Banner
banner

 రావణుని తమ్ముడైన కుంభకర్ణుడుకి రేటు ఇప్పుడు కట్టటమేంటని ఆశ్చర్యపోతున్నారా. అందులోనూ లక్షా 35 ఒక అంకె కూడా చెప్తున్నారు. అదేం లెక్క అంటారా. అయితే ఈ డిజిటల్ ప్రపంచంలో ప్రతీదానికి ఓ లెక్క ఉంటుంది. కుంభకర్ణుడు అనేది ఓ డాట్ కామ్ పేరు. Kumbhakarna.com పేరుతో గో డాడీకు వెళ్లి చూస్తే ఓ డొమైన్..దాని రేటు కనబడుతుంది. అంటే మీరు ఆ డొమైన్ కొనుక్కోవాలి అంటే ఆ రేటు చెల్లించాలి అన్నమాట.

 సైబర్‌స్పేస్ ప్రంపంచంలో గెలవటానికి సరైన మార్గం డొమైన్ నేమ్. ఒక వెబ్ సైట్ లేదా బ్లాగ్ మొదలు పెట్టడానికి ముందు కావాల్సింది “డొమైన్ నేమ్” అంటే వెబ్ సైట్ పేరు . దానిని మనం రిజిస్టర్ చేసుకోవాలి. ఎవరయినా కస్టమర్ మీ సైట్ కి వెళ్ళాలంటే ఈ డొమైన్ నేమ్ లేదా వెబ్ సైట్ పేరు టైపు చేస్తారు . మన కో వెబ్ సైట్ పేరు కావాలంటే డొమైన్స్ అమ్మే కంపెనీ దగ్గర కొనాలి , వీళ్ళని “డొమైన్ “రిజిస్ట్రార్లు ” అంటారు . వీళ్ళని మనకి వెబ్ సైట్ పేర్లు అమ్మే కంపెనీలు  గా మనం భావించొచ్చు .

GODADDY అనేది ఓ డొమైన్ రిజిస్ట్రార్ .  ఇక్కడ చాలా మంది వాళ్ళకి నచ్చిన డొమైన్లు బుక్ చేసుకుంటారు .సాధారణంగా  డొమైన్ బుక్ చేయాలి అంటే వెయ్యి రూపాయలు ప్రతి సంవత్సరానికి  కట్టాల్సి ఉంటుంది .  కొన్ని సందర్భాల్లో కొన్ని డొమైన్లని  ముందుగానే బుక్ చేసుకున్న వారు ప్రీమియం రేట్ కి అమ్ముతారు .  Kumbhakarna.com డొమైన్ ఇలా ప్రీమియం డొమైన్ కింద సేల్ చేస్తున్న డొమైన్ . 


 సాధారణంగా మనం ఎంచుకున్న డొమైన్ పేరు బ్రాండ్ ని ప్రమోట్ చేసే అంశం గా నిలుస్తుంది.  కస్టమర్‌లు మన వెబ్‌సైట్‌లోకి అడుగుపెట్టినప్పుడు ఏమి ఆశించాలో అర్థం చేసుకోవడానికి ఇది మొదటి టచ్‌పాయింట్ గా అవుతుంది. కాబట్టి డొమైన్ నేమ్ అనేది చాలా జాగ్రత్తగా ఎంచుకోవాల్సిన అంశం. అందుకే డొమైన్ పేర్లు అంతంత రేట్లు, ఆ స్థాయి డిమాండ్ ఉంటుంది.

మనం ప్రమోట్ చేసే వస్తువు లేదా విషయాలను ప్రమోట్ చేయటానికి విశ్వసనీయంగా అనిపించే  స్మార్ట్ మరియు సరళమైన డొమైన్ పేరు ఎంచుకోవాలి. అప్పుడే బలమైన బ్రాండ్‌ను రూపొందించడానికి సహాయపడుతుంది.

అవును..ఇంతచదివాక మీకో డౌట్ వచ్చి ఉండాలే…ఇంత రేటు పెట్టి Kumbhakarna.com కొన్నాక ఆ వెబ్ సైట్ లో ఏం కంటెంట్ పెడతారు??? నిద్ర గురించా  లేక నిద్రలేమి గురించా, నిద్రపోయే వాళ్ల గురించా…ఏదమైనా క్రేజీగా ఉండే ఈ టైటిల్ లో సరైన కంటెంట్ పెట్టకపోతే మాత్రం  నిద్ర పోతూ ఉంటుంది. చూద్దాం..ఎవరు తీసుకుంటారో..ఏం కంటెంట్ తో సైట్ ని ముందుకు తీసుకెళ్తారో.

గమనిక: ఇక్కడ మీరు చదివిన సమాచారం కేవలం ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే .  Domainlu.com కు గాని మా అనుబంద సంస్థలకి గాని  ఇక్కడ ప్రస్తావించిన డొమైన్ కు ఏ సంబంధం లేదు. అలాగే ఆ డొమైన్ పేరు ను కొనుక్కుని కానీ, వద్దు కానీ చెప్పబోవటం లేదు. అది మీరు ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం.  

Banner
Similar Posts
Latest Posts from Vartalu.com