Banner
banner

భారతదేశ అగ్రగామి స్లీప్ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన డ్యూరోఫ్లెక్స్ యువతకు ప్రతీక అయిన అలియా భట్ ను తమ మొట్టమొదటి ప్రచారకర్తగా ప్రకటించింది. 50 ఏళ్లకు పైగా నైపుణ్యంతో కూడిన ఈ విశ్వసనీయ స్లీప్ సొల్యూషన్ బ్రాండ్ తమ తదుపరి క్యాంపెయిన్ ను ఆమెతో ప్రారంభించనుంది, మరింత మెరుగ్గా నిద్రించేందుకు భారతదేశానికి స్ఫూర్తినందించనుంది.

నటి అలియా తన బహుముఖ ప్రతిభకు, అవార్డులు పొందిన పనితీరుకు, ఉత్కృష్టత సాధించేందుకు గల కట్టు బాటుకు పేరొందారు. నిరంతరం ఆమె హద్దులను అధిగమిస్తూ ముందుకెళ్తూ వచ్చారు. నూతన శిఖరాలను అధిరోహించారు. అదే సమయంలో వృత్తిపరమైన విజయాలను, వ్యక్తిగత ఆరోగ్యాన్ని సమతుల్యం చేసుకుం టూ వచ్చారు. తన ఆరోగ్యదాయక జీవనశైలికి ప్రశాంత నిద్ర కారణమని ఆమె పరిగణిస్తుంటారు. సామాజిక మాధ్యమాల్లో సైతం నిద్ర పట్ల తన ప్రేమను చాటుకుంటూ ఉంటారు. అలియా కు నిద్ర పట్ల గల ఆరాధనా భా వం ఆమెను డ్యూరోఫ్లెక్స్ కు పరిపూర్ణ ప్రచారకర్తగా మార్చింది. 

ఈ సందర్భంగా డ్యూరోఫ్లెక్స్ సీఎంఓ స్మితా మురార్క మాట్లాడుతూ, ‘‘స్లీప్ సొల్యూషన్స్ విభాగంలో అత్యంత నై పుణ్యంగల సంస్థ డ్యూరోఫ్లెక్స్. భారత్ కు మెరుగైన రీతిలో నిద్రపోయేందుకు తోడ్పడాలన్న కార్యాచరణను అది చేపట్టింది. నూతన తరం వినియోగదారులతో మేము ఏకం కాగల విధంగా కలసి పని చేయాలని మేం కోరుకుంటున్నాం. అలియా భట్ తిరుగులేని విధంగా యూత్ ఐకాన్. తనకు తానుగా ఉన్నత స్థాయికి చేరు కున్నారు. ఆరోగ్యదాయక జీవనశైలిలో నిద్ర కీలకపాత్ర పోషిస్తుందని ఆమె అంటున్నారు. నిద్రపై మేం పంచు కున్న కట్టుబాటును ఆమె ద్వారా యావత్ దేశంలో ప్రచారం చేయాలని భావిస్తున్నాం’’ అని అన్నా రు.

ఒత్తిళ్లతో నిండిన నేటి వాతావరణంలో నిద్ర రాజీపడుతోంది. ఈ నేపథ్యంలో మెరుగైన నిద్రను అందించే మ్యాట్రె సెస్ వంటి అవసరమైన ఉత్పాదనలను ఎంచుకోవడంలో భారత్ అప్ గ్రేడ్ కావడాన్ని ప్రోత్సహించాలని డ్యూరో ఫ్లెక్స్ కోరుకుంటోంది. పరిశోధనల ఆధారంగా, సాంకేతికంగా ముందంజలో ఉండే విధంగా మ్యాట్రెసెస్ ను, స్లీప్ యాక్సెసరీస్ ను ఈ బ్రాండ్ అందిస్తోంది. 

డ్యూరోఫ్లెక్స్ నిరంతరం తన సామాజిక మాధ్యమ చానల్స్ @duroflexworld  ద్వారా నిద్ర పై ప్రచారం చేస్తూనే ఉంది. నిద్ర శక్తిని విశ్వసించే వారితో కలసి పనిచేస్తూనే ఉంది. 

డ్యూరోఫ్లెక్స్ తో తన అనుబంధం గురించి అలియా భట్ మాట్లాడుతూ, ‘‘ఒక నటిగా నిర్దిష్ట సమయానికి ముం దుగానే సెట్స్ కు చేరుకోవడం, గంటల తరబడి షూటింగ్ లు మా జీవితంలో భాగమైపోయాయి. చక్కటి నిద్ర నా మహత్తర శక్తి అనే విషయం నేను తెలుసుకున్నాను. అది నా పనితనాన్ని అధికం చేస్తుంది. నా విజయా ల్లో అదెంతో కీలకం. నిద్ర విషయంలో నేనెప్పుడూ రాజీపడను. నిద్ర ప్రాధాన్యం పై అవగాహన పెంచేందుకు, మాట్రెసెస్ లాంటి నిద్రకు అవసరమైన వస్తువుల విషయంలో సరైన అవగాహనతో నిర్ణయాలు తీసుకునేందు కు భారత్ కు తోడ్పడేందుకు డ్యూరోఫ్లెక్స్ లాంటి శక్తివంతమైన బ్రాండ్ తో అనుబంధం నాకెంతో ఆనందాన్ని అందిస్తోంది’’ అని అన్నారు. 

డ్యురోఫ్లెక్స్ గురించి:

డ్యురోఫ్లెక్స్ భారతదేశ అగ్రగామి స్లీప్ సొల్యూషన్స్ ప్రొవైడర్స్ లో ఒకటి. ఇది విస్తృత శ్రేణిలో ప్రీమియం మ్యాట్రె సెస్ లను, స్లీప్ యాక్సెసరీస్ లను అందిస్తోంది. ఈ విప్లవాత్మక బ్రాండ్ ఐదు దశాబ్దాల నైపుణ్యం మరియు అత్యాధునిక సాంకేతికతలతో నాణ్యమైన నిద్రను పునర్ నిర్వచిస్తోంది.

భారతదేశంలోనే మొదటివిగా చెప్పబడే వినూత్న, అత్యంత అధునాతన ఉత్పాదనలతో డ్యురోఫ్లెక్స్ అనేది పరి శ్రమలోనే లీడర్ గా విశిష్టతతో ఉంటోంది. దీని సిగ్నేచర్ శ్రేణి డ్యూరోపెడిక్ భారతదేశ మొట్టమొదటి మరియు డాక్టర్ ధ్రువీకృత ఏకైక ఆర్థోపెడిక్ మ్యాట్రెస్ శ్రేణి. ఈ బ్రాండ్ నేడు నాణ్యత, వినూత్నత, సౌఖ్యంలకు మారు పేరుగా నిలిచింది. పటిష్ఠమైన సాంకేతికత, ఆధునిక ఉపకరణాలు, భవిష్యత్ అవసరాలను అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలతో దీని ఉత్పాదన పోర్ట్ ఫోలి యో ఉంది. 

డ్యూరోఫ్లెక్స్ ఉత్పాదనలు భారతదేశవ్యాప్తంగా ఆన్ లైన్ లో www.duroflexworld.com పై లేదా సంస్థకు గల 5000+ రిటైల్ అవుట్ లెట్స్ లో లభ్యమవుతాయి. ఈ బ్రాండ్ ప్రీమియం మ్యాట్రెసెస్ ను రూ.5336 ప్రారంభ ధరతో విక్రయిస్తోంది.

Banner
Similar Posts

ప్రతిష్ఠాత్మక మెక్‌డొనాల్డ్స్ హ్యాపీ మీల్ TM ఇప్పుడు లభిస్తుంది సరికొత్త ఆరోగ్యకరమైన రుచిలో, ITC యొక్క బీ నాచురల్ మిక్స్‌డ్‌ ఫ్రూట్ (జోడించిన చక్కెర లేదు) మరియు వేడిగా, తాజాగా ఉండే కార్న్ కప్‌తోపాటు

Latest Posts from Vartalu.com