
బెన్ కింగ్స్లే అంటే మనకు వెంటనే గుర్తుకు రాకపోవచ్చేమో కానీ …మహాత్మా గాంధీ పాత్రలో ఒదిగిపోయిన నటుడిగా బెన్ కింగ్స్‌లేను మర్చిపోవటం కష్టం. రిచర్డ్ అటెన్‌బరో దర్శకత్వంతో రూపొందిన ‘గాంధీ’ చిత్రంలో ఆయన మన జాతిపితను కళ్లకు కట్టిన ఘనత ఆయనదే. అస్కార్ అవార్డు పొందిన సినిమా ఇది. బెన్ కింగ్ స్లే గాంధీగా నటించారు. భారత స్వతంత్ర పోరాటాన్ని, గాంధీ జీవితాన్ని తెరకెక్కించిన మొదటి సినిమా ఇదే. ఆ సినిమాతో ఇంటర్నేషనల్ గా గుర్తింపు సంపాదించారు బెన్ కింగ్స్లే. ఈ నేపధ్యంలో ఆయన అసలు పేరు ఏంటో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది.
అప్పట్లో ఆటెన్‌బరో నిర్మిస్తున్న ‘గాంధీ’ చిత్రంలో గాంధీగా ఎవరు నటించనున్నారనే విషయమై చాలా తర్జనభర్జనలు జరిగి చివరకు ఓ చోట ఆగాయి. చాలా మందిని అనుకున్నా ఆ పాత్ర బెన్ కింగ్స్లే వచ్చి ఆగింది. అలాగే ఆయన అసలు పేరు ‘ కృష్ణ పండిట్ భాంజీ’ కావటం విశేషం. అందుకు కారణం ఆయన మూలాలు అన్నీ భారతదేశంలోని గుజరాతీయులకు చెంది ఉండటమే. ఆయన తండ్రి రహింతుల్లా హర్జీ భాంజీ భారతీయుడు. తల్లి అన్నాలినా మేరీ బ్రిటీష్ మూలాలు కలిగినది. దాంతో తండ్రి కుటుంబ వారసత్వంగా ఆయనకు ‘ కృష్ణ పండిట్ భాంజీ’ అనే పేరు పెట్టారు. అయితే అదే కాలక్రమంలో బెన్ కింగ్స్లే గా రూపొందింది.
ఆయన పేరులో ఉన్న భాంజీని బెన్ గా మార్చారు. అలాగే ఆయన పేరులో రెండో భాగమైన కింగ్స్లే …విషయానికి వస్తే…ఆయన మాతామహుడు (తల్లితండ్రి) కింగ్ క్లోవన్స్ కు ఉన్న నిక్ అయిన కింగ్స్ లే నుంచి వచ్చింది. ఇక బెన్ కుర్రాడిగా ఉన్నప్పుడే నాటక రంగంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ సమయంలోనే తన విదేశీ పేరు వల్ల వచ్చే ఆఫర్స్ దెబ్బతింటాయోమోననే బెన్కింగ్స్లేగా పేరు మార్చుకున్నాడు. ఇక తండ్రి వైద్యుడు..తల్లి నటి. తల్లినుంచే నట వారసత్వం వచ్చింది.
కింగ్స్ లే ..నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానంలో ఆస్కార్, గ్రామీ, బాఫ్తా, రెండు గోల్డెన్‌గ్లోబ్, స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్‌లాంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు సొంతం చేసుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ‘నైట్ బ్యాచిలర్’ అవార్డు, ‘సర్’ బిరుదు పొందారు. ‘షిండ్లర్స్ లిస్ట్’, ‘ట్వెల్త్ నైట్’, ‘సెక్సీ బీస్ట్’, ‘హౌస్ ఆఫ్ శాండ్ అండ్ ఫాగ్’, ‘లక్కీ నెంబర్ స్లెవిన్’, ‘షట్టర్ ఐలాండ్’, ‘ప్రిన్స్ ఆఫ్ పెర్షియా’, ‘ద శాండ్స్ ఆఫ్ టైమ్’, ‘హెగో’, ‘ఐరన్‌మ్యాన్3’, ‘ద బాక్స్‌ట్రోల్స్’, ‘ద జంగిల్‌బుక్’ సినిమాలు ఆయన్ను నటుడిగా ప్రపంచంపలో ప్రత్యేక స్దానం చేకూర్చాయి.