Banner
banner

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ యొక్క సిస్టర్ ఆర్గనైజేషన్ అయిన జూబ్లియెంట్ భారతీయ ఫౌండేషన్ ఫర్ సోషల్ ఎంట్రప్రెన్యూయర్ షిప్ తన వార్షిక పోటీ సోషల్ ఎంట్రప్రెన్యుయర్ ఆఫ్ ది ఇ యర్ (ఎస్ ఇఒవై) – ఇండియా అవార్డ్ 2021’ యొక్క 12వ ఎడిషన్ కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 2010 లో భారత దేశంలో సోషల్ ఎంట్రప్రెన్యుయర్ షిప్ అవార్డు ల ద్వారా సోషల్ ఇన్నోవేషన్ కు ప్రాచుర్యం కల్పించేందుకు స్వాబ్ ఫౌండేషన్ ఫర్ సోషల్ ఎంట్రప్రె న్యుయర్ షిప్ మరియు జూబ్లియెంట్ ఫౌండేషన్ చేతులు కలిపాయి.

సోషల్ ఎంట్రప్రెన్యుయర్ ఆఫ్ ది ఇయర్ (ఎస్ఇఒవై) – ఇండి యా అవార్డ్ 2021’ కు దరఖాస్తులు 2021 ఏప్రిల్ 30 వరకు అంగీకరించబడుతాయి. ఆసక్తి గల అభ్యర్థులు jubilantbhartia foundation.com ద్వారా తమ  దరఖాస్తు పత్రాన్ని దాఖలు చే యవచ్చు లేదా పూర్తి చేసిన దరఖాస్తు పత్రాన్ని jbf_seoy@ jubl.com కు మెయిల్ చేయవచ్చు.

సోషల్ ఎంట్రప్రెన్యుయర్ ఆఫ్ ది ఇయర్ (ఎస్ఇఒవై) – ఇండి యా అవార్డ్ 2021’ విజేతను 2021 అక్టోబర్ 7న ప్రకటిస్తారు.

భారతదేశంలో చేకూర్పును నిజం చేసేందుకు గాను అణగారిన వర్గాలు ఎదుర్కొనే సమస్యలకు వినూత్న, సుస్థిరదాయకఆచ రణసాధ్య పరిష్కారాలను అమలు చేసే వ్యక్తులనుసంస్థలను ఈ అవార్డు గుర్తిస్తుంది.  ఆరోగ్యంచదువుఉపాధి, నీళ్లుక్లీన్ ఎనర్జీఐడెంటిటీ & ఎన్ టైటిల్ మెంట్స్, ఆర్థిక అక్షరాస్యతఐటీ కి యాక్సెస్ లాంటి వైవిధ్యభరిత రంగాలలో వారు పని చేసి ఉండాలి.   

 ఇందులో పాల్గొనే వ్యక్తులు మరియు సంస్థలు మార్కెట్ బేస్డ్టెక్నాలజీ ఎనేబుల్డ్సుస్థిరదాయకతడైరెక్ట్ సోషల్ ఇంపాక్ట్రీచ్ స్కోప్ప్రతిరూపత (తిరిగి ఆ నమూనాను వినియోగించగలగడం) కీలక పరామితులపై మదింపు చేయబడుతారు. నిపుణుల సమీక్షలుసైట్ విజిట్స్  తో సహా ముమ్మరమైన అన్వేషణ మరియు ఎంపిక ప్రక్రియల ఆధారంగా ఫైనలిస్టులు ఎంపిక చేయబడుతారు.  ప్రభుత్వంవాణిజ్యంమీడియాపౌర సమాజ ప్రముఖులతో కూడిన జ్యూరీ విజేతను ఎంపిక చేస్తారు.

ఎస్ఈఓవై ఇండియా విజేత తమ సోషల్ ఎంటర్ ప్రైజెస్ ను ఎంగేజ్ చేసుకునేందుకునిర్మించుకునేందుకు, నిర్వహించుకునేందుకు గాను స్వాబ్ ఫౌండేషన్ ఫర్ సోషల్ ఎంట్రప్రెన్యూర్ షిప్ తో అనుబంధం కలిగిన సోషల్ ఎంటర్ ప్రైజెస్ యొక్క ప్రపంచ అతిపెద్ద నెట్ వర్క్ తో చేరుతుంది.

మన సమాజంలోదేశంలో అంతరాలను తొలగించేలా భారతదేశంలో అగ్రగామి సోషల్ ఎంట్రప్రెన్యూయర్స్ మరియు విశిష్ట వెంచర్స్ ను వేడుక చేయడంవాటికి ప్రాచుర్యం కల్పించడం సోషల్ ఎంట్రప్రెన్యూయర్ ఆఫ్ ది ఇయర్ (ఎస్ఈఓవై) ఇండియా అవార్డు లక్ష్యం. గుర్తింపు ను అందించడం ద్వారా భారతదేశంలో ఏటా మరెన్నో ఇతర సోషల్ ఎంట్రప్రెన్యూయర్స్ కు స్ఫూర్తినివ్వాలని (ఎస్ఈఓవై) ఇండియా అవార్డు ఆశిస్తోంది.

స్వాబ్ ఫౌండేషన్ ఫర్ సోషల్ ఎంట్రప్రెన్యూర్ షిఫ్ గురించి: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్  ప్రొఫెసర్ క్లాజ్ స్వాబ్ మరియు ఆయన భార్య హిల్డె దీన్ని నెలకొల్పారు. ఇరవై ఏళ్లుగా స్వాబ్ ఫౌండేషన్ ఫర్ సోషల్ ఎంట్రప్రెన్యూర్ షిప్ మరింత సమానత్వంతో కూడిన మరియు సుస్థిరదాయక ప్రపంచాన్ని నిర్మించడంలో ప్రపంచ అగ్రగామి సోషల్ ఎంట్రప్రెన్యూయర్స్ కు వారి ప్రయత్నాల్లో అండగా నిలిచింది. సుస్థిరదాయక సోషల్ ఇన్నోవేషన్ లకు సంబంధించి వాటికి ప్రాచుర్యం కల్పించేందుకుఅధునాతన అగ్రగామి నమూనాలను అందించేందుకు ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో స్వాబ్ ఫౌండేషన్ తిరుగులేని వేదికలను అందిస్తోంది.

జూబ్లియెంట్ భారతీయ ఫౌండేషన్ గురించి:  ఇది 2007లో ఏర్పాటు చేయబడింది. జూబ్లియెంట్ భారతి గ్రూప్ యొక్క లాభాపేక్షరహిత సంస్థ. గ్రూప్ యొక్క కార్పొరెట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలను ఇది రూపొందించి అమలు చేస్తుంటుంది. జూబ్లియెంట్ భారతీయ ఫౌండేషన్ కార్యక్రమాల్లో వివిధ సామాజిక అభివృద్ధి పనులుఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలుసాంస్కృతికక్రీడా కార్యక్రమాలుపర్యావరణ సంరక్షణ కార్యక్రమాలు, వృత్తిశిక్షణమహిళాసాధికారికతవిద్యాత్మక కార్యక్రమాలుసోషల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ కు ప్రాచుర్యం కల్పించడం లాంటివి ఉన్నాయి. http://www.jubilantbhartiafoundation.com/

Banner
Similar Posts
Latest Posts from Vartalu.com