Banner
banner

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు. ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా… ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

1 YSR
వైయస్ రాజశేఖర రెడ్డి గారు…ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆయన ఈ రోజే పుట్టారు. చెదిరిపోని గుండె బలం… నాయకత్వానికి నిలువెత్తు రూపం.. గా వైయస్ రాజశేఖర్ రెడ్డిని చెప్తూంటారు. 1978లో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంనుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖరరెడ్డి మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నిక కాగా, 4 సార్లు కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఆయన పోటీచేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు. జనతాపార్టీ ప్రభంజనాన్ని తట్టుకొని విజయం సాధించిన తొలి ఎన్నికల (1978) వెంటనే మంత్రిపదవి పొందిన ఘనత ఆయనదే. వ్యవసాయం దండగంటూ ఈసడించినా, దానిని పండగ చేసి అన్నదాతల మోముపై చిరునవ్వులు విరబూయించిన ప్రతిభ ఆయనది. ఆయన జీవితం ఎందరో నాయకులకు పాఠ్యపుస్తకం గా చెప్తారు. మాట తప్పని ఆయన తీరు పేదల జీవితాల్లో వెలుగులు నింపగా మడమతిప్పని ఆయన నైజం ప్రత్యర్థులకు సింహస్వప్నం అయ్యారు. ఎందరికో అసాధ్యమయిన అనేక అభ్యుదయ పథకాలను సుసాధ్యం చేసి సంక్షేమ రథసారథిగా తెలుగు రాజకీయ యవనికపై తనకంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు.

2
సౌరబ్ గంగూలీ
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ ఈ రోజు జన్మించారు. 1972 జూలై 8న జన్మించిన గంగూలీ.. క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి, విజయాల బాట పట్టించాడు. టీమిండియాను విజయవంతంగా నడిపించిన కెప్టెన్లలో దాదా కూడా ఒకరు. అభిమానులు ముద్దుగా ‘కోల్‌కతా ప్రిన్స్‌’, ‘బెంగాల్‌ టైగర్‌’ పేర్లతో దాదాను పిలుచుకుంటూ ఉంటారు. గంగూలీ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి నాళ్లలో ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాళ్లతో నిండి ఉండేది. అలాంటి ఆస్ట్రేలియా జట్టుని సైతం గంగూలీ తనదైన శైలిలో ఢీకొట్టాడు.2000 సంవత్సరంలో భారత క్రికెట్ సంక్లిష్టంలో ఉండగా కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన గంగూలీ ఎంతో సమర్థంగా జట్టుని నడిపించాడు. భారత జట్టు సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేశాడు. భారత జట్టుకు కెప్టెన్‌గా గెలుపు రుచిని చూపించాడు. ఎంతో మంది యువ ఆటగాళ్లను వెలుగులోకి తీసుకొచ్చాడు. వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్బజన్ సింగ్, జహీర్ ఖాన్, మహేంద్ర సింగ్ ధోని లాంటి గొప్ప ప్లేయర్లను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసిన దాదా.. తన ప్రత్యేకమైన శైలితో ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. 2003 వరల్డ్ కప్‌లో భారత జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లి తనేంటో నిరూపించిన గంగూలీ భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన పేజీలు లిఖించుకున్నాడు. అప్పటి వరకు జట్టుకు ఎందరో కెప్టెన్లు వచ్చారు.. పోయారు.. కానీ, గంగూలీ కెప్టెన్‌గా ఉన్నన్ని రోజులు భారత క్రికెట్ దేదీప్యమానంగా వెలిగింది. దాన్ని ధోని కొనసాగించి.. టీమిండియాను టాప్ పొజిషన్‌లో ఉంచాడు.

3 రేవతి

ఈ రోజున ఓ గొప్ప నటీమణి జన్నించింది. ఆమె మరెవరో కాదు రేవతి.సినీ ఇండిస్టీలో గేమ్‌ఛేంజర్స్‌గా ఉన్న నటీమణులను వేళ్లమీద లెక్కించొచ్చు. ఎక్కడా తమ అస్తిత్వాన్ని కోల్పోకుండా స్థిరంగా సినీ ఇండ్రస్టీలో కాలంతోపాటు నిలదొక్కుకున్న నటీమణులు చాలా అరుదు. అందులో ముందుంటుంది రేవతి. నటిగా, దర్శకురాలిగా, సామాజిక కార్యకర్తగా జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నారు రేవతి. తన ఏడో సంవత్సరం నుంచే భరతనాట్యం నేర్చుకొన్న ఆమె ఆ తరువాత పలు ప్రదర్శనలు ఇచ్చారు. 1983లో తెరంగేట్రం చేసిన ఆమె, తమిళం, మలయాళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో నటించి ఉత్తమ నటిగా గుర్తింపు తెచ్చుకొన్నారు. తెలుగులో ఆమె నటించిన అనేక సినిమాలు ఘన విజయాల్ని సొంతం చేసుకొన్నాయి. 1984లో ‘మానసవీణ’లో అనే చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టిన ఆమె ‘సీతమ్మ పెళ్ళి’, ‘రావుగారిల్లు’, ‘ప్రేమ’, ‘లంకేశ్వరుడు’, ‘అంకురం’, ‘గాయం’, ‘గణేశ్‌’, ‘ఈశ్వర్‌’, ‘గాయం2’, ‘అనుక్షణం’, ‘లోఫర్‌’, ‘సైజ్‌ జీరో’, ‘బ్రహ్మోత్సవం’, ‘యుద్ధం శరణం’ చిత్రాల్లో నటించారు. దర్శకురాలిగా ‘మిత్‌ మై ఫ్రెండ్‌’, ‘ఫిర్‌ మిలింగే’, ‘కేరళ కేఫ్‌’, ‘ముంబై కట్టింగ్‌’ చిత్రాల్ని తెరకెక్కించారు. తమిళం, మలయాళంలో పలువురు హీరోయిన్స్ కి ఆమె డబ్బింగ్‌ కూడా చెప్పారు. టెలివిజన్‌తోనూ ఆమెకి మంచి అనుబంధం ఉంది. అనేక సీరియల్స్ లో నటించారు. వివిధ విభాగాల్లో మూడు జాతీయ పురస్కారాల్ని సొంతం చేసుకొన్నారు రేవతి. వివిధ భాషల్లో లెక్కలేనన్ని పురస్కారాలు సొంతం చేసుకొన్న రేవతి 1966లో జులై 8న పుట్టింది.

4
కడియం శ్రీహరి
ఈ రోజన జన్మించిన మరో ప్రముఖ రాజకీయనాయకుడు కడియం శ్రీహరి. వ‌రంగ‌ల్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ క‌ళాశాల నుంచి బీఎస్సీ పూర్తి చేసి, హైద‌రాబాద్ లో ఎంఎస్సీ పూర్తి చేశాడు. 1975-77 నుండి నిజామాబాద్ లో సిండికేట్ బ్యాంక్ లో మేనేజ‌ర్‌గా ప‌నిచేశాడు. 1977-1987 మధ్యకాలంలో టీచ‌ర్‌గా, జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్‌గా ప‌నిచేశాడు. ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగు దేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 1987-1994 మధ్యకాలంలో వ‌రంగ‌ల్ జిల్లా తెలుగు దేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ప‌నిచేశాడు. 1988 లో కాక‌తీయ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథార‌టీ చైర్మ‌న్ గా పని చేశాడు. క‌డియం శ్రీ‌హ‌రి 1994 లో తొలిసారిగా స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది, ముఖ్యమంత్రి నంద‌మూరి తార‌క రామారావు ప్రభుత్వంలో మార్కెటింగ్‌ శాఖ మంత్రిగా పని చేశాడు. నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో సంక్షేమ శాఖ , విద్య నీటిపారుద‌ల శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు. తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో స‌భ్యుడిగా ఉన్నాడు. 2013 లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. 2014 లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుండి వ‌రంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఎంపీగా పోటీ చేసి గెలుపొందాడు. 2015 లో తెలంగాణ డిప్యూటీ ముఖ్య‌మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ప‌నిచేశారు.

5 జ్యోతిబసు
23 సంవత్సరాలు పాటు వరసగా ఒక రాష్ట్రన్ని పాలించిన మాజీ ముఖ్యమంత్రి , మహ నేత, ప్రజా నాయకుడు , ఆణిముత్యం మార్క్సిస్ట్ మహానేత కామ్రేడ్ జ్యోతిబసు గారి పుట్టిన రోజు నేడు .జ్యోతిబసు.. సీపీఎం తొలి తరం కమ్యూనిస్టు నేత. దేశంలో సుదీర్ఘ కాలం ఒక రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా సేవలందిచిన నాయకుడు. 23 ఏండ్ల 4నెలల 17 రోజులు ముఖ్యమంత్రిగా ఆయన నిర్విరామ పదవీ కాలం. నమ్మిన సిద్ధాంతాలపట్ల దృఢమైన నిబద్ధత, క్రమశిక్షణ ఆయన విధానాలు. కమ్యూనిస్టుగా పార్టీ నియమాలను నిక్కచ్చిగా పాటించిన సభ్యుడు. పార్టీ వ్యాప్తికి, సిద్ధాంతాల విస్తరణకు కృషి చేసిన నాయకుడు. ప్రజల ఆశాజ్యోతిగా సేవలందించిన ఆదర్శప్రాయుడు. పేదలకు భూ పంపిణీ చేసిన పక్షపాతి. పార్టీ నియమాలను ఏనాడూ దాటింది లేదు. అందుకే ఆయన 1996లో ప్రధాని అయ్యే అవకాశాన్ని వదులుకున్నారు.

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.ఈ ఆర్టికల్ ని బెస్ట్ విషెస్ యూట్యూబ్ ఛానల్ వారి సౌజన్యం తో అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ ని వీడియో లో చూడడం కోసం కింద ఉన్న వీడియో ని క్లిక్ చేయండి

Banner
, , , ,
Similar Posts
Latest Posts from Vartalu.com