Banner
banner

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు. ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా… ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

1 హీరోయిన్ గౌతమి

సినిమా రంగంలో ఓ మహిళా తరంగంగా పేరొందిన గౌతమి ఈ రోజే జన్మించింది. ఆమె పదహారణాల తెలుగుమ్మాయికి ప్రతీకగా నిలిచిన నటి. మూడు దశాబ్దాలుగా తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ భాషా చిత్రాల్లోని వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించింది. జయాపజయాలతో నిమిత్తం లేకుండా ఓ పక్క రీల్‌ కెరీర్‌లో, మరో పక్క రియల్‌ లైఫ్‌లో ప్రమాదకరమైన క్యాన్సర్‌ని ఆత్మస్థయిర్యంతో జయించి స్ఫూర్తిగా నిలిచింది విజయాలు, వివాదాలు, విపత్కర పరిస్థితులతో సావాసం చేసిన గౌతమి పశ్చిమ గోదావరిలోని నిడదవోలులో లై 2న జన్మించారు. 19వ ఏట ‘దయామయుడు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం ఆయ్యారు. తర్వాత ‘గాంధీ నగర్‌ రెండో వీధి’ చిత్రంలో నటించారు. మూడు దశాబ్దాల కాలంలో తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ, హిందీ వంటి భాషల్లో సుమారు 130 చిత్రాల్లో నటించి నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
సినిమాల్లోనే కాకుండా పలు తమిళ సీరియల్స్‌లోనూ నటించి బుల్లి తెర ప్రేక్షకుల్ని సైతం గౌతమి మెప్పించారు. వీటితోపాటు పలు టెలివిజన్‌ షోలకి యాంకరింగ్‌ చేశారు. కొన్నేళ్ళ విరామం తర్వాత కమల్‌హాసన్‌ సరసన ‘పాపనాశం’ చిత్రంలో గౌతమి నటించారు. వృత్తిపరంగా విజయాల బాటలోనే ఉన్నా, వ్యక్తిగతంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న తరుణంలో ప్రమాదకర బ్రెస్ట్‌ క్యాన్సర్‌ గౌతమిని అతలాకుతలం చేసింది. మొండి ధైర్యంతో, ఆత్మస్థయిర్యంతో ఆ క్యాన్సర్‌ మీద గౌతమి విజయం సాధించి, ఈ తరహా బాధ పడుతున్న ఎంతో మంది క్యాన్సర్‌ బాధితులకు స్ఫూర్తిగా నిలిచింది.

2 మైలస్వామి అన్నాదురై

ఈ రోజున పుట్టిన మరో గొప్ప వ్యక్తి…మైలస్వామి అన్నాదురై. అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్‌కు తిరుగులేదని ఇస్రో శాస్త్రవేత్త, చంద్రయాన్‌-1, మంగళయాన్‌ ప్రాజెక్టుల డైరెక్టర్‌ డా. మైలస్వామి అన్నాదురై . 2008 అక్టోబరు 24న చంద్రయాన్‌-1 విజయవంతంగా చంద్రుడిపై చేరిందంటే దాని వెనుక మైలస్వామి అన్నాదురై కృషి ఎంతో ఉంది. ఇస్రో శాస్త్రవేత్తల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అన్నాదురై కీలకమైన చంద్రయాన్‌-1 ప్రయోగం కోసం ఎంతో శ్రమించారు. ప్రస్తుతం చంద్రయాన్‌-2 ప్రయోగం కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరగబోతోంది. ప్రస్తుతం ఉపగ్రహ రూపకల్పన ఏర్పాటు మొత్తం ఆయన సమక్షంలోనే సాగుతున్నాయి. ఈ ప్రయోగంలో 5 ఉపగ్రహాల సేవలను ఉపయోగించుకోవాలని ఇస్రో భావిస్తోంది. అందులో భాగంగానే చంద్రయాన్‌-1కు ఉపయోగించిన రెండు ఉపగ్రహాలతో పాటు తాజాగా చంద్రయాన్‌-2కు కొత్తగా మరో మూడు ఉపగ్రహాలను రూపొందిస్తున్నారు. అన్నాదురై ఆలోచనల మేరకే అత్యంత కీలకమైన చంద్రయాన్‌-2 ప్రయోగానికి 5 ఉపగ్రహాలను ఉపయోగించాలని ఇస్రో భావిస్తూ ఆ దిశగానే ఖర్చుకు వెనుకాడకుండా ఏర్పాట్లు చేస్తోంది.

3 కృష్ణ భగవాన్

తెలుగులో ప్రముఖ కామెడీ యాక్టర్ కృష్ణ భగవాన్ పుట్టింది కూడా ఈ రోజే. తెరపై కనిపించి నవ్వుల పువ్వులు పూయించే కృష్ణ భగవాన్ నిజజీవితంలో భలే మొహమాటస్తుడు… అయినా కెమెరా ముందుకు వస్తే మాత్రం పాత్రలోకి ఇట్టే పరకాయప్రవేశం చేసి మురిపించగలరాయన. కృష్ణ భగవాన్ తనకు లభించిన పాత్ర కోసం ఆట్టే కష్టపడిన దాఖలాలు కనిపించవు… తన మాటల విరుపుతోనే కేరెక్టర్ కు కామెడీ టచ్ ఇస్తూ ఉంటాడు కృష్ణ భగవాన్… ఆరంభంలో వంశీ చిత్రాలకు రచనలో పాలుపంచుకున్న కృష్ణ భగవాన్ కు అదే వంశీ తెరకెక్కించిన ‘ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’ మంచి గుర్తింపును సంపాదించి పెట్టింది… ఆ తరువాత కృష్ణ భగవాన్ తనదైన బాణీ పలికిస్తూ ముందుకు సాగారు. మొన్నటి దాకా దూకుడు మీద సాగిన కృష్ణ భగవాన్ కెరీర్ ఈ మధ్య నెమ్మదించింది… అయినా కృష్ణ భగవాన్ కామెడీని ఇష్టపడేవారి సంఖ్య గణనీయంగానే ఉంది…

4 రిచా పూజారి
ప్రముఖ చెస్ ప్లేయర్ రిచా పూజారి కూడా ఇదే రోజున జన్మించింది. ఆమె ప్రస్తుతం ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ గా కొనసాగుతున్నారు. గతంలో Woman FIDE Master గా ఎంపిక అయ్యారు. మహారాష్ట్ర కొల్హాపూర్ లో పుట్టిన ఈమె ఆరేళ్ల ప్రాయం నుంచే చెస్ అంటే ఆసక్తి చూపించేది. తన సోదరుడుతో కలిసి ఆడి తన నిపుణతను పెంచుకుంది. ఏడేళ్ళ వయస్సులో ఫస్ట్ నేషనల్ ఛాంపియన్ షిప్ సాధించాక గుర్తింపు వచ్చింది. తర్వాత అదే రంగంలో ఆమె రాణిస్తూ కొనసాగుతోంది. కామన్ వెల్త్ చెస్ ఛాంపియన్ షిప్ లలోనూ ఆమె పాల్గొని మన దేశానికి పేరు తెచ్చింది.

5 లిండ్సే లోహన్

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కుర్రాళ్లకు ఆరాధ్యదైవమైన లిండ్సే లోహన్ కూడా ఇదే రోజున జన్మించింది. ది పేరెంట్ ట్రాప్, మీన్ గర్ల్స్, ప్రీకీ ఫ్రైడే, ఐ నో హూ కిలెడ్ మీ వంటి అనేక హాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. హాలీవుడ్ నటిగానే కాకుండా, పలు చిత్రాలకు సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది.లిండ్సే లోహన్ పూర్వీకులు ఐరిస్, ఇటాలియన్ భిన్న సంస్కృతులకు చెందిన వారు. ఆమె క్యాథలిక్ గానే పెరిగింది.ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి పాల్పడుతూ పాపులారిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది లిండ్సే లోహన్. అప్పుడపుడూ నగ్నంగా అందాల విందు చేస్తూ ఉంటుంది. నగ్నత్వం అనేది ఆమెకు కొత్తేమీ కాదు. గతంలో ప్లేబాయ్ లాంటి మేగజైన్లపై న్యూడ్ ఫోజులు ఇచ్చింది. అభిమానులు ఆమెను ఆమెను శృంగార దేవతలా ఆరాదిస్తారు.

6 కన్నడ హీరో గణేష్
గోల్డెన్ స్టార్ గణేష్..కన్నడంలో ఓ స్టార్ హీరో..ఇతనది కూడా ఈ రోజే పుట్టిన రోజు. టీవీల్లో ప్రెజెంటర్ గా కెరీర్ మొదలెట్టి కన్నడం సినిమాల్లో స్టార్ గా ఎదగటం అంటే మామూలు విషయం కాదు. టీవీల్లో షోలు చేసే అతను అదే షోలకు గెస్ట్ గా వెళ్లారు. ఓ టైమ్ లో కన్నడంలో ఎక్కువ రెమ్యునేషన్ తీసుకునే హీరోగా ఎదిగారు. ఆయన నటించిన ముంగార మలై సినిమా పెద్ద హిట్. అతి తక్కువ బడ్జెట్ లో తీసిన ఆ సినిమా 75 కోట్లు సంపాదించి రికార్డ్ లు క్రియేట్ చేసింది. ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న గణేష్ పుట్టిన రోజే మీరూ పుట్టడం విశేషమే.

ఇప్పటిదాకా చెప్పుకున్న ఇంతటి గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.ఈ ఆర్టికల్ ని బెస్ట్ విషెస్ యూట్యూబ్ ఛానల్ వారి సౌజన్యం తో అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ ని వీడియో లో చూడడం కోసం కింద ఉన్న వీడియో ని క్లిక్ చేయండి 

Banner
, , ,
Similar Posts
Latest Posts from Vartalu.com