ఏకమ్ విశ్వశాంతి ఉత్సవం !
ఏకమ్ క్షేత్రం కేంద్రంగా శ్రీ ప్రీతాజి శ్రీ క్రిష్ణజి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుండి 19 వరకు ప్రపంచంలోని అతి పెద్ద పీస్ మెడిటేషన్ ఫెస్టివల్ ఆన్లైన్ లో జరుగనున్నది.
ఏకమ్ వరల్డ్ పీస్ ఫెస్టివల్ 100 దేశాలలో 3 సంవత్సరాలుగా ఒకే లక్ష్యంతో జరుపుకుంటున్నాము .శాంతియుతంగా జీవించడానికి వారి సహజ సిద్దమయిన సామర్థ్యాన్ని మానవాలి కి గుర్తు చేయడమే ఏకం సహవ్యవస్తాపకులైన శ్రీ ప్రీతజీ & శ్రీ కృష్ణాజీల లక్ష్యము గా కొనసాగుతుంది – ఈ peace festival lo ఒక వ్యక్తి తన ఆత్మలోకి లోతుగా ఎలా చేరుకొగలరు , విశ్వ చైతన్యం తో ఎలా కనెక్ట్ అవ్వాలనే దానిపై తమ జ్ఞానాన్ని శ్రీ ప్రీతాజీ శ్రీ krishnaji అందిస్తారు .

ఆదివారం నాడు బంజారాహిల్స్ లోని హోటల్ తాజ్ బంజారా లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రిటైర్డ్ డి జి MV కృష్ణారావు, MLC బొగ్గరపు దయానంద, తెలంగాణ టూరిజం చైర్మన్ శ్రీనివాస్ గుప్తా మరియు ఏకమ్ మిత్రాస్ కలసి ఏకమ్ వరల్డ్ పీస్ ఫెస్టివల్ 2021 కి బ్రోచర్ ని ఆవిష్కరించారు..

ఏకమ్ క్షేత్రా సంస్థ నిర్వహకులు మాట్లాడుతూ ప్రపంచ శాంతి ఉత్సవం మతాలకి అతీతం అయినది. శాంతి తీసుకురావడానికి వ్యక్తుల చైతన్యాన్ని ప్రభావితం చేయడం ఏకామ్ వరల్డ్ పీస్ ఫెస్టివల్ లక్ష్యం – ఇది సంపూర్ణ మానవాలి ని ప్రభావితం చేసే ధ్యానొత్సవం. ఈ సంవత్సరం (2021), 4 వ వార్షిక ఏకమ్ వరల్డ్ పీస్ ఫెస్టివల్ సెప్టెంబర్ 17 నుండి 19 వరకు ‘ఏకమ్’ అనే పవిత్ర స్థలంలో జరుగుతుందని వారు ప్రకటించారు. శ్రీ ప్రీతాజీ మరియు శ్రీ కృష్ణాజీ నిర్వహించే ఈ ఉత్సవం చరిత్రలో అతిపెద్ద ధ్యాన సమావేశాలలో ఒకటిగా నిరూపించబడింది. వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు ఉత్సవంలో పాల్గొని ప్రపంచ శాంతి కోసం ధ్యానం ఆన్లైన్ లో చేయబోతున్నారు.
ప్రతి రోజు కొన్ని వందల వేల మంది వ్యక్తులు కుటుంబాలు, వ్యాపార సంస్థలు , విద్య సంస్థలు రోజు శ్రీ ప్రీతజి శ్రీ కృష్ణ జీ తో కలిసి భాగం వహించబోతున్నారు. ఈ ఉచిత ఆన్లైన్ ఏకం world peace festivallo సమిష్టిగా ధ్యానం చేయడానికి మీకు స్వాగతం. శ్రీ ప్రీతాజీ మరియు శ్రీ కృష్ణాజీ ఉత్సవ సమయంలో ప్రతిరోజూ, 55 నిమిషాలు శాంతి జ్ఞానం మరియు ధ్యానాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

ఈ ఉచిత ఆన్లైన్ 55 నిమిషాల ఈవెంట్ ప్రపంచంలోని ఎక్కడి నుండైనా https://www.youtube.com/pkconsciousness/live లో సమిష్టిగా పాల్గొనడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది
సెప్టెంబర్ 17 న ఆర్థిక అశాంతి తోలగడానికి
September 18 na విభజన తోలగడానికి
September 19 na భూమండలం ఉపశమనం పొంది శాంతి కలగాలని ధ్యానం చేస్తాం.