Banner
banner

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు. ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా… ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

పీవీ సింధూ

  1. రియో ఒలింపిక్స్‌లో భారత సత్తా చాటిన తెలుగింటి అమ్మాయి పీవీ సింధూ మీరు పుట్టిన ఈ రోజే పుట్టింది. హైదరాబాద్‌లో జన్మించిన సింధూ పదేళ్ల వయస్సు నుంచే జాతీయ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పోటీల్లో కళ్లు చెదిరే విజయాలు సాధించింది. ఒలంపిక్ పోటీల్లో రజత పతకం సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. అలాగే ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ఈ మెగా టోర్నీలో తొలిసారి భారత్‌కు ఆమె స్వర్ణ పతకం సాధించిపెట్టింది. ఈ చాంపియన్‌షిప్‌లో 2017, 2018ల్లో రజత పతకాలు సాధించిన సింధు, 2013, 2014ల్లో కాంస్య పతకాలు సాధించింది.మార్చి 30, 2015న సింధుకు భారత ప్రభుత్వం పద్మశ్రీని ప్రధానం చేసింది.
  2. కళ్యాణ్ రామ్
    ఈ రోజు టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు కూడా. ఎన్. టి. రామారావు మనవడుగా, నందమూరి హరికృష్ణ కుమారుడుగా సినీ పరిశ్రమకు పరిచయం అయినా ఎక్కడా వారి పేర్లు యూజ్ చేసుకోకుండా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటుడు కళ్యాణ్ రామ్. కేవలం నటుడుగానే ముందుకు వెళ్లకుండా ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ సంస్థని స్థాపించి నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించాడు. బాల నటుడిగా కూడా పలు చిత్రాలలో నటించాడు. ‘తొలిచూపులోనే’ తెలుగు సినీ ప్రియులను ఆకట్టుకున్న సినీ అభిమన్యుడు. చలనచిత్ర రంగంలో ఎంతో మంది గాడ్ పాదర్స్ వున్న తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో ‘అతనొక్కడే’. తాత స్వర్గీయ ఎన్టీఆర్ బాటలోనే నటుడిగా…అభిరుచిగల నిర్మాతగా రాణిస్తున్నాడు. కథల విషయంలో రాజీ పడకుండా తన టేస్టుకు తగ్గట్టు సినిమాలు నిర్మిస్తున్నాడు. ఒకపక్క తమ్ముడు ఎన్టీఆర్, బాబాయ్ బాలకృష్ణలతో ఎలాంటి పోటీ లేకుండా తనకంటూ ఓన్ స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు. తెలుగు సినీ ప్రేక్షక లోకంలో తనకంటూ ఓన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు. ఓ పక్క హీరోగా నటిస్తూనే…ప్రొడ్యూసర్ గా తెలుగులో తొలి 3D యాక్షన్ మూవీగా ‘ఓం’ సినిమాను తీసి …నిర్మాతగా తన గట్స్ ఏంటో చూపించాడు. హీరోగా తన స్వీయ నిర్మాణంలో సినిమాలు నిర్మించడమే కాకుండా తోటి హీరోలతో సినిమాలు నిర్మిస్తున్నాడు. మాస్ రాజా రవితేజతో తను సినీ రంగానికి పరిచయం చేసిన సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ‘కిక్ 2’ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయింది. ఆ తర్వాత తమ్ముడు ఎన్టీఆర్‌తో బాబీ డైరెక్షన్‌లో చేసిన ‘జై లవకుశ’ మంచి విజయాన్ని అందుకున్నాడు. అంతేకాదు ఈ యేడాది తన తాతా నందమూరి తారకరామారావు జీవిత చరిత్రపై తెరకెక్కించిన ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో బాబాయి బాలకృష్ణతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.

3 ఎస్.పి రాయ్ చౌదరి
ఈ రోజు మన భారత జాతి అంతా గర్వపడే మరో మాహానుభావుడు సైతం జన్మించారు. ఓ సారి పి. హెచ్.డి. చేయడానికి దరఖాస్తు చేసుకున్న ఆ యువకుడి ని బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో జెనిటిక్స్ విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఎస్.పి రాయ్ చౌదరి, “ఏ అంశం మీద పరిశోధన చేయాలనుకుంటున్నావు?” అని అడిగాడు. ఆ యువకుడు వినమ్రంగా “మీరే సూచించండి!” అన్నాడు. “అయితే పాముల క్రోమో జోముల మీద పరిశోధన చేయి.” అని ఆదేశించాడు రాయ్ చౌదరి. “పాములా?” అని అడిగాడా యువకుడు భయం భయంగా. “అవును ఇంతవరకూ ఎవరూ ఆ అంశం మీద పరిశోధన చేయలేదు.” అన్నాడు ప్రొఫెసర్.
ఆ యువకుడు లాల్జీసింగ్. ఆయనకు పాములంటే భయం. కానీ తప్పదు. ప్రొఫెసర్ గారి ఆదేశం మరి! బెనారస్ హిందు యూనివర్సిటీలో బి.ఎస్.సి. (1964) యం.ఎన్.సి. (జంతుశాస్త్రం) 1966 పి.హెచ్.డి ( సైటోజెనిటిక్స్) 1971లో పూర్తి చేసుకుని అదే యూనివర్సిటీలో 1970 నుండి 1972 వరకు రిసెర్చి అసోసియేట్ గా పనిచేశాడు. అలాగే ఆయన కట్ల పాము జాతి మీద పరిశోధనలు చేసి డి.ఎన్.ఏ జన్యు పదార్థాన్ని విడదీయగలిగాడు. ఈ ప్రయోగమే డి.ఎన్.ఏ వేలిముద్రణ సాంకేతికతకు దారితీసింది. ఆ తర్వాత సిసియంబిలో సీనియర్ సైంటిస్టుగా చేరి హైద్రాబాదులోనే డి.ఎన్.ఏ. వేలిముద్రణ టెక్నాలిజీని రూపొందించాడు. ఆ తర్వాత Department of Biotechnology అనుమతితో డి.ఎన్.ఏ వేలిముద్రణ, రోగనిర్ధారణ కేంద్రం (CDFD) హైద్రాబాద్ లో ప్రారంభించారు.

4 రావూరి భరద్వాజ

ఈరోజు గొప్ప భావుకుడైన తెలుగు కవి మరియు రచయిత రావూరి భరద్వాజ గారు కూడా జన్మించారు. తెలుగు రచనా ప్రపంచంలో వినూత్న సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనుడితడు. మానవ భావోద్వేగాలే ప్రధానాంశాలుగా కథలు వ్రాసే భరద్వాజ శైలి సరళమైనది.పాత్ర చిత్రీకరణలో, ఒక సన్నివేశాన్ని పరిచయం చేయటంలో రావూరి భరద్వాజకు ఉన్న ఒడుపు అద్భుతమైనది. ఆడంబరాలులేని సాధారణ జీవితం ఆయనది. భరద్వాజకు దిగువ మధ్యతరగతి మరియు పేదప్రజల భాషపై గట్టిపట్టు ఉంది. ఒక బీదకుటుంబంలో జన్మించిన భరద్వాజ కేవలం ఉన్నత పాఠశాల స్థాయివరకే చదువుకున్నాడు. ఆతరువాత కాయకష్టం చేసే జీవితాన్ని ప్రారంభించాడు. చిన్నతనంలో పొలాల్లో గడిపిన భరద్వాజ వ్యవసాయ కూలీల కఠినమైన జీవన పరిస్థితులను గమనించేవాడు. అప్పుడే పల్లెప్రజల భాష, యాస, ఆవేశాలు, ఆలోచనలు, కోపాలు, తాపాలు గమనించిన భరద్వాజ ఆ అనుభవాలను తర్వాతకాలంలో తన రచనలలో నిజమైన పల్లె వాతావరణాన్ని సృష్టించడానికి ఉపయోగించుకున్నాడు.రావూరి భరద్వాజ 37 కథా సంపుటాలు, 17 నవలలు, 6 బాలల మినీ నవలలు, 5 బాలల కథా సంపుటాలు, 3 వ్యాస మరియు ఆత్మకథా సంపుటాలు, 8 నాటికలు మరియు ఐదు రేడియో కథానికలు రచించాడు. ఈయన బాలసాహిత్యంలో కూడా విశేషకృషి సలిపాడు. సినీ పరిశ్రమలో తెరవెనుక జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చిత్రీకరించిన పాకుడు రాళ్ళు నవల భరద్వాజ యొక్క ఉతృష్ట రచనగా పరిగణింపబడుతుంది. ఈ నవలకు గాను ఆయనకు జ్ఞానపీఠ్ అవార్డు లభించింది. సినీ ప్రపంచంలోని వ్యక్తుల అంతరంగాలను ప్రతిభావంతంగా చిత్రీకరించిన తొలి తెలుగు నవలగా పాకుడురాళ్లు ప్రశంసలు అందుకుంది.

5 జావేద్ అలీ
తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో పాటలు పాటిన సింగర్ జావేద్ అలీ పుట్టిన రోజు కూడా ఈ రోజే. ఆయన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి. ఉప్పెన, బందోబస్త్, రారండోయ్ వేడుక చూద్దాం, కొమురం పులి, సన్నాఫ్ సత్యముర్తి లో ఉపేంద్ర ఇంట్రడక్షన్ సాంగ్ వచ్చాడు వచ్చాడు, అల్లుడు శ్రీను, గోవిందుడు అందరివాడేలే ఇలా వరసపెట్టి చాలా సినిమాల్లో పాటలు పాడేసాడు. మన తెలుగువాళ్లకు తెగ నచ్చేసాడీ బాలీవుడ్ సింగర్. ఎక్కువగా హిందీ సాంగ్ లు పాడే ఈ గాయకుడు పాట పాడటానికి భావం అర్దమైతే చాలు అంటాడు. అందుకే బెంగాళి,కన్నడ, మళయాళం, మరాఠి, ఒరియా, తమిళ్, తెలుగు, అస్సామీ , ఉర్దూ ఇలా వరసపెట్టి పాడుతూనే ఉన్నాడు. ఈయకు దేశవ్యాప్తంగా వీరాభిమానులు ఉన్నారు.

6 రాంవిలాస్‌ పాశ్వాన్

ఇదే రోజు ప్రముఖ రాజకీయనాయకుడు కేంద్ర ప్రజాపంపిణీ శాఖ మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్ పుట్టిన రోజు కూడా. ఆయన లోక్‌ జన్‌శక్తి పార్టీ అధ్యక్షుడు కూడా. బీహార్ లో ఓ దళిత కుటుంబం నుంచి వచ్చిన పాశ్వాన్ ..దళిత హక్కుల కోసం మొదట నుంచీ పోరాడుతూనే ఉన్నారు. లా డిగ్రీ చేతిలో పట్టుకున్న ఆయన అప్పట్లోనే అంటే 1969లోనే బీహార్ డీఎస్పీగా సెలక్ట్ అయ్యారు.అలాగే ఆయన ప్రైవేట్‌ రంగంలో కూడా 60శాతం రిజర్వేషన్లు కల్పించాలి. దీంతోపాటు ఆల్‌ ఇండియా జ్యుడిషియల్‌ సర్వీసెస్‌ ఏర్పాటు చేయాలి. దీనివల్ల పారదర్శకత పెరుగుతుంది అనే విషయంపై చాలా కాలంగా పోరాడుతున్నారు. చాలా మందికి స్పూర్తి ప్రధాతగా నిలుస్తున్నారు.

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.ఈ ఆర్టికల్ ని బెస్ట్ విషెస్ యూట్యూబ్ ఛానల్ వారి సౌజన్యం తో అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ ని వీడియో లో చూడడం కోసం కింద ఉన్న వీడియో ని క్లిక్ చేయండి 

Banner
, , , , ,
Similar Posts
Latest Posts from Vartalu.com