Banner
banner

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు. ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా… ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.
1
ఎమ్ ఎస్ థోని
ఈ రోజు మహేంద్ర సింగ్ ధోనీ పుట్టిన రోజు. ఇంటర్నేషనల్ గా ధోనీ సృష్టించినన్ని సంచలనాలు, ఇప్పటివరకూ బహుశా ఏ ఆటగాడికీ సాధ్యం కాలేదు. ధోనీ క్రికెట్ ప్రపంచంలో బహుశా ఏ ఆటగాడికీ, కెప్టెన్‌కీ దక్కనంత పేరు ప్రతిష్టలు సంపాదించాడు. క్రీడాభిమానులు, ముఖ్యంగా క్రికెట్ అభిమానులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. అందుకే సోషల్ మీడియా అంతా ధోనీ అభిమానులు పెడుతున్న పుట్టినరోజు శుభాకాంక్షలతో నిండిపోతోంది. 500లకు పైగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల మైలురాయిని అందుకున్న సచిన్ తెందూల్కర్, రాహుల్ ద్రవిడ్ తర్వాత ధోనీ మూడో భారతీయ ఆటగాడు అయ్యాడు. ఐసీసీ మూడు పెద్ద ఈవెంట్లలో ట్రోఫీ అందుకున్న ఏకైక కెప్టెన్ ధోనీ. 2007లో టీ-20 వరల్డ్ కప్‌ను ఎవరూ అంత సులభంగా మర్చిపోలేరు. మొదటిసారి కెప్టెన్సీ చేసిన ధోనీ, తన బ్యాటింగ్‌తో జట్టును టాప్‌కు చేర్చడంతోపాటు, కెప్టెన్సీ ఎలా ఉండాలో ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశాడు. దాని గురించి ఇప్పుడు పెద్ద పెద్ద మేనేజ్‌మెంట్ కోర్సుల్లో పాఠాలు కూడా చెబుతున్నారు. భారత జట్టుకు 28 ఏళ్ల తర్వాత ధోనీ వరల్డ్ కప్ విజయాన్ని అందించాడు. ఫైనల్లో ధోనీ కొట్టిన ఆ సిక్సర్‌ను బహుశా ఈ జన్మలో ఎవరూ మర్చిపోలేరు.వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన భారతీయ ఆటగాడు కూడా ధోనీనే.

2 కైలాష్ ఖేర్
భరత్ అనే నేను సినిమాలో ..వచ్చాడయ్యో సామీ అనే పాటను మర్చిపోవటం ఎంత కష్టం. అలాగే కైలాష్ ఖేర్ ని తెలుగువారు ఈ రోజు గుర్తు చేసుకోకుండాను ఉండలేరు. ఎందుకంటే ఈ రోజు ఆయన పుట్టిన రోజు. విలక్షణమైన గొంతుతో టాలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకున్న సింగర్ కైలాష్ ఖేర్. అయన తెలుగులో పాడిన పాటల్ని హిట్ గా నిలిచి ఇప్పటికీ శ్రోతల నోళ్ళల్లో నానుతూ ఉన్నాయి.అరుంధతి సినిమాలో ‘జేజమ్మా..’ అంటూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన గాయకుడు తెలుగులో చాలా సూపర్ హిట్స్ సాంగ్స్ పాడారు. జానపద శైలికి తనదైన రాక్ శైలిని జోడించి నూతన సంగీత ఒరవడిని సృష్టించాడు. తనదైన గాత్రంతో బాలీవుడ్‌లో టాప్ సింగర్‌గా ఎదిగిన కైలాశ్.. దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనూ మంచి గుర్తింపు సాధించారు. అరుంధతిలో ఆయన పాడిన పాట తెలుగువారి నాలుకపై ఇప్పటికీ నానుతూనే ఉంది. అరుంధతితో పాటు ‘మిర్చి’, ‘గోపాల గోపాల’, ‘బాహుబలి’, ‘భరత్‌ అనే నేను’ సినిమాల్లో కైలాష్ అద్భుతమైన పాటలు పాడారు. ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలోనూ ఓ పాట పాడారు. గతంలో ప్రభాస్ నటించిన మిర్చి సినిమాలో పండగలా దిగివచ్చాడు… అనే పాట ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. ఆ పాట కైలాష్ ఖేర్ గొంతు ద్వారా వినిపించినదే. అలాగే ప్రభాస్ కి మళ్ళీ బాహుబలిలో కైలాష్ పాట పడటం కూడా హైలెట్ గా నిలిచింది.
3
జగ్గారెడ్డి
తెలంగాణాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు జగ్గారెడ్డి కూడా ఇదే రోజు జన్మించారు. బిజేపీ పార్టీ నుంచి కౌన్సిలర్ గా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన మున్సిపల్ ఛైర్మన్ గా ఎదిగారు. ఆ తర్వాత 2004లో టీఆర్ ఎస్ ఎమ్మల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆ పార్టీని వదిలి కాంగ్రేస్ లోగెలిచారు. ఆయన మళ్లీ 2009లో మళ్లీ ఎమ్మల్యేగా గెలిచారు. వివాదాలు,విమర్శలు ప్రక్కన పెడితే మంచి వాయిస్ ఉన్న నాయకుడుగా ఆయనకు పేరుంది. సంగారెడ్డి ఎమ్మెల్యే గా ప్రస్తుతం కొనసాగుతున్నారు.

4 లిరిక్ రైటర్ జొన్నవిత్తుల
జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు కూడా ఈ రోజే పుట్టారు. ఓ ప్రక్క సినిమాలలో పాటలు రాస్తూ ఈటీవీలో ప్రోగ్రామ్ ఇస్తూ బిజీగా ఉన్నారాయన. ఆయన అలవోకగా పద్యాలు చెప్పేయగల సామర్ద్యం ఉన్న ఏకైక రచయిత. వివాదాస్పద వాదనలలో ఆయన గట్టిగానే తన వాణి వినిపిస్తూంటారు. ఎక్కడా తగ్గరు. ఆయన వాగ్ధాటి అందరినీ ఎంతగానో కట్టిపడేస్తూంది… ఆశ్చర్యపరిచేది. ప్రముఖ కవిగా, సినీ గేయ రచయితగా వందలాది పాటలు రాసిన జొన్నవిత్తులవారు పేరడీలు రాయడంలో ప్రసిద్ధులు. తెలుగు శంఖారావం పేరుతో తెలుగు భాష మీద అద్భుతమైన పాటలు రాసిన జొన్నవిత్తుల హీరో రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన “పెళ్ళాం పిచ్చోడు” అనే సినిమాకి దర్శకత్వంకూడా వహించారు. ఈ సినిమా ప్రజాదరణ పొందిన ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం సాధించింది. శ్రీశ్రీ రచన మహాప్రస్థానం, జంధ్యాల పాపయ్య శాస్త్రి రాసిన పుష్ప విలాపంవంటి వాటికి ఆయన పేరడీలు రాశారు. తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన “మిథునం” సినిమాకి ఆయన రాసిన కాఫీ దండకం విశేష ప్రాచుర్యం పొందింది. బాపు గారి ‘రాధాగోపాళం’లో ‘‘ఓ వాలుజడ.. ఓ పూలజడ.. ఓ పాము జడ.. సత్యభామ జడ’’ అంటూ జడ సోయగాన్ని వివరిస్తూ రాసిన జొన్నవిత్తుల పాట చాలా మందికి ఇష్టం. బిందు శార్దూలం, ధృత శార్దూలం అనే కొత్త వృత్తాలు సృష్టించిన ఆయన తిట్లదండకం, రూపాయి దండకం కూడా బలే ఉంటాయి. సుమారు 600కి పైగా పాటలు రాశాడు. తెలుగు అధికార భాషా సంఘ మాజీ సభ్యుడు.

ఇంత మంది గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.ఈ ఆర్టికల్ ని బెస్ట్ విషెస్ యూట్యూబ్ ఛానల్ వారి సౌజన్యం తో అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ ని వీడియో లో చూడడం కోసం కింద ఉన్న వీడియో ని క్లిక్ చేయండి 

Banner
, ,
Similar Posts
Latest Posts from Vartalu.com