Banner
banner

ధర్మ పాలితమైన సమాజం కోసం సంస్దాగతమైన వ్యవస్దలు సమాజంలో నిర్మాణంలో కావాలి
— డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌

నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 127వ జయంతి ఉత్సవాలు ఈ రోజు ( శనివారం) దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నాయి. ఈ సందర్బంగా ఆ మహనీయుడు గురించి

తెలిసిన విషయాలే అయినా మరోసారి గుర్తు చేసుకుందాం…..

1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్ లోని మోవ్ గ్రామంలో పుట్టారు అంబేద్కర్. పూర్తి పేరు భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్. చదువుకోవాలంటే కులం అడ్డు వచ్చింది. మంచినీళ్ళు తాగాలంటే కులమే

అడ్డుగా నిలబడింది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. సమాజంలో వర్ణ, వర్గభేదాలు ఉండొద్దని రాజ్యాంగాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ఎందరికో ఆరాధ్యుడయ్యారు.

ఇంతకీ అంబేద్కర్‌ అంటే ఎవరు…

అంబేత్కర్ అంటే ఆలోచన !
అంబేద్కర్‌ అంటే ఆత్మ గౌరవం!
అంబేద్కర్‌ అంటే పట్టుదల!
అంబేద్కర్‌ అంటే జ్ఞానపు శిఖరం !
అంబేద్కర్‌ అంటే పోరాటం !
అంబేత్కర్ అంటే త్యాగం !
అంబేత్కర్ అంటే ఆయుధం !
అంబేద్కర్‌ అంటే స్వేచ్ఛ, స్వాతంత్రం !

అంబేత్కర్ అంటే అంటరానితనంపై ఎక్కుపెట్టిన ఆయుధం !
అంబేత్కర్ అంటే అగ్రకుల దురహంకారంపై గొంతెత్తిన స్వరం!

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడు, రాజ్యాంగాన్ని రచించి ప్రజలకు కావాల్సిన అవసరాలను, హక్కులను తెలిపిన గొప్ప మహా నాయకుడు. ప్రజలకు రిజర్వేషన్లు, హక్కులు

కల్పించిన గొప్ప నాయకుడు అంబేద్కర్, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎవరెవరికీ ఎంత రిజర్వేషన్ల ప్రకారం వేతనాలు తీసుకోవాలో, సమాజంలో ఎలా నడుచుకోవాలో, రాజ్యాంగంలో క్లుప్తంగా రచించి ప్రజలకు

అం దించిన గొప్ప మహనీయుడు.

డా. బి.ఆర్‌.అంబేద్కర్‌ విభిన్న అంశాలపై ఎంతో విస్తృతంగా రచనలు చేశారు. ‘ప్రజాస్వామ్యం’, ‘అంటరానితనం’, ‘కుల నిర్మూలన’, ‘మతమార్పిడి’, ‘బౌద్ధమతం’, ‘హిందూమతంలోని చిక్కుముడులు’, ‘ఆర్థిక సంస్కరణలు-దళితులు’, ‘భారతదేశ చరిత్ర’ మొదలైన వాటిపై ఆయన రచనలు ఎంతో ప్రఖ్యాతి చెందాయి. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ అధ్యయనశీలతకు, శాస్త్రీయ దృక్పథానికి, తర్క పటిమకు ఈ పుస్తకాలు ఉదాహరణగా నిలుస్తాయి. అంతరాల దొంతరల వర్గ కుల సామాజిక వ్యవస్థ స్థానంలో స్వేచ్ఛా, సమానత్వం, సామాజిక న్యాయం లభించాలన్న అంబేడ్కర్‌ ఆలోచనలే ఈ పుస్తకాల్లో కనిపిస్తాయి.

అంబేడ్కర్ భారతీయ సామాజిక వ్యవస్థను మార్చడం కోసం జీవితాంతం కృషి చేశారు. కులవ్య వస్థను రద్దు చేయడానికి కులనిర్మూలనను ప్రతిపా దించారు. కులం ఒక పెట్టుబడిగా, అదనపు సంప దగా, అదనపు విలువగా, అధికార కేంద్రంగా ఉం దని స్పష్టం చేయడం ద్వారా అంబేడ్కర్ కులాన్ని కూడా అర్థశాస్త్రంలో భాగంగా చర్చించారు

తెలుగునాట మొదటిసారిగా అంబేడ్కర్‌ను సాహిత్యంలో ప్రస్తావించిన ఘనత మహాకవి గుర్రం జాషువాకే దక్కుతుంది. 1947లో వెలువరించిన ఆయన కావ్యం గబ్బిలంలో ‘జంబేడ్కరుండు సహోదరుండు’ అనే పద్యంలో గబ్బిలాన్ని అంబేడ్కర్ దీవెనలు అందుకోమంటారు. అప్పటి నుండి తెలుగు సాహిత్యంలో అంబేడ్కర్ శాశ్వత స్థానం సంపాదించుకున్నాడు.

బాబాసాహెబ్ ప్రత్యేకతలు – దక్కిన గౌరవాలు

బాబాసాహెబ్ తన జీవిత కాలంలో 527 ప్రసంగాలు చేసారు., ప్రతి ప్రసంగం అత్యంత ప్రభావితం చేయగలిగేవే..
లండన్ యూనివర్సిటీ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు మొత్తం చదివి అవపోసన పట్టిన ఒకే ఒక్కరు బాబాసాహెబ్
ప్రపంచంలో అత్యధిక విగ్రహాలు గల ప్రజా నాయకుడు బాబాసాహెబ్
ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావశీలురైన 6గురు మేధావులలో బాబాసాహెబ్ ఒకరు
లండన్ విశ్వవిద్యాలయంలో తన ఎనిమిదేళ్ళ Phd ని మూడు సంవత్సరాలలో పూర్తి చేసిన అత్యంత మేధావి
ఆయన బౌద్ధం తీసుకుంటే, మరో ఆలోచన లేకుండా 5లక్షల మంది బౌద్ధం తీసుకున్నారు.. ఇంతటి అభిమానం ఇంకే నాయకుడు పొంది ఉండడు.

“జీవితం సుదీర్ఘంగా ఉండాల్సిన అవసరం లేదు,, గొప్పగా ఉండాలని” బాబాసాహెబ్ చెప్పిన మాటలు ఆయనకే వర్తించాయి..

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన బాటలో నడవడమే ఆయనకు మనం అర్పించే నివాళి

బహుజన హితాయ.!!
బహుజన సుఖాయ.!!
జై భీమ్ !! జై భారత్ !!

Banner
Similar Posts
Latest Posts from Vartalu.com