Banner
banner

ప్రపంచ అగ్రగామి వాచ్, యాక్సెసరీస్ బ్రాండ్ కావాలన్న ఆశయంతో డానియెల్ వెల్లింగ్టన్ తన ఉత్పాదన పోర్ట్ ఫోలియో ను విస్తరిస్తోంది. తాజాగా ఐవేర్ ను, వింటేజ్ స్ఫూర్తితో స్వ్కేర్ డయల్ వాచ్ కలెక్షన్ ను ఆవిష్క రించింది.

ఈ యూనిసెక్స్ ఐవేర్ కలెక్షన్ సమకాలీనం. కాలానికి అతీతమైన డిజైన్లను కలిగిఉంటుంది. అదే డానియెల్ వెల్లింగ్టన్ లో కేంద్ర బిందువుగా ఉంటుంది. లైట్ వెయిట్ ప్రీమియం ఇటాలియన్ బయో- ఏసెటేట్ లేదా మెటల్ ఫ్రేమ్స్ తో 5 విలక్షణ స్టైల్స్ వీటిలో ఉన్నాయి. వెల రూ.8,499. ఈ స్టీల్ కలెక్షన్ స్టెయిన్ లెస్ స్టీల్ తో తయా రైంది.  రిమ్ లెస్ లెన్స్ లుక్ ను అందిస్తుంది. ఎసెటేట్ కలెక్షన్ ఫ్రేమ్స్ షార్పర్ గా, మరింత ఎక్స్ గెరేటెడ్ అం చులతో ఉంటాయి. ప్రతీ స్టైల్ కూడా దాని విలక్షణ గుణాలకు తగిన పేరుతో ఉంటుంది. ఆర్చ్, అంబ్లర్, ఏవియన్, లిన్స్, గ్రాండ్.

ఈ సందర్భంగా డానియెల్ వెల్లింగ్టన్ డిజైన్ మెడ్ ఒలోఫ్ నోర్డ్ స్ట్రోమ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘మేం మా ఉత్పాదన పోర్ట్ ఫోలియోను విస్తరించాలనుకుంటున్నాం. అందుకే, ఐవేర్ విభాగంలోకి ప్రవేశించడం డానియెల్ వెల్లింగ్టన్ కు ఎంతో ఉద్వేగభరిత అడుగు’’ అని అన్నారు.

డానియెల్ వెల్లింగ్టన్ ఆకాంక్షాపూరిత సుస్థిరదాయక వ్యూహాన్ని కలిగిఉంది. బయో-ఎసెటేట్ ను ఉపయోగిం చాలన్న నిర్ణయం దీనితో ముడిపడింది. బయో- ఎసెటేట్ అనేది కంపోజ్ చేయబడిన సెల్యులోజ్ ఎసెటేట్. శాకాహార మూలాలు ఉండే ప్లాస్టిసైజర్. సంప్రదాయక రకాల కంటే కూడా మరింత పర్యావరణ హిత ఎంపిక.

ఈ సందర్భంగా సస్టెయినబిలిటీ గ్లోబల్ హెడ్ అలైస్ డివైన్ మాట్లాడుతూ, ‘‘ఒక మార్పును తీసుకురావడం ప ట్ల మాకు గల అంకితభావం ఎంతో నిజమైంది. మా ధరల శ్రేణిలో సాధ్యమైనంత అత్యుత్తమ మెటీరియల్ ను ఎంచుకోవాలన్నది మా అభిలాష. అన్న నూతన ఉత్పాదనలు, మెటీరియల్స్ కు మేం సుస్థిరదాయకత సమీ క్ష నిర్వహించాం. డిజైన్ టేబుల్ వద్ద మేం సంపూర్ణ అవగాహనతో నిర్ణయాలు తీసుకునేలా చూసుకున్నాం’’ అ ని అన్నారు.

 నూతన వాచ్ కలెక్షన్ కు క్వాడ్రో స్టూడియో అనే పేరు పెట్టారు. ఇది 1970ల నాటిదిగా ఉంటుంది. పెటైట్ స్వ్కే ర్ డయల్ ను, స్లీక్ పియానో స్ట్రాప్ ను కలిగిఉంటుంది. డయల్, బెజెల్ రెండూ కూడా గుండ్రటి మూలలను కలిగిఉంటాయి. అందమైన పియానో లింక్ స్ట్రాప్ తో ఇది వింటేజ్ అనుభూతిని అందిస్తుంది. క్వాడ్రో స్టూడియో అనేది 1970 నాటి స్టయిల్ ఐకాన్లను గుర్తుకు తెస్తుంది. రిఫైన్డ్ రోజ్ గోల్డ్ ప్లేటింగ్ లేదా వైబ్రంట్ సిల్వర్ ఫినిష్ తో లభిస్తుంది. కొనుగోలుదారులు క్లాసిక్ వైట్, సోఫిస్టికేటెడ్ బ్లాక్, లేదా యూనిక్ గా గ్రీన్ పాటర్న్ డ్ డయల్ ను ఎంచుకోవచ్చు.

ఐవేర్ స్పెసిఫికేషన్స్

–      అన్ని లెన్స్ లు కూడా యూవీఏ, యూవీబీ కిరణాల నుంచి 100% యూవీ (400) ప్రొటెక్షన్ ను అందిస్తాయి

–      బ్రాండెడ్ ఐవేర్ కేస్, సాఫ్ట్ పౌచ్, క్లీనింగ్ క్లాత్ తో వస్తాయి

–      ఫ్రేమ్, లెన్స్ లపై రెండేళ్ల వారంటీ

క్వాడ్రో స్టూడియో నిర్దేశకాలు:

·         అందమైన పియానో స్ట్రాప్

·         6.55 ఎంఎం కేస్ థిక్ నెస్

·         రెండేళ్ల వారంటీ

నూతన ఐవేర్ కలెక్షన్ వెల రూ.8,499. నూతన క్వాడ్రో స్టూడియో వెల రూ.14,499.

డానియెల్ వెల్లింగ్టన్ గురించి:

డానియెల్ వెల్లింగ్టన్ అనేది స్వీడిష్ వాచ్ అండ్ జ్యుయలరీ బ్రాండ్. 2011లో నెలకొల్పబడింది. అన్ని ఉత్పాదనలు కూడా స్టాక్ హోమ్ లో ఇన్ హౌస్ గా డిజైన్ చేయబడుతాయి. పరిపూర్ణ మినిమలిస్ట్ డిజైన్ కు కట్టుబడి ఉంది. కాలాతీత స్టయిల్ ను, అందుబాటు ధరల విలాసాన్ని అందిస్తుంది. నెలకొల్పబడిన నాటి నుంచి డానియెల్ వెల్లింగ్టన్ 12 మిలియన్లకు పైగా వాచీలను విక్రయించింది. పరిశ్రమలో అత్యంతగా అభిమానించే బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది.

Banner
, , , , ,
Similar Posts
Latest Posts from Vartalu.com