవచ్చని చెప్తున్నారు. అంతేకాదు మీరూ ఓ లుక్కేయాలంటే…ఈ పోర్టల్‌లో సేవలు పూర్తిగా ఉచితం.