Banner
banner

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు. ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా… ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

1 అల్లూరి సీతారామరాజు

తెల్లోడి పెత్తనం మీద గర్జించిన తెలుగు తేజం అల్లూరి సీతారామరాజు పుట్టిన రోజు ఈ రోజే. పశ్చిమ గోదావరి జిల్లా అడవుల్లో పుట్టిన ఓ అగ్నికణం దావాణలంలా వ్యాపించి బ్రిటీష్‌ సామ్రాజ్య గుండెల్లో వణుకు పుట్టింది. స్వతంత్రం సాదించటానికి ఆయుధాలు సుశిక్షుతులైన సైనికులు కాదు..అది సాధించాలన్న కాంక్ష చాలని నిరూపించిన అసలు సిసలు భారతీయుడు అల్లూరి. అందుకే లోకజ్ఞానం లేని అడవి బిడ్డలనే ఆయుధాలుగా మార్చి తెల్లదొరలు గుండెలు చీల్చాడు. తెలుగు వీర లేవరా, దీక్షబూని సాగరా… దేశమాత స్వేచ్చ కోరి తిరుగుబాటు చేయరా… అంటూ భరతమాత విముక్తి కోసం బ్రిటీషువారిని గడగడలాడించిన మన్యం వీరుడు మన అల్లూరి సీతారామరాజు. అల్లూరి ఒక వ్యక్తి కాదు ఆయనో మహోజ్వల శక్తి. ఆయన జీవితం విప్లవానికి ఒక సంకేతం. కేవలం 27 ఏళ్ళ వయసులోనే చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు. ప్రతీ గిరిజనున్ని ఒక గెరిల్లా యోధునిగా మార్చి తెలుగు నేలకు స్వతంత్ర పోరాట మార్గం చూపాడు..‘గిరిజన హక్కుల కోసం అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం అన్ని తరాలకూ స్ఫూర్తిదాయకం. ఆ అమరవీరుని ప్రాణత్యాగం తెలుగువారి దేశభక్తిని, పోరాట పటిమను ప్రపంచానికి చాటింది. చిరస్మరణీయుడు అల్లూరిని మీ పుట్టిన రోజు సందర్భంగా మననం చేసుకోవటం అదృష్టమే కదా.

2 గుల్జారీలాల్ నందా
ఈ రోజున మరో మహానుభావుడు జన్మించారు. చాలా మందికి ఆయన గుర్తు ఉండకపోయి ఉండవచ్చు. ఏదైనా పదవి అనుకోకుండా వస్తే ఆ పదివిని ఎలా స్దిరపరుచుకోవాలా అని ప్రజా ప్రతినిధులు ఆలోచించే కాలంలో, రెండు సార్లు ఆపర్ధమ్మ ప్రధాన మంత్రిగా వ్యవహించినా ఆ తర్వాత పార్టీ పెద్దలు ఎవరిని ఆ స్దానంలో కూర్చోబెట్టాలనుకుంటే వారికి భాధ్యతలు అప్పగించి తప్పుకుని తనకు ఇచ్చిన భాధ్యతను చిత్తశుద్దితో అమలుచేసిన వ్యక్తి,మహానుభావుడు గుల్జారీలాల్ నందా. చైనా దాడి తర్వాత భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఆరోగ్యం క్షీణించి,మరణించినప్పుడు తాత్కాలిక ప్రధానిగా 14 రోజులు పనిచేసారు నందా. తిరిగి పాకిస్దాన్ తో యుద్దం ముగిసి, శాంతి ఒప్పందం మీద సంతకం చేసిన మరుసటి రోజే అనూహ్య పరిస్దితుల్లో లాల్ బహదూర్ శాస్త్రి మరణించినప్పుడు తిరిగి ఆపద్దర్మ ప్రధానిగా 14 రోజులు పనిచేసిందీ నందానే. అంతేకాదు కేంద్రలో కీలక శాఖలై విదేశాంగ, అంతర్గత వ్యవహారాలను నిర్వహించిన ఈ నాయకుడుకి చివరకు సొంత ఇల్లు కానీ, కారు కానీ లేదు. తాను నమ్మిన గాంధీ సిద్దాంతాలకు అనుగుణంగా జీవితం కొనసాగించిన అతి కొద్ది మందిలో నందా ఒకరు. తన మూడు శతాబ్దాల మచ్చలేని రాజకీయ జీవితం గడిపిన నందాకు.. 1997లో ఈయనకు భారత రత్న పురస్కారం లభించింది.

3 వంగవీటి మోహన రంగా
పేదల పక్షపాతి గా నిలిచి బడుగు వర్గాల సంక్షేమమే ధ్యేయంగా జీవితాంతం పోరాడిన దివంగత వంగవీటి మోహన రంగా ఈ రోజునే జన్మించారు. రంగా కృష్ణ జిల్లా, ఉయ్యురు మండలం లోని కాటూరులో జన్మించారు. 1974 లో హత్య చేయబడ్డారు. అణగారిన వర్గాల నాయకుడు అయిన రంగా వేరే కులానికి చెందిన చెన్నుపాటి రత్నకుమారిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఈయనకి ఇద్దరు సంతానం : వంగవీటి రాధాకృష్ణ మరియు వంగవీటి ఆషా.వంగవీటి మోహన్ రంగా ఒక వర్గానికి, ఓ ప్రాంతానికి, ఓ కులానికి చెందిన వ్యక్తి కాదని పేదల బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి నిరంతరం పాటుపడి అన్ని వర్గాల అభిమానాన్ని చొర గోన్నారని అభిమానులు చెప్తూంటారు.

4 కొణిజేటి రోశయ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నరుగా పనిచేసిన కొణిజేటి రోశయ్య కూడా ఈ రోజే పుట్టారు. మంచి వక్తగా పేరుతెచ్చుకున్న ఆయనకు ఆర్థిక సంబంధ విషయాలు, రాజకీయాలపై మంచి పట్టు ఉంది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో రోడ్డు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా పనిచేసారు. ఆ తరువాత అనేక ముఖ్యమంత్రుల మంత్రివర్గాలలో పలు కీలకమైన శాఖలు నిర్వహించారు. అంతకుముందు ఎన్నెన్నో పదవులు చేపట్టినా సరే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయన ప్రాధాన్యం పెరిగింది… ప్రత్యేకించి వైఎస్ పథకాలకు డబ్బు సర్దుబాటు, బడ్జెట్ సర్దుబాట్లతో ఓ సీనియర్ ఆర్థిక మంత్రిగా, వైఎస్ఆర్ కీలక మంత్రివర్గ సహచరుడిగా ఆయన ప్రాముఖ్యత సంపాదించారు… వివాదరహితంగా ఉండే ఆయనను తాత్కాలిక సర్దుబాటుగా వైఎస్ఆర్ మరణం తరువాత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. పద్నాలుగు నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం పదవికి రాజీనామ చేసారు. ఆ తర్వాత రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘ కాలంపాటు ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఘనత రోశయ్యదే. ఎన్జీరంగా రాజకీయ భావజాలంతో ఎదిగి, తన వాదనా పటిమతో, అంచెలంచెలుగా రాజకీయంగా ఎదిగి, దక్షిణాదిన…, ప్రత్యేకించి తెలుగునాట వైశ్య రాజకీయ ప్రతినిధిగా ప్రాచుర్యం పొందిన ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితానుభవం గల ఆయన పుట్టిన రోజే మీరూ పుట్టడం కాకతాళీయమే అయినా చెప్పుకోదగ్గ విషయమే.

5 ఎస్ గోపాల్ రెడ్డి

సినీ రంగంలో తనదైన పేరు ప్రఖ్యాతలు సంపాదించిన సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి పుట్టింది కూడా ఈ రోజే. ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 1980 వ దశకంలో అనేక తెలుగు, బాలీవుడ్ సినిమాలకు పనిచేశాడు. 1980 వ దశకంలో అమితాబ్ బచ్చన్ నటించిన ఆఖరీ రాస్తా, ఇంక్విలాబ్, సూర్యవంశీ మొదలైన సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాడు. తరువాత 1990 వ దశకంలో అజయ్ దేవగణ్, సైఫ్ ఆలీ ఖాన్ నటించిన కచ్చే ధాగే సినిమా కూడా ఆయనకు పేరు తెచ్చిన చిత్రం. ఆయన మొత్తం 150 సినిమాలకు పైగా పనిచేస్తే అందులో నాగార్జున హీరోగా నటించినవి 15 సినిమాలున్నాయి. నటన పరంగా, దర్శకత్వ పరంగా, నిర్మాణ పరంగా ఆయన పని చేసిన సినిమాలు ఫెయిల్యూర్ అయ్యుండవచ్చు. కానీ కెమెరా పరంగా ఎప్పుడూ ఫెయిల్యూర్ కాలేదు.ఆయన కెమెరామెన్ గానే కాకుండా నిర్మాతగానూ మారి హిట్ సినిమాలు తీసారు. క్షణ క్షణం, దొంగాట, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఆయన నిర్మాతగా పేరు తెచ్చిన సినిమాలు. రవితేజ హీరోగా నటించిన, తమిళ సినిమాకు రీమేక్ అయిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.

6 కీరవాణి

శ్రావ్యమైన సంగీతానికి మారుపేరు ఎం.ఎం.కీరవాణి. రాగాల్లో కీరవాణి రాగం ప్రశస్తమైనది. ఆ పేరును పెట్టుకుని సంగీత సామ్రాజ్యాన్ని ఏలుతున్న కీరవాణి పుట్టిన రోజు నేడు. 1987వ సంవత్సరంలో తెలుగు ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్ గా కీరవాణి కెరీర్ని మొదలుపెట్టారు. 1990లో విడుదలైన ‘మనసు మమత’ చిత్రం ద్వారా ఈయన సంగీత దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఎస్.రాజేశ్వరరావు, కె.వి.మహదేవన్ వంటి ఉద్ధండుల నిష్క్రమణానంతరం నేటి తరం తెలుగు సంగీత దర్శకులలో సంగీత ప్రధాన చిత్రాలకు సంగీతం సమకూర్చగల ఒకే ఒకనిగా పేరొందాడు. ఇప్పటి వరకూ కీరవాణి గారు విభిన్న భాషల్లో చిత్రాలకు సంగీతాన్ని అందించి ప్రేక్షకుల్ని అలరించారు. 1997 లో వచ్చిన అన్నమయ్య చిత్రానికి గాను జాతీయస్థాయిలో ఉత్తమ సంగీతదర్శకునిగా పురస్కారాన్ని అందుకున్నాడు. అలాగే ఇప్పటివరకూ ఈయన 8 నంది అవార్డులు గెలుచుకున్నారు. కీరవాణి సంగీతం సమకూర్చిన సినిమాలలో చెప్పుకోదగినవి సీతారామయ్యగారి మనవరాలు, క్షణ క్షణం, అల్లరి మొగుడు, మేజర్ చంద్రకాంత్, అల్లరి ప్రియుడు, అన్నమయ్య, శ్రీరామదాసు, నేనున్నాను, స్టూడెంట్ నంబర్ 1, ఛత్రపతి, సింహాద్రి, అనుకోకుండా ఒక రోజు, ఆపద్బాంధవుడు, శుభ సంకల్పం, పెళ్లి సందడి, బాహుబలి, మరియు సుందరకాండ.
కీరవాణి ఎం.ఎం క్రీమ్ అనే పేరుతో బాలీవుడ్లో కూడా కొన్ని చిత్రాలకు సంగీతాన్ని అందించారు, అలాగే మరగత మణి అనే పేరుతో కోలీవుడ్లో కూడా కొన్ని చిత్రాలకు సంగీతాన్ని అందించారు.

ఇప్పటిదాకా చెప్పుకున్న ఇంతటి గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.ఈ ఆర్టికల్ ని బెస్ట్ విషెస్ యూట్యూబ్ ఛానల్ వారి సౌజన్యం తో అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ ని వీడియో లో చూడడం కోసం కింద ఉన్న వీడియో ని క్లిక్ చేయండి 

Banner
, , ,
Similar Posts
Latest Posts from Vartalu.com