Banner
banner

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు. ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా… ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.
1
కె బాలచందర్
దక్షిణాది సినిమా చరిత్రలో తనకంటూ ఒక గొప్ప స్థానం సంపాదించిన కళామతల్లి ముద్దుబిడ్డ…. కె.బాలచందర్ గారు. ఈ రోజు వారి పుట్టినరోజు. కె.బాలచందర్ గా ప్రసిద్ధిచెందిన కైలాసం బాలచందర్ రాసిన ‘మేజర్‌ చంద్రకాంత్‌’ నాటకం ఎమ్జీఆర్‌ దృష్టిని ఆకర్షించింది. అలా ఎమ్జీఆర్‌ ప్రోత్సాహంతో 1964లో ‘దైవత్తాయ్‌’ సినిమాకు తొలిసారి మాటలు రాసి, స్క్రీన్‌ ప్లే సమకూర్చారు. తర్వాత వరసపెట్టి తమిళంలో సూపర్ హిట్స్ ఇచ్చారు. తెలుగులో వచ్చిన ‘సత్తెకాలపు సత్తెయ్య’ (1969) సినిమాకు కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం బాలచందరే నిర్వహించారు. తర్వాత ‘బొమ్మా – బొరుసా’ సినిమా వచ్చింది. 1976లో వచ్చిన ‘అంతులేని కథ’ సినిమాతో బాలచందర్‌ ఆంధ్ర ప్రేక్షకుల అభిమాన దర్శకుడయ్యారు. ‘సుఖదు:ఖాలు’, ‘జీవిత రంగం’, ‘అంతులేని కథ’, ‘తూర్పు పడమర’, ‘బొమ్మా బొరుసు’, ‘అందమైన అనుభవం’, ‘గుప్పెడు మనసు’, ‘ఇది కథ కాదు’, ‘ఆకలి రాజ్యం’, ‘మరోచరిత్ర’, ‘ఆడవాళ్లు మీకు జోహారులు’, ‘తొలికోడి కూసింది’, ’47 రోజులు’, ‘కోకిలమ్మ’, ‘రుద్రవీణ’ వంటి భిన్నమైన చిత్రాలను రూపొందించి తెలుగు ప్రేక్షకుల మదిలోనూ చెరగని ముద్ర వేశారు. భిన్న కథాంశాలతో గొప్ప చిత్రాలను తీసి ప్రేక్షకులు మెచ్చిన దర్శకుడిగా భారతీయ సినీ చరిత్రలో దర్శక శిఖరంగా నిలిచారు.50ఏండ్ల సినీ జీవితంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 100కిపైగా సినిమాలకు దర్శకత్వం వహించగా, 150కిపైగా సినిమాలకు రచయితగానూ పనిచేశారు. కమలహసన్, రజనీకాంత్, ముమ్ముట్టిలను తీర్చిదిద్దింది ఆయనే…. జయసుధ, జయప్రద, శ్రీదేవి, ప్రకాశరాజ్ ని మలచింది ఆయనే..

2 గుమ్మడి
తెలుగు సినిమా రంగములో గుమ్మడిగా ప్రసిద్ధి చెందిన గుమ్మడి వెంకటేశ్వరరావు ఈ రోజు జన్మించారు. తెలుగు చలనచిత్రరంగంలో ఐదు దశాబ్దాలకు పైగా అనుభవమున్న నటుడు. పౌరాణిక చిత్రాలు, సాంఘిక చిత్రాలు, జానపద చిత్రాలు, చారిత్రక చిత్రాలు ఏవిధమైన చిత్రమైనా అయన తనవేషంలో జీవించాడు. తండ్రిగా, అన్నగా, తాతగా వేషమేదైనా దానిని తన నటనతో తెలుగు ప్రజానీకాన్ని మెప్పించి వారి హృధయాలలో స్థిరస్తాయిగా నిలచిన మహానటుడు మన గుమ్మడిగారు.హీరో వేషాలు వేయాల్సిన వయసులో ఆయన తండ్రి వేషాలు వెయ్యడం, ఆ పాత్రల్ని రంజింపజేయడంలో ఆయనకున్న సాత్విక మనస్తత్వమే కారణం కావచ్చు. ఆంధ్రా ప్యారిస్‌గా కీర్తించే తెనాలి పట్టణ సమీప గ్రామంలో పుట్టి, నాటకాల్లో రాణించి, తెలుగు చలన చిత్రసీమలో ఒక అద్భుత నటుడుగా అరవై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేసి ఇదు వందలకు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు గుమ్మడి. ఆంధ్రుల పంచకట్టులోని హందాతనాన్ని ప్రతిబింబించిన ఏకైక నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు. ఎన్ టి ఆర్ తో నటించిన తోడు దొంగలు (1954) మరియు మహామంత్రి తిమ్మరుసు (1962) సినిమాలు గుమ్మడికి బాగా గుర్తింపునిచ్చాయి. రాష్ట్రపతి బహమతి మొదటిదానికి రాగా, రెండవదానికి జాతీయ స్థాయిలో ఉత్తమ సహ నటుడుగా ఎంపికయ్యాడు.

  1. బొత్స సత్యనారాయణ
    బొత్స సత్యానారాయణ… అలియాస్ సత్తిబాబు.. విజయనగరం జిల్లాలో పరిచయం అవసరం లేని పేరు. కాంగ్రెస్ పార్టీలో పెన్మెత్స సాంబశివరాజు అనుయాయుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన బొత్స సత్యనారాయణ… తొలుత బొబ్బిలి నుంచి ఎంపీగా… అనంతరం చీపురుపల్లి ఎమ్మెల్యేగా పలుమార్లు గెలిచారు.. కీలకమైన కాపు సామాజికవర్గ నేతగా కాంగ్రెస్ లో అంచెలంచెలుగా ఎదిగిన బొత్స… 2004లో అప్పటి వైఎస్ కేబినెట్ లో భారీ పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గాల్లో పనిచేసారు బొత్స. 2015లో వైఎస్సార్సీపీలో చేరిన బొత్స… గతంలో తాను పనిచేసిన రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ తో పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన బొత్సను రాష్ట్ర విభజన ప్రజల ముందు దోషిగా నిలబెట్టినా కోలుకుని తిరిగి ఏపికు మంత్రి అయ్యారు. 4 టామ్ హాంక్స్
    హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ హాంక్స్ ఈ రోజే జన్మించారు. సేవింగ్‌ ప్రైవేట్‌రియాన్‌, కాస్ట్‌ అవే, ఫిలడెల్పియా, ఫారెస్ట్‌ గంప్‌, స్ప్లాష్‌, బ్యాచిలర్‌ పార్టీ, బిగ్‌, ది టెర్మిమినల్‌, అపో వంటి చిత్రాలతో మంచి నటుడిగా టామ్‌ హాంక్స్‌ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన అవార్డ్‌ విన్నింగ్‌ యాక్టర్‌. లెజెండ్‌. లెక్కలేనంత మంది అభిమానులను సంపాదించుకున్నాడు. చెయ్యలేని పాత్రంటూ లేదనిపిస్తాడు. ఎలాంటి పాత్రనిచ్చినా అలవోకగా నటించేస్తాడు. రెండు ఆస్కార్ అవార్డులందుకున్నాడు టామ్ హ్యాంక్స్.

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.ఈ ఆర్టికల్ ని బెస్ట్ విషెస్ యూట్యూబ్ ఛానల్ వారి సౌజన్యం తో అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ ని వీడియో లో చూడడం కోసం కింద ఉన్న వీడియో ని క్లిక్ చేయండి

Banner
, , ,
Similar Posts
Latest Posts from Vartalu.com